కేంద్రంలో పదవుల పందేరంపై ఆశలు
posted on Oct 17, 2012 @ 11:45AM
ఎప్పుడెప్పుడు కేంద్ర మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందోనని ఆశగా చూస్తున్న రాష్టనాయకులకు విజయదశమికి ముందే ముఖ్యమంత్రిని ఢిల్లీకి పిలవడం ద్వారా ఆంద్రప్రదేశ్ కు ఎంతవరకూ అవకాశం ఇస్తారోనని అధికార కాంగ్రెస్ వర్గాలు బలాబలాలు అంచనా వేస్తున్నారు, ప్రత్యర్ధిపార్టీలన్నీ బిసి , ఎస్టీ, ఎస్సీ లను కలుపుకుంటూ దూసుకై పోతుంటే తాము మాత్రం వెనుకబడి పోయామని అధికార కాంగ్రెస్ భావిస్తుంది. అందుకే ఈ సారి అయినా బిసిలకు కేంద్రంలో స్థానం ఇవ్వాలని బిసి సంఘాలు కోరుతున్నాయి. అందుకు గానూ చిరంజీవిని మంత్రి వర్గంలోకి తీసుకోవాలని కోరుతున్నారు. అయితే అదే సామాజిక వర్గానికి చెందిన పల్లంరాజు ఇప్పటికే కేంద్రంలో సహాయ మంత్రిగా ఉన్నారు. కమ్మ వర్గానికి చెందిన కావూరి సాంబశివరావు, రాయపాటి సాంబశివరావులు ఎప్పటినుండో తాము కాంగ్రెస్ పార్టీలో ఉన్నా తమకు ప్రాధాన్యత నివ్వడంలేదని విసుగు చెందుతున్నారు. అంతే కాక తమ వర్గానికి తీరని అన్యాయం జరుగుతుందని కూడా వారు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆ వర్గానికి చెందిన దగ్గుపాటి పురంధేశ్వరి కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. వెనుకబడిన వర్గాలను అన్ని పార్టీలు కలుపుకు పోతున్నాయని వైసిపి ని ధైర్యంగా ఎదుర్కొనే శక్తి తనకే ఉందని భావిస్తున్న హనుమంతరావు చెబుతున్నారు. సోనియా కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యం, వారికి ఆయనపై వారికి ఉన్న విశ్వాసం తో పాటు తెలంగాణాలో ఒకరికి మంత్రి పదవి ఇవ్వవలసి ఉంటుందని అందువల్ల కూడా రేస్ లో హనుమంతు ముందున్నారని తెలుస్తుంది. కర్నూల్నుండి ఎంపి కోట్ల సూర్య భాస్కరరెడ్డి పేరుకూడా ప్రముఖంగా వినిపిస్తుంది. వైయస్ జగన్ని కర్నుల్ ఓదార్పు యాత్రకు రానివ్వకుండా అడ్డుకుంటంతో అధిష్టానం మదిలో చోటు సంపాదించారు. యస్సీ వర్గనికి చెందిన పనబాక లక్మీ పనితీరుపై నాయకత్వం అసంతప్తిగా ఉన్నారని తెలుస్తుంది. అందువల్ల ఆమె స్దానంలో ఎంపీ సర్వే సత్యన్నారాయణకు అవకాశం కల్పించే వీలుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణవాదం, పార్టీ ప్రయోజనాలను గుర్తుంచుకొని ఇంతవరకు ఒక్కసారి కూడా మాదిగలకు కేంద్రపదవి ఇవ్వక పోవడం ఇంకా తెలుగుదేశం పార్టీ మాదిగలకు దగ్గరవడం వల్లకూడా దాన్ని అడ్డుకోవడానికి గానూ సర్వేకు మంత్రి పదవి దక్కవచ్చునంటున్నారు.