జగన్‌లానే విజయసాయికి బిగుస్తున్న ఉచ్చు?.. సీబీఐ మెమోతో కీలక మలుపు..
posted on Aug 13, 2021 @ 12:57PM
బెయిల్ రద్దుపై మాకు అభ్యంతరం లేదు అంటేనే.. ఇటు ఏ1 జగన్‌కు, అటు ఏ2 విజయసాయిరెడ్డికి సీబీఐ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రెండేళ్లుగా బెయిల్‌పై బయట ఉంటూ.. ఏపీని ఏలుతున్నారు. అట్టెట్టా.. ఏ1, ఏ2లు బెయిల్‌పై బయట ఉంటే ఎట్టా? సాక్షులను ప్రభావితం చేస్తున్నారంటూ ఎంపీ రఘురామ అదే సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో.. సీన్ మొత్తం సితార్ అవుతోంది. సీఎం జగన్‌కు వ్యతిరేకంగా వేగంగా పరిణామాలు మారిపోతున్నాయి. ఆగస్టు 25న తుది తీర్పుకు కోర్టు సిద్దమవుతోంది. ఫైనల్ జడ్జిమెంట్‌లో జగన్ బెయిల్ తప్పకుండా రద్దు అవుతుందని రఘురామ ధీమాగా ఉండగా.. వైసీపీ వర్గాల్లో కలవరం మొదలైంది.
బెయిల్ రద్దై తమ ఏ1 నేత జైలుకెళ్లినా.. ఏ2 విజయసాయిరెడ్డి ఉన్నారుగా.. ఆయనతోనైనా అడ్జస్ట్ అవుదామని కలలుకంటున్న వైసీపీ వర్గానికి రఘురామ మరో షాక్ ఇచ్చాడు. విజయసాయి బెయిల్ కూడా రద్దు చేయాలంటూ అదే సీబీఐ కోర్టులో మరో పిటిషన్ కూడా వేయడంతో అంతా ఉలిక్కిపడ్డారు. ఏ1, ఏ2 ఇద్దరూ ఒకేసారి జైలుకు వెళితే ఎలా అని మదనపడుతున్నారని అంటున్నారు.
తాజాగా, కోర్టులో సీబీఐ దాఖలు చేసిన మెమోతో మరింత క్లారిటీ వచ్చేసింది. సేమ్ టూ సేమ్.. జగన్ కేసు విషయంలో ఎలాగైతే నడుచుకుంటోందో అచ్చం అలానే అడుగులు వేస్తోంది. బెయిల్ రద్దు పిటిషన్‌పై నిర్ణయాన్ని కోర్టుకే వదిలేస్తూ.. కోర్టు విచక్షణ మేరకు పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవాలంటూ న్యాయస్థానంలో మెమో దాఖలు చేసింది సీబీఐ. అంటే, బెయిల్ రద్దు విషయంలో సీబీఐ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. మరోవైపు, సీబీఐ నిర్ణయంపై కౌంటర్ దాఖలు చేసేందుకు గడువు కావాలని విజయసాయిరెడ్డి కోర్టును కోరారు. తదుపరి విచారణను ఈనెల 16కు వాయిదా పడింది.
రూల్ ఈజ్ రూల్.. రూల్ ఫర్ ఆల్ అన్నట్టు.. కోర్టు విచక్షణకే వదిలేయడం.. జగన్-విజయసాయిలకు సీబీఐ సహాయనిరాకరణ చేస్తోందనే విషయం స్పష్టమవుతోందని అంటున్నారు. ఇటు బెయిల్ రద్దు చేయాలని కానీ, అటు బెయిల్ రద్దు చేయొద్దని గానీ చెప్పకుండా.. తటస్థంగా సీబీఐ వ్యవహరించడం.. వ్యూహాత్మకమని అంటున్నారు. సీబీఐ ఎలాంటి నిర్ణయం వెల్లడించినా.. అది పరోక్షంగా కేంద్ర వైఖరికి నిదర్శనంగా మారుతుంది. అందుకే, తమపై అలాంటి ఎలాంటి మచ్చ పడకుండా.. కోర్టు నిర్ణయానికి వదిలేయడం.. కీలక పరిణామం అంటున్నారు.
నిబంధనలు, రఘురామ తరఫు వాదనలు, సాక్షాలు.. జగన్, విజయసాయిలకు వ్యతిరేకంగా ఉన్నాయనేది న్యాయనిపుణుల మాట. ఆ లెక్కన.. ఆగస్టు 25న జగన్ బెయిల్ రద్దు కావడం.. ఆ తర్వాత కొన్నాళ్లకే విజయసాయిరెడ్డి బెయిల్ కూడా క్యాన్సిల్ కావడం ఖాయమనే చర్చ న్యాయ వర్గాల్లో జరుగుతోంది. ఇలా.. రఘురామ ఒకేసారి జగన్-విజయసాయి ధ్వయాన్ని.. మళ్లీ జంటగా జైలు పాలు చేసేలా ఉన్నారంటూ ఏపీలో చర్చ జరుగుతోంది. అందుకే, వైసీపీ శ్రేణులకు రఘురామ విలన్‌గా మారితే.. జగన్ వ్యతిరేకులకు హీరోలా కనిపిస్తున్నారు. ఏకకాలంలో హీరో+విలన్ అయిన ఘనత రఘురామకే దక్కుతుంది. చాలాకాలంలో జగన్‌పై.. వన్‌మ్యాన్ ఆర్మీలా వార్ చేయడం రఘురామకే సాధ్యమవుతోంది.