20 మంది పోలీసులను కాపాడిన ప్రజలు..
posted on Jul 23, 2021 @ 11:11AM
ప్రజలకు ఏదైనా ఆపద వస్తే పోలీసులు కాపాడుతారు..మరి పోలీసులకు ఆపద వస్తే ఎవరు కాపాడాలి..? ప్రజలే కదా.. అవును తాజాగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 పోలీసులను ప్రాణాలతో కాపాడారు ప్రజలు.. ఏఎస్పీ కిరణ్ ఖారే ఆధ్వర్యంలో కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్‌లో 20 మంది పోలీసులతోపాటు, బైంసా యువత సైతం అంటూ ముందుకు వచ్చి ఎంతో సాయం అందించింది. బాధితులను బైంసాలోని ఎస్సీ హస్టల్ పునరావాస కేంద్రానికి అధికారులు తరలించారు. తెలంగాణలో ఆగకుండా కురుస్తున్న వానలకు నిర్మల్‌తో పాటు బైంసా నీటిలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఆటో నగర్‌లో సహాయక కార్యక్రమాలు సాగుతున్నాయి. అయితే, ఈ వరద నీటిలో భైంసా ఎన్.ఆర్.గార్డెన్‌లో బస చేసిన 20 మంది పోలీసులు వరద నీటిలో చిక్కుకుపోయారు. దీంతో 12 మంది గజ ఈతగాళ్లు రంగంలోకి దిగి బోట్ల సాయంతో సాహసం చేసి మరి పోలీసులను రక్షించారు. అంతేకాక, ప్రజల్ని కూడా కాపాడారు. రెండు నాటు పడవల్లో 4 గంటలు శ్రమించి 60 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఏఎస్పీ కిరణ్ ఖారే ఆధ్వర్యంలో కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్‌లో 20 మంది పోలీసులతోపాటు, బైంసా యువత సైతం ఎంతో సాయం అందించింది. బాధితులను బైంసాలోని ఎస్సీ హస్టల్ పునరావాస కేంద్రానికి అధికారులు తరలించారు. భైంసా సమీపంలో గడ్డెన్నవాగు ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వస్తుండడంతో అధికారులు ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తేశారు. దీంతో భైంసా ఆటోనగర్‌లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. గడిచిన 24 గంటల్లో నిర్మల్ జిల్లాలో వాన దంచికొట్టింది. జిల్లాలోని నర్సాపూర్‌లో అత్యధికంగా 245 మిల్లీ మీటర్ల వాన పడింది. తెలంగాణ వ్యాప్తంగా సరాసరిన 44.2 మి.మీ. వర్షపాతం నమోదు కాగా, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో అత్యధికంగా 115.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఒక్క నిర్మల్ జిల్లాలోనే 204 మి.మీ. వర్షపాతం నమోదైంది. జూన్ 1వ తేదీ నుంచి జులై 22 వరకు రాష్ర్ట వ్యాప్తంగా 474.3 మి.మీ. వర్షపాతం నమోదైంది. రాష్ట్ర వ్యాపితంగా వర్షాలు ఆగకుండా కుండపోతగా పాడడం వల్ల ప్రజల రాకపోకలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి.. హైదరాబాద్ లాంటి ముఖ్య సిటీలో ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు ఎక్కువ ఎదురవుతున్నాయి..