తిరుమలలో కిడ్నాపైన బుడ్డోడు దొరికాడు
posted on Sep 1, 2012 @ 12:20PM
తిరుమలలో కిడ్నాపైన పిల్లాడు దొరికాడు. కిడ్నాపర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. కల్యాణకట్టదగ్గర కడపకు చెందిన ఓ మహిళ చంకలో ఉన్న పిల్లాడిని పోలీసులు గుర్తించారు. మరో ముగ్గురు వ్యక్తుల్నికూడా పోలీసులు అరెస్ట్ చేశారు. కిడ్నాపైన బాలుడిని సీసీటీవీ కెమెరాల్లో గుర్తించిన పోలీసులు ఆగమేఘాలమీద అక్కడికి చేరుకుని నిందితులను అరెస్ట్ చేశారు. స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్నాక,
పిల్లాడితోపాటు తల్లీతండ్రీకూడా నిద్రపోతున్న సమయంలో నిందితులు బాలుడిని కిడ్నాప్ చేశారు.