బీఆర్ఎస్ ది దుష్ప్రచారం.. బనకచర్ల ఆగదు!
posted on May 30, 2025 @ 10:34AM
బనకచర్లపై బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బనకచర్ల ప్రాజెక్టు ఆగదని విస్పష్టంగా చెప్పారు. తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ కేవలం రాజకీయ లబ్ధి కోసం విషప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కడప వేదికగా జరిగిన మహానాడులో పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన తరువాత ఆయన మాట్లాడారు.
కర్నూలు జిల్లా బనకచర్లలో నిర్మించే భారీప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్ రెడీ అయ్యిందని వెల్లడించారు. ఈ ప్రాజెక్టు విషయంలో ఇప్పటికే కేంద్రంతో పలుమార్ల చర్చించినట్లు తెలిపారు. గోదావరి జలాలను పోలవరం ద్వారా మళ్లించి బనకచర్లలో నిల్వ చేసి కర్నూలు జిల్లా సహా సీమ ప్రాంత ప్రజలకు అందించడమే తన లక్ష్యం, సంకల్పం అని ప్రకటించారు. అంశాన్ని ప్రస్తావించారు. గోదావరి జలాలను పోలవరం ద్వారా.. మళ్లించి.. బనకచర్లలో నిల్వ చేసి.. కర్నూలు సహా రాయలసీమ ప్రాంత ప్రజలకు అందించాలన్నది తమ సంకల్పంగా చెప్పుకొచ్చారు. బనకచర్లపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్నదంతా దుష్ప్రాచారమేనని చెప్పిన ఆయన వృధాగా ఉప్పు సముద్రం పాలౌతున్న గోదావరి జిలాలను సద్వినియోగం చేసుకునేందుకుకే ఈ ప్రాజెక్టు కుట్టుకుంటున్నామన్నారు. దీనిని కూడా అడ్డుకునేందుకు బీఆర్ఎస్ చేస్తున్న కుట్రలు సాగవని హెచ్చరించారు.
సముద్రంలో పోయే నీటిని వాడుకుంటే తప్పా? ప్రజలకు మేలు చేస్తే ఓర్చుకోలేరా? అని బీఆర్ఎస్ ను సభా ముఖంగా నిలదీశారు. ఇప్పటికైనా తప్పుడు ప్రచారాలు ఆపాలని సూచించారు. బనకచర్ల ద్వారా తెలంగాణకు ఎటువంటి నష్టం వాటిల్లదని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఏ ప్రాజెక్టు కట్టినా.. దాని ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు బాగుండాలనేదే తమ ఉద్దేశమని చంద్రబాబు పేర్కొన్నారు.