బ్రహ్మోత్సవం.. పట్టువస్త్రాలు సమర్పించిన చంద్రబాబు దంపతులు!

తిరుమలలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, వేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. చంద్రబాబు దంపతులు తిరుమలలో బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న అనంతరం వెండి పళ్ళెంలో పట్టు వస్త్రాలు తీసుకుని శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. పట్టువస్త్రాలు సమర్పించిన అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు.

Teluguone gnews banner