"బెంగాల్ విభజన'' గుర్తుంటే...?



 

-డా.ఎబికె ప్రసాద్


[సీనియర్ సంపాదకులు]



భారతదేశంలో తొలి పెద్ద భాషాప్రయుక్త రాష్ట్రంగా, అనేక త్యాగాల ఫలితంగా తెలుగుజాతి కన్నకలల పంటగా 1956లో అవతరించిన "ఆంధ్రప్రదేశ్'' (విశాలాంధ్ర) రాష్ట్రం ప్రజలు కాంగ్రెస్ పార్టీ స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాలకు కుట్రలకు నేడు బలైపోతున్నారు; ఈ కుట్రలో భాగాస్వాములయిన సీమాంధ్ర, తెలంగాణా ప్రాంతాలలోని కాంగ్రెస్ నాయకులు, తమ కుటుంబ పాలనకోసం కొన్నేళ్ళుగా తహతహలాడుతూ సీమాంధ్రనుంచి తెలంగాణాకు వలసవచ్చి తెలుగు ప్రజలమంధ్య 'విభజన' చిచ్చు పెట్టడానికి ఉద్యమించిన రాజకీయ నిరుద్యోగి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారథ్యంలో తెలంగాణా ప్రజల్ని దశాబ్దాలుగా పీడించుతూ వచ్చిన 'దొర'ల, ఇతర భూస్వామ్య, జాగిర్దారీ శక్తులూ ఈ కుట్రలో భాగస్వాములయ్యారు. ఇలాంటి 'విభజన' సిద్ధాంత కుట్రలకు నిదర్శనం కోసం విదేశాలలో వెతకనక్కరలేదు. భారతదేశ చరిత్రలో దేశీయ, పరదేశీయ శక్తులతో లాలూచీపడి భారత సామాన్యప్రజల, ప్రాంతాల మూల్గుల్ని పీల్చివేసి బలిసిన జాతి విద్రోహులు లేకపోలేదు. మనదేశాన్ని ఏలిన బ్రిటీష్ సామ్రాజ్యవాద పాలకులకు ఊడిగం చేసిన దేశీయుల్ని మనం మరవలేము.



లార్డ్ క్లయివు, లార్డ్ కర్జన్ లు స్థానీయ విద్రోహులు లేకుండా బెంగాల్ ను 1905లో నిట్టనిలువునా, కోట్లాదిమంది బెంగాలీయులు వద్దు వద్దని మొత్తుకున్నా బ్రిటన్ స్వీయ ప్రయోజనాల కోసం చీల్చినవాడు లార్డ్ కర్జన్ అన్న సంగతి అదే బెంగాల్ అనుభవాలనుంచి పుట్టుకొచ్చిన నేటి మన గౌరవ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరవలేరు! ఎప్పటికప్పుడు భావి భారతదేశ ప్రగతిని ముందుకు నెట్టే కార్యక్రమానికి ముందస్తు ఉద్దీపనశక్తిగా ఆలోచనా ధారను అందించిన బెంగాల్ గడ్డనుంచి వచ్చినవాడు మన ప్రణబ్ ముఖర్జీ ... లార్డ్ కర్జన్ ఎలాంటి కుట్రల ద్వారా బెంగాల్ ను విభజించాడో ఆయనకు తెలియంది కాదు! "ప్లాసీ'' యుద్ధంలో బెంగాల్ నవాబ్ ను బ్రిటిష్ వాళ్ళు మోసపూరితంగా ఎలా "విభజించి-పాలించే'' సిద్ధాంతం ఆయుధంగా వోడించారో, ఆ నవాబుకు అంతవరకూ సేవలందిస్తున్న సేనాపతి అయిన మీర్జాఫర్ ను ఎలా ప్రలోభపెట్టి నవాబును ఓడించింది వెన్నుపోటు పొడిచారో ప్రణబ్ కు తెలుసు. బెంగాల్ లో తమకు కీలుబొమ్మలుగా ఉండే దేశీయ విద్యోహులను బెంగాల్ పాలకులుగా వాళ్ళెలా నియమిస్తూ లబ్దిపొందారో, తద్వారా బెంగాల్ సంపదను ఎలా లూటీ చేస్తూ వచ్చిందీ ప్రణబ్ కు తెలుసు!



 

అలా భారతదేశంలో దోపిడీ ద్వారా బ్రిటిష్ సామ్రాజ్యస్థాపనకు ఫ్లాసీ పరిణామం ఎలా తొలిమెట్టుగా తోడ్పడిందో కూడా ప్రణబ్ కు తెలుసు! బెంగాల్ గద్దెపైన బ్రిటిష్ వాళ్ళు ఎలాంటి తప్పుడు ఒప్పందాల ద్వారా అమీర్ చంద్ ను, వారనే హేస్టింగ్స్ అవినీతిపైన తీవ్ర అభియోగాలు మోపిన రాజా నందకుమార్ ను ఎలా కొరతవేసిందీ ఆయనకు తెలుసు! బ్రిటిష్ వాళ్ళను ఎదిరించి న్యాయంకోసం నిలిచినా సిరాఉజ్జిద్ దౌలాను ఎలా ఏడిపించిందీ తెలుసు! తమ అడుగులకు మడుగులొత్తిన నవక్రిష్ణనూ లంచాలతో కొన్నారు; అలా లొంగిపోయిన నలుగురు నవాబుల్ని, దేశీయ సంపన్నుల్ని అందలం ఎక్కించిన సంగతి ప్రణబ్ ముఖర్జీకి పూర్తిగా తెలుసు! దేశీయ విద్యోహుల సహకారంతో ఎదిగిన పాలకులు ఆనాటి బ్రిటిష్ వాళ్ళు కాగా, అదే "విభజించి-పాలించ''మనే సూత్రాన్ని వారినుంచి అప్పనంగా అందుకున్న కాంగ్రెస్ నాయకులు "బిడ్డపుట్టినా పురిటికంపు'' పోనట్టుగా, దేశానికి స్వాతంత్ర్యం వచ్చినాగాని పదవులకోసం పెనుగులాటలో ఆ బ్రిటిష్ వాళ్ళు దేశ విభజన కోసం సంతకాలు పెట్ట్టమన్న చోటల్లా పెట్టారు. ఆ "విభజన'' సూత్రాన్నే నేడు దేశంలో స్థిరపడిన రాష్ట్రాలను, ముఖ్యంగా జాతీయ స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తి ఫలితంగా తానే పలు తీర్మానాల ద్వారా ఆశీర్వదించి ఏర్పరచిన భాషాప్రయుక్త రాష్ట్రాల్ని చీల్చడానికి స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించడానికి వెనుకాడటం లేదు.



