Read more!

యువకులలో కార్డియాక్ అరెస్ట్ లు ఎందుకు పెరుగుతున్నాయి!

యువకులలో నానాటికి కార్డియాక్ అరెస్ట్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. దీనుండి ఎలా బయట పడాలి అన్నదే సదేహంగా మారుతోంది.ఒక ఆశ్చర్య కరమైన ఘటన లలో ప్రాణాలు కోల్పోతున్న అంశాలను నిసితం గా  పరిశీలించినప్పుడు.కొన్ని విషయాలు ఇలా జరిగాయి.ఇటీవలే యు పి లో తన మిత్రులతో కలిసి రోడ్డు పై నడుస్తూ నడుస్తూ కుప్ప కూలి పోయిన ఘటన నేడు చర్చనీయ అంశంగా మారింది.ఆశ్చర్యం కలిగించే మరో అంశం విస్మయం కలిగిస్తోంది. వధువు వరుడుకీ వరమాల వేస్తూ అక్కడే కుప్ప కూలిపోయింది.చనిపోయింది.ఈ ఘటన లక్నో లో ని మలిహాబాద్ కేంద్రం లో వధూ వరులు స్టేజి పై ఒకరి కొకరు ఎదురుగా నిలబడ్డారు వరుడు వశువు శివానికి వరమాల వేసాడు వరుడు. ఇక శివాని వంతు వచ్చింది ఆమె వరుడికి వరమాల వేస్తూ ఉండగానే స్టేజి పై కుప్పకూలిపోయింది.వధువును వెంటనే ఆసుపత్రికి తరలించిన అక్కడ ఆమె మరణించి నట్లు ప్రకటించారు. ఆమెకు కార్డియాక్ అరెస్ట్ కారణంగా మరణించిందని ఇంత తక్కువ వయసులో కార్డియాక్ అరెస్ట్ కు గురైందని తెలిపారు. కార్డియాక్ అరెస్ట్ ఇది మొదటిది మాత్రం కాదు పెళ్ళిలో స్నేహితుడి పెళ్ళిలో నృత్యం చేస్తూ ఒక యువకుడు కుప్ప కూలిన సంఘటన మరో యువకుడిని బలితీసుకుంది. ఇలాంటి ఘటనలు ఎన్నోజరిగాయి అతి పిన్న వయస్సులో మిత్రుదుని కోల్పోయిన వాళ్ళు. తమ సహోదరిని సహచరులను కోల్పోయిన వారి ఘటనలు కోకొల్లలు.యువకులలో కార్డియాక్ అరెస్ట్ వంటి ఘటనలు పెరుగుతూనే ఉన్నాయి. అమెరికాకు చెందిన సి డి సి అంచనా ప్రకారం 25 సం వత్చరాల లోపు ఉన్న యువకుకులు 25,౦౦౦ మంది కార్డియాక్ అరెస్ట్ తోనే మరణించారని నివేదిక లో పేర్కొన్నారు.అసలు కార్డియాక్ అరెస్ట్ అంటే ఏమిటి దాని నుండి ప్రాణాలు ఎలా కాపాడుకోవాలి 

కార్డియాక్ అరెస్ట్...

కార్డియాక్ అరెస్ట్ ఎప్పుడు వస్తుంది అంటే గుండెకు అవసరమైన రక్తం సరఫరా అందనప్పుడు. అప్పుడు గుండె చప్పుడు ఆగిపోతుంది.అది మనకు ఏమాత్రం సంకేతం అందదు. కార్డియాక్ అరెస్ట్ వెంటనే వ్యక్తి ఉన్న చోటే కుప్పకూలిపోతాడు గుండేనొప్పి, ఊపిరి తిత్తులలో ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉండడం కుటుంబం లో ఎవరికైనా కార్డియాక్ అరెస్ట్ చరిత్ర ఇలాంటి లక్షణాలు ఉంటె వాటిపై దృష్టి పెట్టాలి.లేదంటే కార్డియాక్ అరెస్ట్ వల్ల చనిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి సకాలంలో గుర్తించి దీనికి చికిత్చ చేయించాలి.

కార్డియాక్ అరెస్టుకు కారణాలు ఏమిటి ?

కార్డియాక్ అరెస్టుకు కారణం ఒక వ్యక్తి వయస్సుపై ఆధారపడి ఉంటుంది ౩5 సం వయస్సు పై బడిన వారిలో సహజంగా కార్డియాక్ అరెస్ట్ కరోనరీ ఆర్ట్ట్రీ డిసీజ్ కి కారణం గా చెబుతున్నారు యువకులలో కార్డియాక్ అరెస్ట్ కు కారణాలు చాలానే ఉన్నాయని నిపుణులు పేర్కొన్నారు.అసహజమైన జీవన శైలి,నేటి ఆధునిక సమాజం లో ఒత్తిడి, ఆహార విహారం శరీరానికి వ్యాయామం లేకపోవడం వంటి సమస్యలు ధూమపానం మధుమేహం,ఊబకాయం  ఇతర అనారోగ్య సమస్యలు ఉండడం మరో కారణం గా  నిపుణులు పేర్కొన్నారు.

