మే నెలాఖరు కల్లా వైసీపీ ఖాళీ అవుతుందట.. బుద్ధా వెంకన్న జోస్యం
posted on Apr 16, 2016 @ 6:06PM
ఇప్పటికే వైసీపీ పార్టీ నుండి వరుసపెట్టి ఎమ్మెల్యేలు టీడీపీలోకి చేరుతుండటంతో పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సహా మిగిలిన నేతలు కూడా ఏం చేయాలో అర్ధంకాని స్థితిలో ఉన్నారు. పార్టీ మారబోతున్న ఎమ్మెల్యేలను.. పార్టీలోని సీనియర్ నాయకులను రంగంలోకి దిగి బుజ్జగించే పనిలో ఉన్నా వారుమాత్రం పార్టీ మారుతున్నారు. అసలే ఏం చేయాలో తెలియక బెంబేలెత్తి పోతున్న సమయంలో ఇప్పుడు టీడీపీ నేతలు చేసే వ్యాఖ్యలు వైసీపీ కలవర పడుతోంది. టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మాట్లాడుతూ.. మరింత హీట్ ను పెంచుతున్నాయి. మే నెలాఖరు నాటికి రాష్ట్రంలో వైసీపీ మొత్తం ఖాళీ అవుతుందని, ఏపీలో టీడీపీ ఒక్కటే అతి పెద్ద సింగిల్ పార్టీగా ఉంటుందని ఆయన జోస్యం చెప్పారు. తాము డబ్బులిచ్చి ఏ ఒక్క ఎమ్మెల్యేను కొనుగోలు చేయలేదన్నారు. అలాంటి అవసరం తమకు లేదని, టీడీపీ చేస్తున్న అభివృద్ధిని చూసే పార్టీలోకి చేరికలు జరుగుతున్నాయని తెలిపారు. దీంతో అధికార పార్టీ చేసే వ్యాఖ్యలతో ఏపీ రాజకీయాల్లో మరింత హీట్ పెరిగింది.