 

దేశ మాజీప్రధాని ఇందిరాగాంధి పాలనా రంగంలో కొన్ని తప్పులు చేసినా, భాషాప్రయుక్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ను రాజకీయ నిరుద్యోగులైన 'గుప్పిడు' స్థానిక నాయకుల గొంతెమ్మ కోరికలను ఈడేర్చడానికి ఈరోజునా "విభజన'' మంత్రాన్ని చేపట్టలేదు; చివరికి తనపై కట్టికట్టిన సొంతపార్టీలోని "సిండికేట్''వర్గంలో కొందరు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు చేరినప్పటికీ ఆ కక్షతో ఇందిర రాష్ట్రం సమైక్యతకు ఏనాడూ చిచ్చుపెట్టలేదు. సరిగ్గా ఇందుకు భిన్నంగా కోడలమ్మ సోనియా ఇటలీనుంచి దేశంలోకి ప్రవేశించిన దరిమిలా పుత్రప్రేమతో రాష్ట్రప్రజల మధ్య మిత్రబేధం పెట్టడానికి రాజకీయ నిరుద్యోగుల వేర్పాటు ఉద్యమాలను ఆశీర్వదించుతూ వచ్చింది; చివరికి మాజీప్రధాని ఆంధ్రప్రదేశ్ గౌరవనీయ నాయకుల్లో ఒకరైన పి.వి.నరసింహారావు ఢిల్లీలొ దివంగతులైనప్పుడు ఆయని భౌతికకాయానికి ప్రభుత్వ గౌరవ లాంచనాలతో దహనసంస్కారాలు నిర్వహించేటట్లు చూడ్డంలో కూడా సోనియా స్వార్థపూరిత రాజకీయాన్నే ఆశ్రయించింది.



 

అలాగే స్వార్థం లేకపోతే, తెలంగాణా ప్రాంతంలో రాజకీయ పైరవీలతో అభాసుపాలైన ఓ స్థానిక రాజకీయ నిరుద్యోగిగా పదవులవేతలో మునిగితేలుతూ రాష్ట్ర 'విభజన' సూత్రం ద్వారా ప్రజలలో పాపులారిటీ కోసం పాకులాడుతూ ఉద్యమం నిర్మించుకున్న చంద్రశేఖరరావు అనే సీమాంధ్ర వలస 'దొర'తో ఢిల్లీలొ నెలరోజుల పాటు మంతనాలకు సోనియా ఏర్పాట్లు చేయడాన్ని తెలుగుజాతి ఎలా సహించగల్గుతుంది? తన నాయకత్వంలో సాగుతున్న కాంగ్రెస్ అధిష్ఠానవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ప్రతిపాదనను రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలతో, అన్ని పక్షాల ప్రజాప్రతినిధులందరినీ ఒక్కచోట సమావేశపరిచి లేదా విస్తృత స్థాయిలో, క్షేత్రస్థాయిలో ప్రజాభిప్రాయాన్ని లేదా రిఫరెండం ఆధారంగా ప్రజల ఆకాక్షను తెలుసుకొనేందుకు ఆమె ప్రయత్నించాల్సింది. కాని ఆ పంధా విడిచిపెట్టి ఆకస్మికంగా రాష్ట్ర్ర విభజనకు సమ్మతిని అధిష్ఠానం వర్కింగ్ కమిటీ ప్రకటింపజేయడాన్ని ఆమెను ప్రజలు మరోలా ఎలా అర్థం చేసుకోగలరు? పచ్చి అబద్ధాలతో, విష ప్రచారంతో తెలుగుప్రజల మధ్య విద్వేషాలకు కారకులై యువకుల ఆత్మహత్యలకు దారిచూపిన గుప్పెడు నాయకులను రాజ్యాంగ నిబంధనల ప్రకారం కఠినంగా శిక్షించడానికి బదులు జాతి విచ్చిన్నకులతో మంతనాలు జరపడం హానికరమేకాదు, హాస్యాస్పదం కూడా.


 

ఇప్పుడు రాష్ట్రపతికి చేరిన రాష్ట్రముఖ్యమంత్రి కిరణ్ కుమార్ లేఖను రాష్ట్రపతి ప్రణబ్ చదువుకున్న వెంటనే అందలి తీవ్రతను గమనించి, ఒక రాజనీతిజ్ఞునిగా ఆ లేఖను సరాసరి "మన్నుతిన్న పింజేరులు''గా వ్యవహరిస్తున్న ప్రధానమంత్రి సహా క్యాబినెట్ నాయకులకు కాకుండా ఎకాయకిని కేంద్ర హోంశాఖ కార్యదర్శికే [మంత్రి షిండేకి కూడా కాకుండా] తక్షణ అభిప్రాయం కోసం పంపించారు. ఇది సవ్యమైన పద్ధతీ, మంచి సంప్రదాయం కూడా. ముఖ్యమంత్రి తనకు పంపిన లేఖ ఒక ఎత్తు కాగా, అంతకుముందు కొన్ని రోజుల క్రితమే ప్రణబ్ ముఖర్జీ ఆంధ్రప్రదేశ్ విభజన ప్రతిపాదన గురించి, పరిణామాల గురించి ప్రస్తావిస్తూ విభజన ప్రతిపాదన గురించి సోనియాను హెచ్చరించినట్లు కొన్ని పత్రికలు వార్తలు ప్రచురించడం గమనార్హం. అలాగే రాజ్యాంగ సంప్రదాయాల ప్రకారం, రాజ్యాంగ నిబద్ధతా ప్రక్రియ ప్రకారం ఏదైనా కాబినెట్ ప్రతిపాదననుగానీ, లేదా పార్లమెంటులో పెట్టాలని భావించిన బిల్లు ముసాయిదానుగానీ లోక సభను ఎన్నుకున్న ప్రజలే ఇటు రాష్ట్ర శాసనసభను కూడా ఎన్నుకుంటున్నందున భారత రాజ్యాంగానికి రెండు ముఖాలుగా ఉన్న యూనిటరీ, ఫెడరల్ (సమాఖ్య) వ్యవస్థల మధ్య సమన్యాయం పాటించాలి.



