మాజీ ఐపీఎస్ అధికారి భార్యకు రూ.2.58 కోట్ల టోకరా
స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడుల పేరిట భారీ లాభాలు వస్తాయంటూ నమ్మించి, ఒక మాజీ ఐపీఎస్ అధికారి భార్య నుంచి రూ.2.58 కోట్లను కాజేసిన ఘటన హైదరాబాద్ నగరంలో కలకలం రేపుతోంది. సైబర్ నేరగాళ్లు అత్యంత ప్రణాళికాబద్ధంగా ఈ మోసానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.
వాట్సాప్ ద్వారా మొదలైన మోసం
గత నెలలో బాధితురాలికి వాట్సాప్‌లో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చిట్కాలు ఇస్తామని ఒక సందేశం వచ్చింది. పెట్టుబడుల ద్వారా తక్కువ సమయంలోనే భారీ లాభాలు సాధించవచ్చని, తామిచ్చే సలహాలు పూర్తిగా నిపుణులవి అంటూ సైబర్ నేరగాళ్లు నమ్మించారు. స్టాక్ మార్కెట్‌పై అవగాహన లేకపోవడంతో, బాధితురాలు ఈ విషయాన్ని తన భర్తకు తెలిపి, ఆయన్ను కూడా ఆ వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేయించింది.
29.11.2025న, నా భర్త “స్టాక్ మార్కెట్ ప్రాఫిట్ గైడ్ ఎక్స్ఛేంజ్ గ్రూప్ 20” అనే వాట్సాప్ గ్రూప్‌లో చేరారు, అందులో సుమారు 167 మంది సభ్యులు ఉన్నారు.ఆ తర్వాత కొద్దికాలానికే, దినేష్ సింగ్ అని తనను తాను పరిచయం చేసుకున్న ఒక వ్యక్తి, 9685717841 అనే మొబైల్ నంబర్‌ను ఉపయోగించి, గ్రూప్‌లో వివరణాత్మక సందేశాలను పంపుతూ చురుకుగా తరగతులు మరియు చర్చలు నిర్వహించడం ప్రారంభించాడు. అతను సామూహిక పెట్టుబడి యొక్క ప్రాముఖ్యత, ట్రేడింగ్‌లో క్రమశిక్షణ మరియు సమన్వయ వ్యూహాల ప్రయోజనాలను వివరించాడు.
అతని సందేశాలు అత్యంత పాండిత్యంతో, విశ్లేషణా త్మకంగా వివరించారు. అతని మాటలు ఆ గ్రూపులో ఉన్న వారందరూ నమ్మారు.. ఇతను చాలా స్టాక్ మార్కెట్ గురించి వివరించారు. చాలా మంది గ్రూప్ సభ్యులు ఈ స్టాక్‌లు మంచి లాభాలను ఇస్తున్నాయని పేర్కొంటూ గ్రూప్‌లో సందేశాలను మరియు స్క్రీన్‌షాట్‌లను పోస్ట్ చేయడం ప్రారంభించారు.
అలా గ్రూపులో ఉన్న సభ్యులందరూ మెసేజ్లు చేయడంతో బాధితురాలు అది నిజమని పూర్తిగా నమ్మింది. వాట్సాప్ గ్రూప్‌లో సభ్యులకు 500 శాతం వరకు లాభాలు వస్తాయని నమ్మించారు. తమ సంస్థ సెబీ సర్టిఫైడ్ వెబ్‌సైట్ అంటూ ప్రచారం చేశారు. దీనికి మద్దతుగా సెబీకి చెందినట్లుగా కనిపించే నకిలీ సర్టిఫికెట్లు, డాక్యు మెంట్లను కూడా వాట్సాప్‌లో పంపించారు. ఈ నకిలీ ధృవపత్రాలను చూసి బాధితురాలు నిజమేనని విశ్వసించారు. సైబర్ నెరగాళ్లు బాధితురాలు చేత తొలుత చిన్న మొత్తాల్లో పెట్టుబడి పెట్టించి, ఆన్‌లైన్ డ్యాష్‌బోర్డ్‌లో లాభాలు వచ్చినట్లు చూపిస్తూ.... మరింత పెట్టుబడి పెట్టేం దుకు ప్రోత్సహించారు.
సైబర్ నేరగాళ్ల మాటలు పూర్తిగా నమ్మిన బాధితురాలు డిసెంబర్ 24 నుంచి ఈ నెల 5వ తేదీ వరకు మొత్తం 19 ట్రాన్సాక్షన్లలో రూ.2.58 కోట్లు పెట్టుబడి పెట్టారు.కొంత కాలానికి అనుమానం రావడంతో బాధితురాలు పెట్టుబడి నిలిపివేయగా, సైబర్ నేరగాళ్లు తీవ్ర ఒత్తిడి మొదలుపెట్టారు. మళ్లీ మళ్లీ పెట్టుబడి పెట్టాలని, పెట్టుబడి చేయకపోతే ఇప్పటివరకు పెట్టిన మొత్తం డబ్బు మొత్తం పోతుందని బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ పరిణామాలతో భారీ మోసానికి గురైనట్టు తెలుసుకున్న బాధిత కుటుంబం హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది.
బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నకిలీ సెబీ సర్టిఫికెట్లు, వాట్సాప్ గ్రూప్ లింకులు, బ్యాంక్ ఖాతాల వివరాల ఆధారంగా నిందితుల జాడ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దిపి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన నేపథ్యంలో పెట్టుబడుల పేరిట వచ్చే వాట్సాప్ సందేశాలు, అధిక లాభాల ప్రకటనలపై అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు. సెబీ సర్టిఫికేషన్ పేరుతో వచ్చే లింకులు, డాక్యుమెంట్లను అధికారిక వెబ్‌సైట్లలో ధృవీకరించకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుబడులు పెట్టవద్దని సూచించారు.