ఒంటిమిట్ట రామయ్యకి ఏపీ అధికార లాంఛనాలు
posted on Feb 19, 2015 @ 12:50PM
అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీరామనవమి వేడుకలు భద్రాచలంలో వైభవంగా జరిగేవి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి భద్రాద్రి రామయ్యకి ప్రభుత్వ లాంఛనాలు అందేవి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత భద్రాచలం దేవాలయం తెలంగాణ రాష్ట్రంలోకి వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన శ్రీరామనవమి వేడుకలు ఎక్కడ జరపాలన్న సందేహం నిన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, శ్రీరామ భక్తులు, అధికార వర్గాల్లో వుండేది. ఇప్పుడు ఆ సందేహం తొలగిపోయింది. కడప జిల్లాలో, కడపకు చాలా సమీపంలో వున్న ఒంటిమిట్ట ఒంటిమిట్ట కోదండరాముడి ఆలయంలో శ్రీరామ నవమి వేడుకలు అధికారికంగా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇకనుంచి ఒంటిమిట్ట కోదండరాముడికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలు అందనున్నాయి. దీనికి సంబంధించిన ఫైలు మీద ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంతకం కూడా చేసేశారు.