 

కేవలం "అభిప్రాయం'' కోసం మాత్రమే రాష్ట్ర లెజిస్లేచర్ కు పంపడం న్యాయ విరుద్ధం; సభ్యుల వోటింగ్ తీసుకోకుండా కేవలం అభిప్రాయాల సేకరణకు ఉండే వులువ ఎంత? రాష్ట్రాల శాసనసభలు ఫెడరల్ వ్యవస్థలో కేవలం వాడగొండులకు, కబుర్లరాయుళ్ళకు వేదికలుగా మాత్రమే ఉండాలా? ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్రాలకు ముఖ్యంగా వాటి ఉనికినే విభజన సూత్రం ద్వారా ప్రశ్నించడానికి బ్రూట్ మెజారిటీతో కొన్నాళ్ళు, మైనారిటీలో కేంద్రప్రభుత్వం ఈదులాడుతున్నప్పటికీ మొండిగానో, స్వార్థ ప్రయోజనాల కోసం ముందుకు దూకడాన్ని రాష్ట్రపతి ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది. అది తన రాజ్యాంగ నిబద్ధతకు, దాని నియమ సంప్రదాయాలకే పెద్ద సవాలుగా ఆయన భావించాలి; దేశంలో కనీసం అరడజను రాష్ట్రాలలో రాజకీయ నిరుద్యోగులవల్ల ప్రబలుతున్న వేర్పాటు ఉద్యమాలు [మహారాష్ట్రలొ విదర్భ, బెంగాల్ లొ గూర్ఖాలాండ్, అస్సాంలో బోడోలాండ్, కర్ణాటకలో కూర్గ్, తమిళనాడులో మదురై రాజధానిగా దక్షిణ తమిళనాడు రాష్ట్రంకోసం వగైరా వేర్పాటు ఉద్యమాలు] ఉండగా ఏకభాషా సంస్కృతులు ఆధారంగా తొలి భాషాప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన అఖండ తెలుగుజాతిని ఎందుకు సోనియా చీల్చదలచిందో ప్రణబ్ ఆలోచించాలి.



 

బెంగాల్ విభజన పాఠం పూర్వరంగంలో నవంబర్ 5వ తేదీన హైదరాబాద్ రానున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆలోచించి, కేంద్రానికి ఆచరణాత్మక సలహా యివ్వాలని కోరుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 'మొక్కట్లు' చెదరకుండా, తెలుగుజాతి సమైక్యతకు చెరుపురాకుండా చూడాలని సుమారు తొమ్మిది కోట్లమంది తెలుగువారూ బాధ్యతగల దేశ ప్రథమపౌరుడిని కోరుతున్నారు. తాను కూడా ఇప్పటికీ అన్ని ప్రధాన పదవుల్ని అనుభవించి, దేశ సర్వోన్నతస్థానాన్ని (ప్రెసిడెంట్ గా) కూడా అందుకోగల్గిన ప్రణబ్ ముఖర్జీ యింక చేరుకోవలసిన పరసీమలు లేవు కాబట్టి, పదవీ లాలస ఆయనకు ఉండదు; పదవీ విరమణానంతర పోస్టులపై ఆసక్తీ ఉండదు; కుటుంబ సభ్యులూ వివిధ వృత్తులలో కుదురుకుని పోయారు కాబట్టి, శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపడమే మిగిలిన దినచర్య అవుతుంది. అందువల్ల బెంగాలీ సాహిత్య సంస్కృతుల ప్రభావంలో కూడా తెలుగుజాతి ఈదులాడుకుంది; రవీంద్రుడి "జనగణమన'' గీత రచనకు స్వరకల్పన జరిగిన స్వర్ణభూమి ఈ తెలుగునేల! శరత్ రచనలు తెలుగువాడి సాహిత్యంగానే చదువుకొని దశాబ్దాలుగా ప్రభావితమైన భూమి ఈ తెలుగునాడు, అదే మరోమాటలో ఈ తెలంగాణం! ఉత్పలదత్ కల్లోల్ నాటకానికీ ప్రభావితమయిన సంస్కృతి తెలుగువారిది; అలాంటి ఆదానప్రధానాల చరిత్ర ఆంధ్రుల-బెంగాలీల బంధమూ, అనుభంధమూ! బెంగాల్ విభజన సృష్టించిన కల్లోల వాతావరణం ఆంధ్రప్రదేశ్ లొ ఏర్పడకుండా తప్పించే, నిరోధించే విజ్ఞతను విన్నాణాన్ని ప్రణబ్ నుంచి యావత్తు తెలుగుజాతీ ఆశించడం దురాశ కాదని గౌరవ రాష్ట్రపతి గుర్తించగలరనే విశ్వసిస్తున్నాం!

వైసీపీ, బీఆర్ఎస్ బంధానికి ఇంత కంటే రుజువుంటుందా?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం తన పుట్టిన రోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ఆయనకు అభిమానులు, ఆయన పార్టీ నేతలు, శ్రేణుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు ఓ రేంజ్ లో కనిపిస్తున్నాయి.  అవన్నీ పక్కన పెడితే  తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద వెలసిన  ఓ భారీ కటౌట్ ఆసక్తి రేకెత్తిస్తోంది. జగన్ జన్మదినాన్ని పురస్కరించుకుని  తాడేపల్లిలోని జగన్ నివాసం అదేనండి తాడేపల్లి ప్యాలెస్ వద్ద పెద్ద ఎత్తున బ్యానర్లు, హోర్డింగ్ లు, కటౌట్ లు వెలిశాయి.  వీటిలో ఒక బ్యానర్ మాత్రం అందరి దృష్టినీ విశేషంగా ఆకర్షిస్తోంది.  ఆ భారీ కటౌల్ లో జగన్, కేసీఆర్, కేటీఆర్ చిత్రాలు ఉండటమే అందుకు కార ణం. ఈ బ్యానర్ రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. ఈ బ్యానర్ బీఆర్ఎస్, వైసీపీ బంధానికి నిదర్శనంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. ఇటీవల బెంగళూరులోని ఓ ప్రైవేటు కార్యక్రమంలో జగన్ కేటీఆర్ తో భేటీ అయిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు.  

