జగన్ కు బాలినేని రిటార్డ్.. అదిరిపోయిందిగా?
posted on Jan 16, 2024 4:48AM
సిట్టింగుల సీట్లు మార్చే ప్రయోగం చేస్తున్న వైసీపీ అధినేత-సీఎం జగన్ ప్రయత్నం బెడిసికొడుతోంది. మరీ ముఖ్యంగా మాజీ మంత్రి, ఆయన సమీప బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి విషయంలో మిస్ ఫైర్ అయ్యిందనే పరిశీలకులు అంటున్నారు. ఒంగోలులో బాలినేనికి వ్యతిరేకత ఉన్నందున, ఆయనను గిద్దలూరు లేదా మార్కాపురం నియోజకవర్గానికి పంపించాలన్నది పార్టీ అధినేత జగన్ ఆలోచన. కానీ తాను ఒంగోలు తప్ప మరెక్కడా పోటీ చేసేది లేదని బాలినేని కుండబద్దలు కొట్టేశారు. అంతే కాదు ఒంగోలు లోక్ సభ నియోజకవర్గం నుంచి తన మిత్రుడు మాగుంట శ్రీనివాసుల రెడ్డికే టికెట్ ఇవ్వాలని కూడా పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలోనే సొంత నియోజకవర్గం నుంచి బాలినేనికి అనూహ్య మద్దతు లభించింది. వైసీపీ మేయర్, కార్పొరేటర్లు అంతా బాలినేని వెంటే నిలిచారు.
బాలినేనికి ఒంగోలు సీటు విషయంలో. ఒంగోలు మేయర్ సహా పలువురు కార్పొరేటర్లు, కీలక నేతలు హైదరాబాద్‌లో ఉన్న బాలినేనికి బాసటగా నిలిచారు. జగన్ కంటే తమకు బాలినేనే ముఖ్యమని స్పష్టం చేశారు. పార్టీ ఏదైనా సరే తాను వచ్చే ఎన్నికల్లో ఒంగోలు నుంచే పోటీ చేస్తానని బాలినేని స్పష్టం చేయడమే కాకుండా ఆ విషయాన్ని జగన్, విజయసాయిరెడ్డికి స్పష్టం చేశారు. విజయవాడలో రోజుల తరబడి మకాం వేసినా బాలినేనికి జగన్ అప్పాయింట్ మెంట్ దొరకకపోవడంతో ఆయన ఒక ఓపెన్ అయిపోయారు. జగన్ ను కలిసేదే లేదని తెగేసి చెప్పేశారు. ఈ నేపథ్యంలోనే జగన్ ఒక వేళ మనసు మార్చుకుని ఒంగోలు నుంచి బాలినేనికి అవకాశం ఇచ్చినా కూడా బాలినేని ఇప్పుడు తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటి దాకా పార్టీ తరఫున పోటీ చేయాలంటే కోట్లలో సొమ్ము డిపాజిట్ చేయాలని జగన్ ఆశావహులకు షరతు పెడుతున్నారు.
ఈ విషయంలో బాలినేనే జగన్ కు తాను పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాలంటే 170 కోట్ల తనకు డిపాజిట్ చేయాలని రిటార్డ్ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఒంగోలులో పాతిక వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన తరువాతే తాను వైసీపీ అభ్యర్థిగా ఒంగోలు నుంచి రంగంలోకి దిగుతానని స్పష్టం చేసినట్లు సమాచారం. అంతే కాకుండా ఉమ్మడి జిల్లాలోని నియోజకవర్గాలకు కొత్త ఇన్ చార్జీల నియామకాలు కూడా తాను సూచించిన మేరకే జరగాలని బాలినేని జగన్ కు అల్టిమేటమ్ ఇచ్చినట్లు కూడా చెబుతున్నారు. అంతే కాకుండా మాగుంట శ్రీనివాుల రెడ్డికే ఒంగోలు లోక్ సభ నియోజకవర్గం నుంచి పార్టీ టికెట్ ఇవ్వాలని కూడా బాలినేషని షరతు పెట్టారని అంటున్నారు. గతంలో చెప్పినట్లుగానే పార్టీతో సంబంధం లేకుండా ఇద్దరమూ కూడా ఒంగోలు నుంచే రంగంలోకి దిగుతామనీ, మాగుంట లోక్ సభకు, తాను అసెంబ్లీకి ఒంగోలు నుంచే పోటీ చేస్తామని బాలినేని జగన్ కు తెగేసి చెప్పినట్లు సమాచారం.