Read more!

భ‌గ‌వ‌త్‌జీ.. బీజేపీ కి  వినిపించేలా చెప్పండి

వ‌సుధైక‌ కుటుంబ‌కం, భిన్న‌త్వంలో ఏక‌త్వం అనేవి భార‌త స‌మాజాన్ని ప‌టిష్టంగా ఉంచుతున్నాయి. స‌మాజంలో ఈ భావ‌న‌లే అనాదిగా వ‌స్తున్న అన్ని సంక్షోభాల్ని ఎదుర్కొని నిల‌బ‌డే శ‌క్తిని ఇస్తున్నాయి. ఏ ప్ర‌భుత్వం ఎంత దిగ‌జారిన  ప్ర‌క‌ట‌న‌లు, ప్ర‌చారాలు, కార్య్ర‌క‌మాలు చేప‌ట్టినా  ప్ర‌జ‌ల మ‌ద్య విద్వేషాలు సృష్టించ‌లేక‌పోయింది. అదే  సిద్ధాంతంతో ముందడుగు వేస్తున్నామ‌ని, దేశాన్ని అభివృద్ధి ప‌థంలో తామే న‌డుపుతున్నామ‌ని ప్ర‌చారం చేసుకోవ‌డంతోపాటు బ‌ల‌వంతంగా త‌మ అభిప్రాయాల‌ను, సిద్ధాం తాల‌ను రుద్ద‌డంలో భార‌తీయ జ‌న‌తాపార్టీ విజ‌య‌వంతం అవుతోంద‌న్న అభిప్రాయాలు దేశ‌మం త‌టా ఉన్నాయి. ఇపుడు ఆర్ఎస్ఎస్ ఛీఫ్ భ‌గ‌వంత్ ముస్లిం నాయ‌కుల‌తో స‌మావేశం అయి వారి ప్ర‌చా రాన్ని మ‌రింత పెంచారు. త‌ప్ప బీజేపీ మ‌త‌మౌఢ్యంతోనే సాగిపోతోంద‌న్న మ‌చ్చ‌ని తుడ‌వ‌ లేరు. కేవ‌లం త‌మ త‌ప్పిదాల‌ను క‌ప్పిపుచ్చుకోవ‌డానికి చేస్తున్న కృషిగానే అంద‌రూ చూడాల్సి వ‌స్తోంది. 

దేశంలో ప్ర‌జ‌లంతా ఒక్క‌టే అన్న భావ‌న‌ను క్ర‌మేపీ అనుమానించే ప‌రిస్థితులు బీజేపీ స‌ర్కార్ రాక‌తోనే క‌లిగి స్థిర‌ప‌డే భ‌యాందోళ‌న‌లు ప్ర‌జ‌ల్లో ఏర్ప‌డ్డాయి. ఎన్న‌డెర‌గ‌ని దాడులు, విభేదాలు, క‌ల్మ‌షాలు ప్ర‌చా రం చేయ‌డంలో బీజేపీ నాయ‌కులు మ‌తం పేరుతో కాషాయం నీడ‌లో సాగిస్తున్నారన్న విప‌క్షాల అభిప్రా యాల‌ను గ‌ట్టిగా వ్య‌తిరేకించ‌లేక‌పోతోంది.  పైగా భార‌త దేశంలో హిట్ల‌ర్ లాంటి పాల‌కుల‌కు స్థానం లేద‌ని, ఉండ‌ద‌ని బీజేపీ నాయ‌కులు, ఆర్ ఎస్ ఎస్ నాయ‌కులు అంటూన్నారు. కానీ అంత‌కంటే ప్ర‌జ‌ల్లో భ‌యాందోళ‌న‌లు క‌లిగిస్తున్నార‌న్నది ప్ర‌జ‌ల్లో ఇప్ప‌టికే నాటుకున్న అభిప్రాయం. దీన్ని తొల‌ గించ‌డానికి ప్ర‌జ‌ల అభీష్టాల‌ను అనుస‌రించి పాల‌న సాగించాలేగాని త‌మ ప‌థ‌కాలు, రాజ‌కీయ వ్యూహా ల‌తో ప్ర‌భుత్వాలను కూల్చేసే కుసంస్కార, హీన ఆలోచ‌న‌ల‌తో పాల‌న చేయ‌డం మంచి పాల‌న అని పించుకోద‌ని రాజ‌కీయ విశ్లేష‌కుల మాట‌. ఇదే బీజేపీ సాగిస్తోంది. దీనికి అన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీ వారి దాదాగిరి ప్ర‌వ‌ర్త‌నే సాక్ష్యం గా నిలుస్తోంది. 

మ‌న జాతీయవాదం ఎవ‌రికి న‌ష్టం చేకూర్చ‌ద‌ని, అంద‌రినీ స‌మానంగానే చూస్తుంద‌ని ఆర్ ఎస్ ఎస్ ఛీఫ్ భ‌గ‌వ‌త్ సంక‌ల్ప్ పౌండేష‌న్ స‌ద‌స్సులో అన్నారు. కానీ బీజేపీ వారి జాతీయ‌వాదాన్ని మాత్రం వ్య‌తి రేకించ లేక‌పోతున్నార‌న్న విమ‌ర్శ కూడా ఉంది.  ఒకే కుటుంబంలా ఉంటున్నామ‌ని అంటూనే ప్ర‌జ‌ల మ‌ధ్య కుల‌, మ‌త గోడ‌లు పెంచుతూన్నార‌ని ప్ర‌జ‌లు విప‌క్షాలు మండిప‌డుతున్నాయి. ఇది బీజేపీ గుర్తిం చ‌డ‌మే లేదు. కేవ‌లం రాజ‌కీయ‌దృష్టితో, అధికార వాంఛ‌తోనే ఇత‌ర రాష్ట్రాల్లోనూ రాజ‌కీయ సంక్షోభం క‌ల్పించి తాము గ‌ద్దెనెక్కి అధికారం చెలాయించాల‌న్న ఆలోచ‌న‌తోనే సాగుతున్నారు. దీన్ని పాల‌న అని ఎలా అనుకోవాల‌న్నది విశ్లేష‌కుల ప్ర‌శ్న‌.