బీజేపీలో చేరిన ప్రముఖ సినీ నటి

  ప్రముఖ సినీ నటి ఆమని భారతీయ జనతా పార్టీలో చేరారు. నాంపల్లి సెంట్రల్ ఆఫీసులో రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ఆమెకు కాషాయ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.  అనంతరం పార్టీ సభ్యత్వాన్ని అందజేశారు. ఈ సందర్బంగా ఆమని మాట్లాడుతు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం సాధిస్తున్న ప్రగతిని చూసి గర్వపడుతున్నాని తెలిపారు. ప్రధాని చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితురాలినై ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు.  ఆయన సనాతన ధర్మం కోసం మోదీ ఎంతో పాటుపడుతున్నారు" అని ఆమె పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజా పోరాటాలపై నెమ్మదిగా స్పందిస్తున్న బీజేపీ, ఇప్పుడు అనూహ్యంగా సినీ తారలను చేర్చుకోవడంపై దృష్టి పెట్టడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా విజయశాంతి, జయసుధ, జీవితా రాజశేఖర్ వంటి వారిని పార్టీలోకి ఆహ్వానించింది. కొందరు అగ్ర హీరోలతో బీజేపీ జాతీయ నేతలు భేటీ కావడం, దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌కు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి  

మీరసలు హిందువులేనా, మీకసలు దేశ భక్తి ఉందా?.. విజయసాయి

వైసీపీ మాజీ నాయకుడు, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి హిందుత్వ అనుకూల వ్యాఖ్యలు చేశారు. రాజకీయ సన్యాసం తీసుకుని వ్యవసాయమే వ్యాపకమంటూ ప్రకటించిన ఆయన అడపాదడపా రాజకీయ వ్యాఖ్యలు చేస్తూ వార్తలలో నిలుస్తున్న విషయం తెలిసిందే.  అన్నిటికీ మించి ఆయన ఇటీవలి కాలంలో చేస్తున్న వ్యాఖ్యలు ఆయన కమలం గూటికి చేరువ అవుతున్నారన్న సంకేతాలు ఇస్తున్నాయి. విజయసాయి కాషాయ మంత్రం జగన్ కు కషాయం కావడం తథ్యమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇటీవల ఒక సందర్భంగా ఆయన హిందూమతంపై కుట్రలు జరుగుతున్నాయంటూ తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బు ఆశ చూపి మతమార్పిడులకు పాల్పడుతున్న వారికి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. అక్కడితో ఆగకుండా గత రెండు దశాబ్దాలుగా జరిగిన మతమార్పిడులపై ఓ కమిటీ వేసి మరీ విచారణ జరపాలని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు. దీంతో ఆయన జగన్ అండ్ వైసీపీ టార్గెట్ గా రాజకీయ ప్రవేశానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారంటూ పరిశీలకులు విశ్లేషించారు. ఇప్పుడు తాజాగా  బంగ్లాదేశ్ లో ఆందోళనలు హింసాకాండపై ఎక్స్ వేదికగా స్పందించిన విజయసాయి రెడ్డి.. బంగ్లాదేశ్ లో హిందువులు లక్ష్యంగా దాడులు జరుగుతున్నా యన్నారు. ఈ దాడులను ఆయన నరమేధంగా అభివర్ణించారు. ఈ దాడులను ఖండించని వారు అసలు హిందువులే కారనీ, వారికసలు దేశ భక్తే లేదంటూ విమర్శలు గుప్పించారు.  బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న అమానుష దాడులను ఖండించకుండా మౌనంగా ఉన్న రాజకీయ పార్టీలకు, నాయకులకు ఈ దేశంలో కొనసాగే నైతిక హక్కు లేదని పేర్కొన్నారు.   భారతదేశం మత సామరస్యానికి ప్రతీక అన్న విజయసాయి.. అటువంటి దేశంలో ఉంటూ.. బంగ్లాలో హిందువులు లక్ష్యంగా సాగుతున్న దాడులపై  స్పందించకపోవడం దారుణమన్నారు. ఈ దాడులకు ఖండించని వారు దేశ భక్తులే కాదని విజయసాయి తన ట్వీట్ లో పేర్కొన్నారు. దీంతో ఆయన తన రాజకీయ పున: ప్రవేశానికి కమలదళం గొంతుకను సిద్ధం చేసుకుంటున్నారని పరిశీలకులు అంటు న్నారు.  

పీపీపీపై న్యాయపోరాటం ఎలా? వైసీపీ మల్లగుల్లాలు!

పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల వ్యవహారాన్ని రాజకీయం చేయడానికి అష్ఠకష్టాలు పడిన వైసీపీ.. కోటి సంతకాలంటూ చేసిన హడావుడి ముగిసింది. గవర్నర్ కు వినతిపత్రంలో ఆ ప్రహసనం దాదాపు ముగిసిపోయినట్లే. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల పట్ల ప్రజల వ్యతిరేకత పెద్దగా కనిపించలేదని స్పష్టమైంది. దీంతో ఇప్పుడు కోర్టును ఆశ్రయించాలని భావిస్తోంది. ఈ విషయంలో కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేయడానికి సన్నాహాలు చేస్తున్నది. అయితే ఇక్కడే ఆ పార్టీకి పెద్ద ఇబ్బంది వచ్చి పడిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పీపీపీ విధానం వద్దు అంటూ కోర్టును ఆశ్రయిస్టే ఆ పిటిషన్ అడ్మిషన్ స్థాయిలోనే తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉందంటున్నారు న్యాయ నిపుణులు. ఎందుకంటే పీపీపీ విధానం అన్ని పరీక్షలకూ తట్టుకుని నిలబడిన అంశం. కేంద్రం నుంచి పలు రాష్ట్రాలలో ఇన్ ఫ్రాస్టక్చర్ డెవలప్ మెంట్ అన్నది ఈ పీపీపీ విధానంలోనే జరుగుతోంది. సరే అది కాదని మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంటూ కోర్టుకు వెడదామా? అంటే..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పగించలేదు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం అంటూ జీవోలోనే స్పష్టంగా పేర్కొంది.  దీంతో ఆ పాయింట్ మీద కోర్టుకు వెళ్లడం ఎలా అన్నది అర్ధం కాక వైసీపీ మల్లగుల్లాలు పడుతోందని పరిశీలకులు అంటున్నారు. అది పక్కన పెడితే తాము సేకరించిన కోటి సంతకాలనూ కోర్టు ముందు ఉంచుతామన్న వాదనను వైసీపీ తెరపైకి తీసుకువస్తున్నది. అయితే అదీ అంత తేలిక కాదు. నిజంగా వైసీపీ కోటి సంతకాలు సేకరించి, వాటిని కోర్టుకు సమర్పించాలంటే, ఆ కోటి సంతకాలు చేసిన వారి గుర్తింపును కూడా కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. వాస్తవానికి సంతకాల సేకరణ కార్యక్రమం ఎలా జరుగుతుందన్నది అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో సంతకాలు చేసిన కోటి మంది ఐడెంటిటీని కోర్టు ముందు ఉంచడం అంటే అయ్యే పని కాదని వైసీపీ శ్రేణులే అంటున్నాయి. ఈ నేపథ్యంలో పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యంలో ప్రైవేటు కాలేజీలకు వ్యతిరేకంగా న్యాయపోరాటానికి ఎలా ముందుకు వెడుతుందన్నది ఆసక్తిగా మారింది. 

