అవిగానీ "ఆంధ్రా" తేనెటీగలా?

 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన సొంత నియోజకవర్గం గజ్వేల్ లో పర్యటనకు గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా హెలిప్యాడ్ ప్రాంగణం వద్ద అందరూ సీఎం కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంతలో ఒక్క హెలికాఫ్టర్ కాదు చాలా హెలికాఫ్టర్లు వచ్చాయి. కానీ అవి చాలా చిన్న చిన్నహెలికాఫ్టర్లు. అదేనండీ తేనెటీగలు. పాపం సీఎం కోసం ఎదురుచూస్తున్న అందరిపైనా వాటి ప్రతాపాన్ని చూపించాయి. వాటి నుండి తప్పించుకునేందుకు కొంత మంది చెట్లెక్కారు, కొంతమంది గోనె సంచుల్లో దూరిపోయారు, కొంతమంది నేల మీద పడి దొర్లారు. ఇంకొంతమంది కుర్చీలు అడ్డుపెట్టుకున్నారు. ఈ సందర్భంగా తేనెటీగలు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జాతో సహా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, పోలీసులు, కొంతమంది జనాలని కసితీరా కాటేశాయి. కొంపదీసి ఇవి "ఆంధ్రా తేనెటీగలు" కావు కదా?

Teluguone gnews banner