బీచ్ ఫెస్టివల్ వాయిదా
posted on Sep 23, 2025 @ 10:25AM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించ తలపెట్టిన బీచ్ ఫెస్టివల్ వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం బాపట్ల జిల్లా సూర్యలంకలో ఈ నెల 26 నుంచి 28 వరకూ మూడు రోజుల పాటు బీచ్ ఫెస్టివల్ నిర్వహించాల్సి ఉంది. ఈ బీచ్ ఫెస్టివల్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించాల్సి ఉంది. అ
యితే ప్రతికూల వాతావరణం కారణంగా బీచ్ ఫెస్టివల్ వాయిదా పడింది. భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో బీచ్ ఫెస్టివల్ ను వాయిదా వేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. తిరిగి ఎప్పుడు నిర్వహించేదీ తరువాత ప్రకటిస్తారు.