సానుకూల దృక్ఫథంతో సవాళ్లను అధిగమించా.. విద్యార్థులతో నారా లోకేష్

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నాయకత్వ పటిమ విషయంలో కానీ, సమస్యలను దీటుగా ఎదుర్కొని పరిష్కరించగలిగిన పరిణితి విషయంలో కానీ, పార్టీకి అన్నీ తానై దిశా నిర్దేశం చేయగలిగిన సమర్థత విషయంలో కానీ ఇప్పుడు ఎవరికీ ఎటువంటి అనుమానాలూ లేవు.   సొంత పార్టీయే కాదు, ప్రత్యర్థి పార్టీలు సైతం ఇప్పుడు నారా లోకేష్ పరిణితి చెందిన నాయకుడనీ, ప్రజాభిమానం చూరగొన్న ప్రజా నాయకుడని అంగీకరిస్తున్నాయి. అయితే నారా లోకేష్ నాయకత్వానికి ఈ ఆమోదం, ఈ అంగీకారం అంత తేలిగ్గా రాలేదు. అసలు నారా లోకేష్ రాజకీయాలలో తొలి అడుగులు పడకముందే ఆయన నడకను ఆపేయాలని చూశారు. రాజకీయాలలో ఓనమాలు దిద్దడానికి ముందే ఆయన ఎదుగుదలను అణచివేయాలన్న ప్రయత్నాలు జరిగాయి. పొలిటికల్ గా నారా లోకేష్ తొలి పలుకులు కూడా బయటకు రాకూడదన్న కుట్రలు జరిగాయి. పప్పు అంటూ బాడీ షేమింగ్,  హేళనలు ఇలా ఎన్నో ఎదుర్కొన్నారు. టార్గెట్ చేసి మరీ క్యారెక్టర్ అసాసినేషన్ కు ప్రయత్నాలు జరిగాయి. సోషల్ మీడియాలో ట్రోలింగ్ , మీమ్స్ తో లోకేష్ రాజకీయ ఎదుగుదనలను ఆరంభంలోనే అణచివేయడానికి ప్రయత్నాలు జరిగాయి. ఈ విషయాలన్నిటినీ మంత్రి నారా లోకేష్ రాజమహేంద్ర వరంలో శుక్రవారం (డిసెంబర్ 19) విద్యార్థులతో ముఖాముఖీ కార్యక్రమంలో గుర్తు చేసుకున్నారు. వాటన్నిటినీ అధిగమించడానికి తాను ఏం చేశారో పంచుకున్నారు.   తన శక్తిని అటువంటి ట్రోలింగ్స్, మీమ్లను ఖండించడానికీ, బుదలు ఇవ్వడానికీ వృధా చేయ కూడదని అందుకు బదులుగా  రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగడంపైనే దృష్టి సారించాననీ వివరించారు. తాను ప్రత్యక్ష ఎన్నికలో పోటీ చేసిన తొలి సారే పరాజయం పాలైన సంగతిని గుర్తు చేసుకున్న ఆయన, ఆ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుని, ఓడిన చోటే గెలవాలన్న పట్లుదలతో  పని చేసి ఫలితం సాధించానని లోకేష్ వివరించారు.  తనకు ఎదురైన ప్రతి సవాలును సానుకూల దృక్ఫ థంతో ఎదుర్కొన్నానని చెప్పారు.  ఒక అడుగు వెనక్కి వేస్తే సరిదిద్దుకోవడానికి సంవత్సరాలు పట్టవచ్చని ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు చెప్పారు.   

రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే సవాల్ కు మంత్రి లోకేష్ సై

ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అభివృద్ధి విషయంలో తనతోనే పోటీ పడతానంటూ సవాల్ చేసిన పార్టీ ఎమ్మెల్యేను అభినందించారు. మనస్ఫూర్తిగా ఆ సవాల్ ను స్వీకరిస్తున్నానని సభా ముఖంగా ప్రకటించారు. ఇంతకీ విషయమేంటంటే.. రాజమహేంద్రవరంలో శుక్రవారం (డిసెంబర్ 19) పర్యటించిన నారా లోకేష్ అక్కడ  నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, నేతల సమన్వయ సమావేశంలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు.. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గాన్ని మంగళగిరికి దీటుగా అభివృద్ధి చేస్తానన్నారు. నియోజకవర్గ అభివృద్ధి విషయంలో తాను నారా లోకేష్ తో పోటీ పడతానని అన్నారు. దీనికి నారా లోకేష్ చాలా చాలా సానుకూలంగా స్పందించారు. సిటీ  ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సవాల్ ను స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. ప్రజలతో మమేకమౌతూ ముందుకు సాగాలన్న లోకేష్.. ఆదిరెడ్డి వాసు కుటుంబం కష్ట సమయంలో తమకు అండగా ఉందని చెప్పారు.  జగన్ హయాంలో చంద్రబాబును అక్రమంగా రాజమహేంద్రవరం జైల్లో నిర్బంధించిన సమయంలో ఆదిరెడ్డి కుటుంబం తమకు అండగా నిలిచిందని చెప్పారు. ఆయనను తాను తన కుటుంబ సభ్యుడిగా భావిస్తానన్నారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై విమర్శలు గుప్పించారు. జగన్ ను సైకోగా అభివర్ణించారు. సైకో ఇంకా అరెస్టులు చేస్తానంటూ చేస్తున్న బెదరింపులను ఖండించారు.  అధికారంలో ఉండగా వైనాట్ 175 అంటూ గప్పాలు కొట్టిన వారు, గత ఎన్నికలలో టీమ్ 11 కు పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. కూటమి పార్టీల మధ్య చిచ్చుపెట్టే కుట్రలు జరుగుతున్నాయన్న ఆయన ఆ విషయంలో అప్రమత్తంగా ఉండాలని లోకేష్ సూచించారు. వచ్చే 15 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వమే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుందన్నారు. 

వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి.. కేటీఆర్ కు ముళ్ల కిరీటమేనా?

