వద్దు.. ఇక జగన్‌ను వదిలించుకోవడమే మేలు!
posted on Jun 15, 2022 @ 12:24PM
ఫలానా రాజు అద్బుతంగా పాలించేవాడు, ఫలానా మంత్రిగారు బ్రహ్మాండంగా సలహాలిచ్చేవారు లాంటివి అనాదిగా వింటూనే వున్నాం. అలాగే వాడు పలికిమాలిన పాలకుడు అనీ దుర్మార్గ దారుణ పాలన అనీ కొందరి గురించి చరిత్ర చెబుతుంది. ఆధునిక కాలంలో జగన్ పాలనను కూడా మరోలా భవిష్యత్తులో గుర్తుంచుకుంటారు.. వచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నాడని, బొత్తిగా అర్ధంలేని పాలనని! మొదట్లో అంతా బాగుంటుందేమో అనుకున్నవారికి కూడా విసిగెత్తేస్తోంది. కుమ్ములాటలు, విభేదాలు, పథకాల అమల్లో లోపాలు, అవి నీతి, ఆర్ధిక స్థితి దెబ్బతినడం అన్నీ వెరసి జగన్ పాలను వద్దనే నినాదా నికి బలం చేకూరింది.
జగన్ పాలన మూడేళ్లు ముగిసేప్పటికే పార్టీలో, ప్రభుత్వ వ్యవహారాల్లో విభేదాలు బయటపడ్డాయి. అసలు మంత్రులు, మాజీ మంత్రులకు కనీసం మాట్లాడటం కూడా తెలీని స్థితికి జారిపోయారు. కొడాలి నాని, పేర్ని నాని, వంశీ, జోగి రమేష్ తదితరులు మామూలుగా మాట్లాడటం మర్చిపోయారు. ప్రజాసేవ చేస్తా మని ప్రమా ణంచేసి మరీ అధికారంలోకి వచ్చినవారు ప్రజలతో సత్సంబంధాల మాట అటుంచితే అసలు ప్రతి పక్షాలమీద, ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్నవారి మీదా ఏకంగా బూతుల పురాణం వల్లిం చడమేమిటి? వైసీపీ నాయకుడు ఈడీ ఆఫీసుల ప్రదక్షిణం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వారి వారి నియోజకవర్గాల్లో కుమ్ములాటల్లోనూ పీకల్లోతు కూరుకుపోయారు. మచిలీపట్నంలో బాలశౌరి, పేర్నినాని విభేదాలు పార్టీ ప్రతిష్టను దెబ్బ తీస్తున్నాయి. గన్నవరంలో వంశీని సమర్ధించాలా? యార్లగడ్డ ను సమ ర్ధించాలా అన్నది వైసీపి అధిష్టానం తేల్చుకోలేకపోతోంది. నర్సాపురం జిల్లా కేంద్రం చేయాలన్న డిమాం డ్ చేసిన కొత్తపల్లి సుబ్బారాయుడు, ప్రభుత్వ ఛీఫ్ విప్ ప్రసాద రాజు మధ్య విభేదాలు వెలుగులోకి వచ్చా యి. ఇండిపెండెం ట్‌గా పోటీచేసి గెలుస్తనని అన్న కొత్తపల్లిని పార్టీ నుంచి బహిష్క రించారు. మరో వంక ఉమ్మడి విశాఖ జిల్లా సమన్వయకర్త వై.వి. సుబ్బారెడ్డి టిడిపి నుంచి వచ్చిన వాసుపల్లి గణేష్ మధ్య విభే దాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. అంతేకాదు పార్టీ సమ్యవకర్త పోస్ట్‌కి గణేష్ రాజీనామా చేశారు. మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ తర్వాత నెల్లూరులో మంత్రి కాకాణి, మాజీ మంత్రి అనిల్ వర్గాల మధ్య గొడవలు రచ్చకెక్కాయి. వీరిని శాంతపరచడానికి తాతలు దిగివచ్చారు.
