కారులో రేప్.. చేయాలంటే ఇంట్లోనే చేయొచ్చు.. ఎమ్మెల్యే
posted on Sep 8, 2015 @ 2:58PM
పనిమనిషిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలపై అస్సోం ఎమ్మెల్యే గోపీనాథ్ దాస్‌పై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. వివరాల ప్రకారం ఎమ్మెల్యే గోపీనాథ్ ఇంట్లో 14 ఏళ్ల మైనర్ బాలిక పనిమనిషి ఉంది. అయితే ఈ బాలిక గత నెల 29 వ తేదీన ఎమ్మెల్యే గోపీనాథ్ పై ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యే గోపీనాథ్ కారులో తనను వేధింపులకు గురిచేసినట్టు ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు ఈ కేసును బోకో పోలీసు స్టేషన్‌కు బదిలీ చేసి అక్కడ అక్కడ ఐపీసీ 343 సెక్షన్‌తో పాటు.. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012 కింద కేసు నమోదు చేశారు.
అయితే బాలిక ఎమ్మెల్యేపై చేసిన ఆరోపణలను కొట్టిపారేశారు. బాలిక తనపై చేసిన ఆరోపణలు ఎలాంటి నిజం లేదని కుట్రతోనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. అసలు కారులో ‘కారులో తనను లైంగికంగా వేధించానని బాలిక చెబుతోంది. కారులో నాతోపాటు డ్రైవర్, సెక్యూరిటీ గార్డ్ కూడా ఉన్నారు అది ఎలా సాధ్యమవుతుంది అని చెబుతున్నారు. ఒకవేళ అలా ఇబ్బంది పెట్టాలనుకుంటే కారులో ఎందుకు తను మాతోనే మా ఇంట్లో ఉంటోంది కదా’ అని తిరిగి ప్రశ్నించారు. అంతేకాదు ఎమ్మెల్యే కూడా తిరిగి బాలికపై తిరిగి ఫిర్యాదు చేశారు. డబ్బులు, బట్టలతో బాలిక పారిపోయినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు.
మరోవైపు బాలిక మాత్రం ఎమ్మెల్యే లైంగిక దాడులకు పాల్పడ్డారని గట్టిగా చెబుతోంది అయితే పోలీసులు మాత్రం విచారణలో అన్ని వివరాలు బయటకు వస్తాయని చెబుతున్నారు.