క‌మ్యూనిస్టుల‌కు  ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అనే ప‌ద‌వి ఎంత  ప‌వ‌ర్ ఫుల్లో.. బీఆర్ఎస్ వంటి పార్టీల‌కు వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ప‌ద‌వి అంటే అంత వేల్యుబుల్.  అయితే బీఆర్ఎస్ లో సమస్య ఏమిటంటే.. పార్టీ అధినేత కేసీఆర్ త‌ర్వాత అంత‌టి వాడిగా.. ఆయన పొలిటిక్ వారసుడిగా కేటీఆర్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత జరిగిన ఏ ఎన్నికలోనూ పార్టీ విజయాన్ని నమోదు చేసింది లేదు. నల్లేరు మీద బండినడక అనదగ్గ ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇదే విషయాన్ని ఎత్తి చూపుతూ కేటీఆర్ నాయకత్వంపై విమర్శలు గుప్పించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.  వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఉన్నంత కాలం బీఆర్ఎస్ పరాజయాలను ఎదుర్కొంటూనే ఉంటుందన్నారు.  వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఎంపికైన నాటి  నుంచి ఇప్ప‌టి  వ‌ర‌కూ   గ్రేట‌ర్, కార్పొరేషన్, ఆ తరువాత 2023 అసెంబ్లీ ఎన్నికలు, 2024 సార్వత్రిక ఎన్నికలు, ఇవి రెండూ పూర్తయిన తరువాత  రెండు ఉప ఎన్నికలు, తాజాగా పంచాయతీ ఎన్నికలు జరిగాయి. అయితే పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఈ అన్ని ఎన్నికలలోనూ ఆయన ప్రచార బాధ్యతను భుజాన వేసుకుని పని చేశారు. అయితే వేటిలోనూ పార్టీని విజయం దిశగా నడిపించలేకపోయారు.  దుబ్బాక నుంచి మొద‌లు పెడితే నిన్న మొన్న‌టి  జూబ్లీహిల్స్ బై పోల్ వ‌ర‌కూ ప్ర‌తి ఎన్నికలోనూ పార్టీని పరాజయమే వరించింది.  ఇటీవ‌లి స్థానిక ఎన్నిక‌ల‌లోనూ కేటీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ ఓటమినే మూటగట్టుకుంది.   రేవంత్  విమర్శలను పక్కన పెడితే..  కేటీఆర్ కి కానీ,  బీఆర్ఎస్ కి కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అచ్చిరాలేదన్న ప్రచారం బీఆర్ఎస్ శ్రేణుల్లోనే జోరుగా సాగుతోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావం తరువాత తొమ్మిదేళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉండగా కేటీఆర్ సమర్ధ నాయకుడిగా గుర్తింపు పొందడం వెనుక తండ్రి ఇమేజ్ ఉంది. సీఎం కుమారుడిగా, మంత్రిగా ఆయన మాటే వేదంగా అప్పట్లో ప్రభుత్వ, పార్టీ వ్యవహారాలు సాగాయి. అయితే ఆ ఘనత అంతా కేసీఆర్ దేనని అంటారు విమర్శకులు. ఇప్పుడు పార్టీ అధికారం కోల్పోయిన తరువాత.. ముందుండి పార్టీని నడిపించడంలో కేటీఆర్ వైఫల్యాలు ప్రస్ఫుటంగా కనిపిస్తుండటంతో సొంత పార్టీలోనే కేటీఆర్ నాయకత్వంపై సందేహాలు, అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయనడం ఎంత మాత్రం అతిశయోక్తి కాదు.  ఎన్నికలలో వరుస పరాజయాలతో వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయన కొనసాగింపుపైనా బీఆర్ఎస్ లో అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న పరిస్థితి.  అయినా బీజేపీ, కాంగ్రెస్ వంటి పార్టీలలో కూడా కార్యనిర్వాహక అధ్యక్ష పదవిలో కొనసాగుతున్న వారు ఉన్నారు. కానీ వారి విషయంలో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిపై ఈ స్థాయి చర్చ జరగడం లేదు. ఒక్క కేటీఆర్ విషయంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన సామర్థ్యం, అర్హతపై రాజకీయ ప్రత్యర్థలు నుంచే కాదు, బీఆర్ఎస్ శ్రేణులు, నేతల నుంచి కూడా ప్రశ్నలు ఎదురౌతున్నాయి. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..  కేటీఆర్  పార్టీకి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్  గా  ఉన్నన్ని రోజులూ బీఆర్ఎస్ గెలుపు అన్న మాటను మరచిపోవడం మంచిదన్న సూచన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతే కాదు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావే సోషల్ మీడియాలో పదె్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు.  చూడాలి మరి వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ముందు ముందు ఎలా నెట్టుకుని, నెగ్గుకుని వస్తారో?

సీఎం లోకేష్.. ముహూర్తం ఫిక్సైందా?

లోకేష్ ని 2027 ఉగాది నాటిక‌ల్లా  ముఖ్య‌మంత్రిని చేసే దిశ‌గా  కొన్ని  పావులు క‌దులుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. లోకేష్ ఢిల్లీ వెళ్లి మోడీ క‌లిసిన‌పుడు జ‌రిగే  ప్ర‌ధాన  చ‌ర్చ ఇదేనంటారు చాలా మంది. ఇటు ఢిల్లీ, అటు నాగ్ పూర్ వ‌ర్గాల స‌మాచారాన్ని బ‌ట్టి చూస్తే ఇదే జ‌ర‌గ‌వ‌చ్చ‌న్న అభిప్రాయం పరిశీలకుల్లో సైతం వ్యక్తం అవుతోంది.  ఏపీలో ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో  నంబర్ 1, 2,  3 అంటూ హైరాక్కీని బట్టి చూస్తే లోకేష్ మూడో స్థానంలో ఉన్నారు. జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తరువాత రెండో స్థానంలో ఉన్నారని చెప్పాల్సి ఉంటుంది.  అయితే ఈ హైరాక్కీని దాటి   త్వ‌ర‌లో  లోకేష్ కి ముఖ్య‌మంత్రి ప‌ద‌విని అప్ప‌గించేందుకు గ్రౌండ్ వర్క్ జరుగుతోందా అన్న అనుమానాలు పొలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తం అవుతున్నాయి. లోకేష్ కు సీఎం పదవి విషయంలో కేంద్రంలోని ఎన్డీయే కూటమి అగ్రనాయకత్వం సుముఖంగా ఉందంటున్నారు. ఈ విషయంలో పవన్ కల్యాణ్ నుంచి కూడా ఎటువంటి అభ్యంతరం వ్యక్తం కావడం లేదంటున్నారు పరిశీలకులు. సీఎం పదవి కోసం పవన్ తొందరపడటం లేదనీ, ఆయన తన పాతికేళ్ల పొలిటికల్ కేరీర్ లు ప్లాన్ చేసుకుని ముందుకు సాగుతున్నారని చెబుతున్నారు.   అన్నిటికీ మించి లోకేష్ కు సీఎం పట్టాభిషేకం చేయడానికి నంబర్స్ కూడా బలంగా ఉన్నాయి. రాష్ట్ర అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీకి మ్యాజిక్ ఫిగర్ కు మించిన సంఖ్యా బలం ఉంది. ఇక కూటమి ఐక్యత విషయానికి వస్తే.. పవన్ కు కూటమి అవసరమా? కూటమికి పవన్ అవసరమా? అన్న ప్రశ్నే తలెత్తే పరిస్థితి లేదు. పవన్ కల్యాణ్ కూటమి పటిష్ఠత గురించే ఎక్కువ మాట్లాడుతున్నారు. అలాగే రాష్ట్ర ప్రగతిలో లోకేష్ క్రెడిట్ ను గుర్తించడానికే మొగ్గు చూపుతున్నారు.  ఈ నేపథ్యంలోనే   సీఎం చైర్ కు లోకేష్ లైన్ క్లియ‌ర్ అయ్యిందనే అంటున్నారు పరిశీలకులు. 