ఇదిలా వుండగా, ఆర్ధిక పరిస్థితులు కూడా అధ్వాన్నంగా మారాయి. అధికవడ్డీలకు అప్పలు తెస్తూ రాజ్యాం గ ఉల్లంఘనలకు పాల్పడుతూ రాష్ట్రాన్ని ఆర్ధిక సంక్షోభంలో పడేసిందని విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నా యి. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులు, రిజర్వుబ్యాంక్, నీతి ఆయోగ్‌తో చేసుకున్న ఒప్పందాల గురిం చి ప్రజలకు స్పష్టం చేయాలని శాసనమండలి సభ్యుడు, టిడిపి పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణ డిమాండ్ చేసారు. 14, 15 ఆర్ధిక సంఘం గ్రామాల అభివృద్ధికి ఇచ్చిన ఆరువేల కోట్లు, జలజీవన్ మిషన్ కింద రాష్టానికి వచ్చిన ఏడువేల కోట్లు ఏం చేశారో స్పష్టం చేయాలని యనమల డిమాండ్ చేశారు. అసలు రాష్ట్రంలో ఆర్ధిక క్రమశిక్షణ లోపంతోనే రిజర్వుబ్యాంకు వేజ్ అండ్ మీన్స్ అడ్వాన్స్ పరిమితుల మీదా ఆంక్షలు విధించిందని యనమల ఆరోపించారు. జగన్ ప్రభుత్వం 420 720 పేర్లతో మద్యం వ్యాపా రం చేస్తున్నారేగాని రాష్ట్రంలో అసలు నిరుద్యోగుల సంగతే పట్టించుకోవడంలేదని, అన్ని వర్గాల వారిని మోసం చేస్తున్నారని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు టెక్కలి మహాసభలో దుమ్మెత్తిపోశారు.
దీనికి తోడు విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రతీయేటా ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ చేస్తానని చేసిన ప్రమాణం గాలికి వదిలేసేరు. పాఠశాలల విలీ నంతో ఆ సంగతే మర్చిపోయారు. దీనికి తోడు ప్రాథమిక పాఠ శాల స్థాయిలోనే ఇంగ్లీషు మాద్యమం అమలు చేయడానికి కంకణం కట్టుకున్నారు. పైగా తెలుగు మీడియం కోసం ఉపాధ్యాయులను పెద్ద సంఖ్యలో తీసు కోవలసి వస్తుందనే తెలుగు మీడియం ఎత్తివేసేరు. ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ వదిలేసేరు. ప్రధానోపాధ్యాయుడు, పిఇటీ పోస్టులను తొలగించేం దుకు ఆసక్తిచూపుతున్నారు. రాష్ట్రంలో ప్రాథమిక విద్యకు ఈ పరంగా అపార నష్టం వాటిల్లే అవకాశాలున్నా యని విద్యావేత్తలు, మాజీ ఉపాధ్యాయు లు విమర్శిస్తున్నారు. విద్యారంగాన్ని భ్రష్టు పట్టిస్తున్నారన్న ఆరోప ణలు వినపడుతున్నాయి.
అసలు ఇలాంటి పరిస్థితులు కల్పించి రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసిన జగన్ పాలనను ఎవరు కోరుకుంటా రు. ప్రజలకు, పార్టీని అభిమానిస్తున్నవారికి కూడా జగన్ పాలన పట్ల విముఖత ఏర్పడింది. బయటికి చెప్పకపోయినా చాలా ప్రాంతాల్లో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల అనుచరుల్లోనూ ఈ అసంతృప్తి వుందని విశ్లేషకుల మాట. ఇపుడు రాష్ట్రంలో అందరూ చంద్రబాబు ప్రభుత్వం వస్తేనే తమ జీవితాలు బాగుపడతా యని, ఆశలు ఫలిస్తాయనే భావన గట్టిగా వున్నది. జగన్ పాలన వచ్చే ఎన్నికలతో ముగుస్తుందన్న వూహా గానాలు ఇప్పటికే బాగా ప్రచారంలో వున్నాయి.