హైపెర్ కార్డియాక్ మయోపతి...

ఇది గుండె సంబంధిత సమస్యలలో అత్యంత క్లిష్టమైనది గుండెలోని కండరాలు రక్త నాళాలలో వాపులు వస్తాయి.

కరోనరీ ఆర్టరీ అబ్నా నార్మాల్టీ స్...

చాలా మందిలో కోరో నరీ ఆర్టరీ లో అసమాన్యం గా కలిసి ఉండడం గమనించవచ్చు గుండెలోని కండరాలు రక్త ప్రసారం పూర్తిగా తగ్గిపోతుంది ఈ రకంగా కార్డియాక్ అరెస్ట్ వస్తుంది కార్డియాక్ అరెస్ట్ కు ప్రధాన కారణంగా పేర్కొన్నారు.

లాంగ్ క్యుటి సిండ్రోం...

ఈ రకమైన గుండె ఆర్టరీ జనరిక్ అని అంటారు అనుకోకుండా గుండె చప్పుడు పెరిగిపోతుంది.

బుగుడా సిండ్రోం...

వంశ పారం పర్యంగా సాధారణంగా వచ్చే లయను బాదిస్తుంది. గుండె అసామాన్యంగా గుండె కండరాలు వాపులు వంటివి యువకులలో అనుకోకుండా కార్డియాక్ అరెస్ట్ నుండి రక్షించవచ్చు.

కుటుంబ చరిత్ర...

ఒకవేళ మీ కుటుంబం లో అనుకోకుండా కార్డియాక్ అరెస్ట్ వచ్చిన చరిత్ర ఉంటె మీ డాక్టర్ వద్దకు వెళ్లి స్క్రీనింగ్ చేయించుకోవడం మరి కార్డియాక్ అరెస్ట్ కు ప్రాత్యామ్నాయం ఏమిటి ?అన్నది తెలుసుకోవాలి అనుకోకుండా వచ్చే మృత్యువునుండి రక్షింప బడతారు.

డిఫ్రీ బ్రీటర్ లేదా సి డి ఆశ...

దీఫ్రి బ్రీ లెటర్ నేడు అన్ని చోట్లా అందుబాటులో ఉంది అనుకోకుండా వచ్చే కార్డియాక్ అరెస్ట్ తో ప్రాణం రక్షించడం లో పనికి వస్తుంది.కార్డియాక్ అరెస్ట్ అయిన వెంటనే ఒక డిఫ్రీబ్రిలేతర్ సాధారణ గుండె చప్పుడు తెలుసుకునేందుకు అనుకోకుండా రక్త ప్రసారం కరెంట్ షాక్ కొట్టినట్లు పనిచేస్తుంది. దీనికి  తోడు స్చూళ్ళు కళాశాలలు ఆఫీసులో సి పి అర్ ఇచ్చే విధంగా శిక్షణ అందరికీ ఇవ్వాలి.

అప్రమత్తం చేసే సంకేతం...

కార్డియాక్ అరెస్ట్ నుండి ప్రాణం రక్షించేందుకు అప్రమత్తంగా ఉండడం అవసరం దీనిని అర్ధం చేసుకోవడం సత్వరం వైద్య సహాయం తీసుకోవడం అవసరం.దీనివల్ల ప్రాణం రక్షింప బడాలి యువకులలో అనుకోకుండా వాచ్చే కార్డియాక్ అరెస్ట్ మరణాలకు పెద్ద కారణంగా చెప్ప వచ్చు.అందులోనూ ఒత్తిడి పెంచే క్రీడలు కార్డియాక్ అరెస్ట్ ప్రమాదం మరింత పెంచుతుంది. దీని కోసం మీరు మీ డాక్టర్ ను సంప్రదించండి. మీరు పడుకున్నప్పుడు కార్డియాక్ అరెస్ట్ రావచ్చు.కార్డియాక్ అరెస్ట్ లో ప్రమాదం ఎక్కువ డాక్టర్ సలహా అవసరం మిమ్మల్ని మీరు రక్షించు కునే పద్దతులను తప్పనిసరిగా డాక్టర్ తో మాట్లాడాలి.

జీవన శైలి లో మార్పులు...

మీరు ఎంచుకునే జీవనశైలి ని ఎంపిక చేసుకోవడం ద్వారా మీ గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉండే విధంగా ఉండద్తం సమయానికి చకప్ చేయించుకోవడం గుండె సంబందిత స్క్రీనింగ్ చేయించడం ద్వారా అనుకోకుండా వచ్చే కార్డియాక్ అరెస్ట్ నుండి రక్షించ వచ్చు.మీ అప్రమాత్తతే మీ గుండెకు శ్రీరామ రక్ష.