పేషేంట్ లకు జైల్ లో ప్రత్యేక వార్డ్!
posted on Apr 18, 2020 @ 4:09PM
తెలంగాణా రాష్ట్రంలో రక్తహీనత రోగులు, తీవ్ర ఇబ్బంది పడుతున్నారు! ఈ నేపథ్యంలో బ్లడ్ సేకరించడానికి నారాయణగూడ బ్లడ్ బ్యాంక్ ప్రత్యేక ఏర్పాట్లను చేసింది. శనివారంనాడు నారాయణ గూడ సెంట్రల్ బ్లడ్ బ్యాంక్ లో టీఎన్జీవో ల ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ను నిర్వహించారు.
కోవిడ్ 19 వలన రాష్ట్రంలో బ్లడ్ నిల్వలు తగ్గిపోయాయి. దీనితో తలసేమియా, రక్తహీనత రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కొంత మంది యువకులు రక్తదానం చేశారు.
యువకులు పెద్ద ఎత్తున రక్తదానం చేయడానికి ముందుకు వస్తున్నారు అందులో భాగంగానే ఇవాళ నారాయణ గుడా ఐపీఎఎంలో టీఎన్జీవో ల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు.
ప్రస్తుతం బ్లడ్ నిల్వవలు పెరుగుతున్నాయి ఇంకా ఎంతో మంది యువకులు రక్తదానం చేయడానికి ముందుకు వస్తున్నారని మంత్రి తెలిపారు. టీఎన్జీవో లు ఎప్పుడు కూడా రక్త దానం చేయడానికి ముందు ఉంటారని మంత్రి ప్రశంసించారు.
డాక్టర్ ల పై దాడులు హేమమైన చర్య, డాక్టర్ లపై దాడులు చేస్తే కఠినంగా శిక్షలు ఉంటాయి మంత్రి ఈటెల ఈ సందర్భంగా మరో సారి హెచ్చరించారు. డాక్టర్లు నిరంతరం కష్టపడి పని చేస్తున్నారు, వారి పై పేషేంట్లు దాడి చేస్తే జైల్‌లో వున్న ప్రత్యేక వార్డుకు తరలిస్తామని మంత్రి హెచ్చరించారు. పేషేంట్ లకు జైల్ లో ప్రత్యేక వార్డ్ పెట్టాం.వారికి కూడా శిక్ష అమలులో వుంటుందని మంత్రి తెలిపారు.