Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రాజేంద్రప్రసాద్ కుమార్తె మృతి
posted on: Oct 5, 2024 6:39AM

సినీనటుడు రాజేంద్రప్రసాద్ కుమార్తె గాయత్రి (38) గుండెపోటుతో మరణించారు. గాయత్రి శుక్రవారం నాడు కార్డియాక్ అరెస్టుకు గురికావడంతో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు. రాజేంద్ర ప్రసాద్‌కు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. కుమార్తె మరణంతో రాజేంద్రప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం నిండింది. గాయత్రి మృతిని తట్టుకోలేక రాజేంద్ర ప్రసాద్ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. విధివిలాసం ఏమిటంటే, దసరా శరన్నవరాత్రోత్సవాల సందర్భంగా శుక్రవారం నాడు దేశమంతటా అమ్మవారికి ‘గాయత్రి’ అలంకారం చేశారు. ఆరోజే రాజేంద్రప్రసాద్ కుమార్తె గాయత్రి కన్నుమూశారు.






