తీహార్ జైల్లో గారాల పట్టీ అరణ్య రోదనకు కరిగిన కెసీఆర్
posted on Aug 8, 2024 @ 3:23PM
బీఆర్‌ఎస్‌ను బీజేపీలో విలీనం చేస్తారనే ఊహాగానాలు కొంతకాలంగా తెలంగాణ రాజకీయ వర్గాల్లో హల్‌చల్ చేస్తున్నాయి. బిజెపి బీ టీం బిఆర్ఎస్ అని గత అసెంబ్లీ ఎన్నికలముందు ప్రచారం జరిగింది. ఈ రెండు పార్టీల ఐక్యత తెలంగాణ ఫలితాల మీద ప్రభావం పడింది. ఫలితంగా కాంగ్రెస్ అధికారంలో వచ్చింది. బిఆర్ఎస్ తో బిజెపి ప్రయాణం ఆగిపోవడానికి ప్రధాన కారణం బిఆర్ఎస్ వైఫల్యమేనని చెప్పొచ్చు. పార్లమెంటు ఎన్నికలలో బిఆర్ఎస్ జీరోకి పడిపోయింది. దీంతో బిజెపి బిఆర్ఎస్ ను పూర్తిగా పక్కనపెట్టేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో గత నాలుగు నెలలనుంచి తీహార్ జైల్లో మగ్గుతున్న బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ లభించే అవకాశాలు లేకుండా పోయాయి. దీంతో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారకరామారావ్, మాజీ మంత్రి హరీష్ రావ్ కెసీఆర్ ఆదేశాలతో ఢిల్లీ పెద్దలను కలుస్తున్నారు. అయినప్పటికీ బిజెపి పెద్దలు వీరిరువురికి అపాయింటెమెంట్ ఇవ్వడం లేదు. కాబట్టి కవితకు బెయిల్ వచ్చే అవకాశం లేకుండా పోయింది. లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోవడం ఆ పార్టీకి మైనస్ పాయింట్ అయ్యింది. పదేపదే ఆమె కోర్టును ఆశ్రయించినప్పటికీ ఇంకా బెయిల్ రాలేదు మరియు గత నెల, కెటి రామారావు , టి హరీష్ రావు న్యాయవాదులను సంప్రదించడానికి గత రెండు రోజుల నుంచి ఢిల్లీలో ఉన్నారు. కవిత బెయిల్ కోసం ఢిల్లీలో మకాం వేశారని తెలుస్తోంది. . ఆమెను విడుదల చేసేందుకు బీజేపీ సీనియర్ నేతలను బిఆర్ఎస్ కలిశారని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. కేటీఆర్ ఈ ఆరోపణలను కొట్టిపారేశారు. గత నెలలో మేడిగడ్డ బ్యారేజీని కెటీఆర్ నాయకత్వంలో బిఆర్ ఎస్ ఎమ్మెల్యేలు సందర్శించారు. అనుమతి లేకుండా డ్రోన్‌ను ఎగురవేశారనే ఆరోపణలపై కేటీఆర్‌తో పాటు మరో ఇద్దరు బీఆర్‌ఎస్ నేతలపై కేసు నమోదైంది.గత ఏడాది అక్టోబర్‌లో పగుళ్లు ఏర్పడి, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ వివాదానికి కేంద్రంగా ఉన్న బ్యారేజీని కెటీఆర్ బృందం సందర్శించింది.బిఆర్ఎస్ నాయకుడు కెటీఆర్ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో కొన్ని డ్రోన్ చిత్రాలను పంచుకోవడంతో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఇందులో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, గండ్ర వెంకటరమణారెడ్డి కూడా ఉన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా కీలకమైన ఇన్‌స్టాలేషన్‌ల వద్ద డ్రోన్‌లను ఎగురవేయడం నిషేధించారు. గత సంవత్సరం జూలై 26న బ్యారేజీని బిఆర్ ఎస్ నేతలు సందర్శించారు కానీ జూలై 29న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వాలి షేక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం కేసు నమోదు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో బిఆర్ఎస్ బతికి బట్ట కట్టే పరిస్థితి లేదు. రంగారెడ్డి జిల్లా జన్వాడలోబిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కుటుంబం లీజుకు తీసుకున్న ఫామ్ డ్రోన్ చిత్రాలను తీసినందుకు 2020లో అప్పటి కాంగ్రెస్ నేత అయిన రేవంత్ రెడ్డిని అరెస్టు చేసి జైలుకు పంపారు. మల్కాజిగిరి ఎంపీగా ఉన్న ఆయనపై ప్రధాన నిందితుడిగా కేసు నమోదు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడాడ్రోన్ చిత్రాలను తీసిన బిఆర్ఎస్ నేతలపై కేసులు నమోదు చేశారు. దీంతో బిఆర్ఎస్ నేతలు బెజారెత్తి బిజెపి నేతల కాళ్లు పట్టుకున్నట్టు సమాచారం. బిజెపి తో కల్సి పని చేయాలంటే బిఆర్ఎస్ కు మద్దతివ్వాలని కోరారు. బిఆర్ఎస్ కు మద్దత్తు ఇవ్వడానికి బిజెపి వెనకంజ వేయనప్పటికీ కవిత విషయంలో కఠినంగా ఉంటోంది. కవితకు బెయిల్ రావాలంటే విలీనం మాత్రమే సింగిల్ ఆప్షన్ అని బిజెపి కండిషన్ విధించింది. కెటీఆర్, హరీష్ రావు ఈ ప్రతిపాదనను కెసీఆర్ ఎదుట పెట్టారు. తన గారాలపట్టీ కవిత విడుదలకు కెసీఆర్ బిఆర్ఎస్ ను బిజెపిలో విలీనం చేయడానికి సిద్దమయ్యారని వినికిడి