రేవంత్ రెడ్డి ఎక్కడికైనా వెళ్లొచ్చు.. హైకోర్టు
posted on Sep 8, 2015 @ 12:21PM
నోటుకు ఓటు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న తెదేపా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి ఇంతకుముందు కోర్టు షరతులతో కూడిన బెయిల మంజూరు చేసిన సంగతి తెలిసిందే. తన నియోజక వర్గం దాటి ఎక్కడికి వెళ్లకూడదని కోర్టు ఆదేశించింది. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. తన విధించిన షరతులను సడలించాలంటూ రేవంత్ రెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. ఈరోజు దీనిపై విచారణ జరిపిన హైకోర్టు బెయిల్ ఆదేశాల్లో సడలింపునిచ్చింది. హైదరాబాద్‌తో సహా దేశంలో ఎక్కడికైనా వెళ్లొచ్చని తీర్పునిచ్చింది. కాని బయట ఎక్కడ కేసుకు సంబంధించి అంశాల గురించి మాట్లడకూడదని.. కేసుకు సంబంధించి సాక్ష్యులను ప్రభావితం చేసినట్లయితే షరతులను ఉపసంహరించుకుంటామని స్పష్టం చేసింది. అంతేకాదు ప్రతి సోమవారం సాయంత్రం ఏసీబీ కార్యలయానికి వచ్చి హాజరుకావాలని ఆదేశించింది. దీంతో రేవంత్ రెడ్డి రేపు హైదరాబాద్ రానున్నట్టు తెలుస్తోంది. ఇక నుంచి తెలుగుదేశం పార్టీ నిర్వహించే సమావేశాల్లో రేవంత్ పాల్గొనే అవకాశం ఉంది.