ఓట్ చోరీ.. రాహుల్ ని గట్టెక్కించలేదెందుకు?

ఒక‌ప్పుడు ఇందిరాగాంధీ, ఆ తరువాత  రాజీవ్ గాంధీ.. భార‌త రాజ‌కీయాల్లో సంచ‌ల‌న విజ‌యాలు సాధించారు. వారికి చట్టసభల్లో సంఖ్యాబలానికి ఒక పరిమితి అంటూ ఉండేది కాదు.  ఇప్పుడైతే వ‌రుస‌గా మూడోసారి బీజేపీ నాయకత్వంలో ఎన్డీయే వరుసగా మూడో సారి అధికారంలోకి వచ్చినా, మూడో సారి బీజేపీకి స్వయంగా వచ్చిన స్థానాలు   240 కాగా.. ఎన్డీయే  భాగ‌స్వామ్య ప‌క్షాల‌తో ఎలాగోలా  గ‌ట్టెక్కి అధికార పీఠం చేప‌ట్ట‌గ‌లిగింది. అదే ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల హయాంలో అయితే అప్ప‌ట్లో  లోక్ సభలో కాంగ్రెస్ సంఖ్యా బలం  400కు మించి ఉన్న సందర్భాలు ఉన్నాయి. కానీ అప్పుడెవ‌రూ కాంగెస్ ని ఓట్ చోరీ అంటూ ఎగ‌తాళి  చేయ‌లేదు. ఎవ‌రి  క‌ష్టం  వారు ప‌డుతూ.. ప్ర‌జ‌ల్ని మెప్పించే ప‌ని మాత్ర‌మే చేస్తూ వ‌చ్చేవార‌మ‌ని తాజాగా మాజీ ప్ర‌ధాని దేవెగౌడ‌ వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ ఓట్ చోరీ అంటూ చేస్తున్న ఆర్భాటాన్నీ, హంగామానూ బిల్డప్ ప్రక్రియగా కొట్టి పారేశారు.  ఏదో ఒక నేరేటివ్ బిల్డ‌ప్ చేయ‌డంలో భాగంగా రాహుల్ గాంధీ ఈ త‌ర‌హా ప్ర‌చారాన్ని  తెర‌పైకి తెచ్చారంటున్నారు. రాహుల్ అందిపుచ్చుకున్న ఓట్ చోరీ..  వ్యూహ‌క‌ర్త‌లిచ్చిన స‌ల‌హా  లేదా సూచ‌న  కావ‌చ్చు. అదీ కాదంటే కాంగ్రెస్ అగ్రనాయకత్వమే స్వయంగా ఈ నినాదాన్ని ఎత్తుకుని ఉండవచ్చు. అయితే ఓటు చోరీ నినాదం ప్రజల్లోకి లోతుగా వెళ్లినట్లనిపించినా.. అది కాంగ్రెస్ కు ఎలాంటి ప్రయోజనం చేకూర్చింది లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఓట్ చోరీ స్లోగ‌న్ తో బీహార్ ఎన్నిక‌ల‌కు వెళ్తే అది బూమ‌రాంగ్ అయ్యింది. రాహుల్ లాంటి ప్ర‌చార‌క్ ఉన్నంత వ‌ర‌కూ బీజేపీ  అధికారంలోకి వ‌స్తూనే ఉంటుంద‌న్న టాక్  అధికార కూటమిలో జోరుగా స్ప్రెడ్ అవుతోంది.  రాహుల్ విషయంలో చెప్పుకోవలసిందంటూ ఏదైనా ఉంటే ఆయన చేపట్టిన భారత్ జోడో యాత్ర.  ఆ యాత్ర ద్వారా.. రాహుల్  ఇటు కాంగ్రెస్ ని అటు ఇండి కూట‌మిని  ఈ మాత్ర‌మైనా  నిలబెట్టగలిగారు.   అలాగ‌ని రాజ‌కీయ ప‌రంగా అధికార ప‌క్షాన్ని ఇరుకున పెట్టేలాంటి చ‌ర్య‌లేవీ చేప‌ట్ట‌క పోవ‌డం వ‌ల్ల  కాంగ్రెస్ లో పెద్దగా జోష్ కనిపించడం లేదు.  కార్య‌క‌ర్త‌లను ఏదో ఒక కార్యక్రమంతో బిజీగా ఉంచాలి.  అందులో భాగంగానే రాహుల్ గాంధీ.. ఈ నినాదం భుజానికి  ఎత్తుకున్నారు. త‌ర‌చూ త‌న వాద‌న‌ల రూపంలో  ఏదో ఒక అంశాన్ని, సమస్యను తెరమీదకు తీసుకువస్తుంటారు. తినగతినగ వేమ తియ్యగుండు అన్నట్లుగా.. నిరంతరం జనంలోకి ఏదో ఒక అంశాన్ని తీసుకువెడుతుంటే.. ఏదో ఒక లీడ్ దొరికి అధికారం ‘చేతి’కి రాకుండా ఉంటుందా అన్నది ఆయన ఆలోచనో, వ్యూహమో అయి ఉంటుందంటున్నారు పరిశీలకులు.   ఇవాళ్రేపు రాజ‌కీయంగా ఒక నెగిటివిటీని నూరిపోస్తే త‌ప్ప రాణించ‌లేని గ‌డ్డు కాలం న‌డుస్తోంది. అందుకే రాహుల్ ఈ దేశం నుంచి ఆర్ఎస్ఎస్, మోడీ, అమిత్ షాల‌ను పార‌దోలాల్సిన  అవ‌స‌రం క‌నిపిస్తోంద‌నీ,  వారి ప్ర‌భావం నుంచి దేశాన్ని కాపాడాలని అంటున్నారు కానీ అది ఎలా సాధ్యం అన్న విషయంలో మాత్రం రాహుల్ లో కానీ, కాంగ్రెస్ లో కానీ క్లారిటీ కానరావడం లేదంటారు పరిశీలకులు. ఓట్ చోరీ నినాదం విషయంలో మాజీ ప్రధాని దేవెగౌడ రాహుల్ పై చేసిన వ్యాఖ్యలు కూడా అలానే ఉండటం యాధృచ్ఛికమేనా?  

