హోంమంత్రి సబితా కు ఓదార్పు
posted on Apr 9, 2013 @ 4:56PM
జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ దాఖలు చేసిన చార్జ్ షీట్ లో హోంమంత్రి సబితాఇంద్రారెడ్డి ని నిందితురాలిగా చేర్చడంతో ఆమె రాజీనామాకు సిద్దపడ్డారు. ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు బొత్స వారించడంతో వెనక్కి తగ్గారు. రాజీనామా పై వెనక్కి తగ్గిన హోంమంత్రి సబితాఇంద్రారెడ్డి ని ఓదార్చే౦దుకు కాంగ్రెస్ మంత్రులు ఆమె ఇంటి వద్ద వాలిపోతున్నారు.
మంత్రి కన్నా లక్ష్మీనారాయణ:
ఆరోపణలు వచ్చిన వారంతా రాజీనామా చేయాలంటే రాష్ట్రంలో ఎందరో రాజీనామా చేయాల్సి వస్తుందని మంత్రి కన్నా అన్నారు. బిజినెస్ రూల్ ప్రకారమే హోంమంత్రి సబిత వ్యవహరించారని, ఆమె ఎలాంటి తప్పు చేయలేదని మంత్రి కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు.
మంత్రి డికె. అరుణ:
హోంమంత్రి సబిత ఎలాంటి తప్పు చేయలేదని మంత్రి డికె. అరుణ తెలిపారు. తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని హోంమంత్రిని కోరినట్లు మంత్రి చెప్పారు.
ఎమ్మెల్యే శేషారెడ్డి:
హోంమంత్రి సబిత ఏ తప్పూ చేయలేదని ఎమ్మెల్యే శేషారెడ్డి అన్నారు. మైనింగ్ వ్యవహారాలన్నీ కేంద్ర ప్రభుత్వమే చూసుకుంటుందని, తప్పు జరిగిందని అనాడు ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. సీబీఐ చార్జిషీట్‌లో పేరు ఉన్నంత మాత్రాన రాజీనామా చేయాల్సిన అవసం లేదని ఎమ్మెల్యే శేషారెడ్డి స్పష్టం చేశారు.
విప్ శివరాంరెడ్డి:
హోంమంత్రి సబిత ఎలాంటి తప్పు చేయలేదని, ఆమెపై ఆరోపణలు రావడం దురదృష్టకరం అని విప్ శివరాంరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాజీనామా చేయొద్దని సబితను కోరినట్లు ఆయన తెలిపారు.