జ‌గ‌న్ ‘పీపీపీ’.. డుం డుం డుం!

మెడిక‌ల్ కాలేజీల పీపీపీ విధానాల‌ పై ప్ర‌జావ్య‌తిరేక‌త ఎంత ఉందో తెలియ చేస్తూ కోటి సంత‌కాల సేక‌ర‌ణ చేసింది వైసీపీ. పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని మొత్తం 175 నియోజ‌క‌వ‌ర్గాల  నుంచి మెడికల్ కాలేజీల ప్రభుత్వ, ప్రైవేటు   భాగస్వామ్యం విధానానికి వ్యతిరేకంగా కోటీ  4 ల‌క్ష‌ల   ఈ సంత‌కాల సేక‌ర‌ణ చేసి గ‌వ‌ర్న‌ర్ కి స‌మ‌ర్పించారు జగన్.  ఈ సందర్భంగా ర్యాలీలు కూడా నిర్వహించారు. జగన్ స్వయంగా 40 మంది బృందంతో కాలినడకన వెళ్లి మరీ ఆ సంతకాల పత్రాలను గవర్నర్ కు అందజేశారు. అసలింతకీ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఒక్క చంద్రబాబు కాదు, కేంద్ర ప్రభుత్వం సహా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలూ అనుసరిస్తున్నాయి. ఈ పీపీపీ విధానం వల్ల ఎటువంటి నష్టం లేదని కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు.  ఎవరెంతగా చెప్పినా జగన్ మాత్రం తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లన్నట్లు వ్యవహరిస్తున్నారు.  ఇంత‌కీ జ‌గ‌న్ అండ్ కో  పీపీపీ విధానంపై చేస్తున్న విమర్శలు ఏమిటంటే..   పీపీపీ విధానంలో మెడిక‌ల్ కాలేజీ అభివృద్దికి ముందుకు వచ్చే ప్రైవేటు వ్యక్తులు కేవలం లాభాపేక్షతోనే వస్తారు. కోట్లు కొల్లగొడతారు. దీని వల్ల పేదలకు వైద్య విద్య మ‌రింత ఖ‌రీద‌వుతుంది. ఇది వారి పాలిట ఆశ‌నిపాతంగా మారుతుంది. ఇదీ జగన్ అండ్ కో అంటే జగన్, వైసీపీయులు చేస్తున్న వాదన. ఇక కోటి సంతకాలను గవర్నర్ కు సమర్పించే సందర్భంగా  జగన్ హాట్ కామెంట్లు కూడా చేశారు. అందులో యోగాంధ్ర కార్యక్రమం గురించి ప్రస్తావించారు. యోగాంధ్ర కోసం 330 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ప్రభుత్వం పేదల మెడికల్ విద్య కోసం వెయ్యి కోట్లు ఖర్చు చేయలేదా అని ప్రశ్నించారు.  ఇక్కడే ఆయన ఆర్థిక అజ్ణానం బయటపడుతోంది. వాస్తవానికి ప్రభుత్వం స్వయంగా ఖర్చు చేయడం లేదు.. ప్రైవేటు వ్యక్తులను ఆ వ్యయంలో భాగస్వాములను చేస్తున్నది. అదే పంధాలో సంక్షేమ పథకాలనూ అమలు చేస్తున్నది. జగన్ హయాంలో అభివృద్ధిని పూర్తిగా అటకెక్కించేసి బటన్ నొక్కుడు అంటూ ఖజానా మొత్తం సంక్షేమం అంటే ధారపోసి జగన్ బావుకున్నదేంటి? రాష్ట్రానికి ఒరిగిందేమిటి? అంటే జగన్ కు ఘోర పరాజయం, రాష్ట్రానికి తలకు మించిన అప్పులు మాత్రమే.  ప్రభుత్వానికి తలకు మించిన భారం కాకుండా  ప్రైవేటు వ్య‌క్తుల‌ను కూడా ఇన్వాల్వ్ చేయ‌డం మంచిదే కదా అంటున్నారు ఆర్థిక నిపుణులు. జ‌గ‌న్  హయాంలో ఆయన రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి, ఇంకా అన్ని నిబంధనలనూ తుంగలోకి తొక్కి అప్పులు తెచ్చి మరీ సంక్షేమం అంటూ చేసిన పందేరం.. ఓట్ల వేటే తప్ప మరేదీ కాదంటున్నారు.  ఇటీవల వలంటీర్ల విషయంలో తనకు జ్ణానోదయం అయ్యిందని ఇటీవల జగన్ ప్రకటించారు. మరి అప్పులు చేసి రష్ట్ర ప్రగతిని శూన్యం చేసి అమలు చేసిన సంక్షేమం దారి తప్పిందన్న విషయంలో ఆయనకు ఇంకా జ్ణానోదయం కలిగినట్లు లేదంటున్నారు విశ్లేషకులు.   ప్ర‌తిదీ ప్ర‌భుత్వం నుంచే ఖ‌ర్చు చేయ‌డం వ‌ల్ల అది  పెట్టుబ‌డి అనిపించుకోదు.   ప్ర‌భుత్వ‌మే  అన్నీ ఉచితంగా చేయ‌డం వ‌ల్ల ఎన్ని నిధులూ సరిపోవు. అప్పులే శరణ్యం అవుతుంది. అందుకే ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం అంటున్నది చంద్రబాబు సర్కార్.  ఈ విషయం అర్ధం చేసుకోకుండా,  జగన్ ఇలాగే వ్యవహరిస్తే..  2029 కాదు.. 2034నాటికి కూడా  వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవని రాజకీయ విశ్లేషకులే కాదు... వైసీపీయులు కూడా  అంటున్నారు.  ఎవరో అనడం ఎందుకు జగన్ తాను స్వయంగా చేయించుకున్న సర్వేలు కూడా అవే చెబుతున్నాయి కదా!  మరి జగన్  ఈ తీరు వైసీపీని ఏ తీరానికి చేరుస్తుందో వేచి చూడాల్సిందే.