బాలయ్య చికెన్ బిరియానీ @ రూ.2/-
posted on Dec 14, 2022 @ 2:05PM
హిందూపురం ఎమ్మెల్యే, యువరత్న నందమూరి బాలకృష్ణ రియల్ లైఫ్‌లో అయినా.. రీల్ లైఫ్‌లో అయినా.. ఏం చేసినా సన్సేషనే. నిర్ణయం తీసుకోవడం దానికి అమలు చేయడం అన్ స్టాపబుల్ స్పీడ్ లో జరిగిపోతుంటుంది. బాలయ్య ప్రతిపనిలోనూ ఆయన మార్క్ స్సష్టంగా కనబడుతుంది. తాజాగా బాలయ్య బాబు.. తన నియోజవర్గమైన హిందూపురంలో జస్ట్ 2 రూపాయిలకే చికెన్ బిర్యానీ అందుబాటులోకి తీసుకువచ్చారు. స్థానిక హిందూపురం ప్రభుత్వాసుపత్రి వద్ద దాదాపు 500 మందికి అన్న క్యాంటిన్ చికెన్ బిర్యానీ ఆయన అందించారు. అన్న క్యాంటీన్లు ప్రారంభించి 200 రోజులు పూర్తి కావడంతో బాలయ్య ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మెనూలో చికెన్ బిర్యానీ, గుడ్డు పాటు ఓ స్వీట్ అందించారు.
గతంలో చంద్రబాబు హయాంలో రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కానీ జగన్ ముఖ్యమంత్రి అయన తర్వాత.. అన్న క్యాంటీన్లు ఎత్తివేశారు. కేవలం రెండు రూపాయిలకే అన్నం అందింస్తుండంతో ప్రజలు వీటిని బాగా ఆదరించారు. అయితే అలాంటి ప్రజాప్రయోజనమైనటువంటి వాటిని వైఎస్ ప్రభుత్వం ఎత్తివేసింది. దీంతో ప్రజల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో రాష్ట్రంలో పలు చోట్ల టీడీపీ నాయకులు అన్న క్యాంటిన్లు ఏర్పాటు చేసినా వాటిని కూడా వైసీపీ సర్కార్ తొలగిస్తోంది.
అలాంటి పరిస్థితుల్లో నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురంలో అన్న క్యాంటీన్లకు భారీ ప్రజాదరణ దక్కింది. అలాగే స్థానిక ప్రజల కోసం మొబైల్ వైద్యశాలను సైతం ఆయన ప్రారంభించారు. గతంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్.. తన ప్రభుత్వ హయాంలో పేద ప్రజలకు.. రెండు రూపాయిలకే కిలో బియ్యం అందించే పథకాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ఈ పథకమే.. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని పలు ప్రభుత్వాలు అమలు చేసిన సంగతి తెలిసిందే.
మరోవైపు... వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని టీడీపీ అధినేత చంద్రబాబు కృత నిశ్చయంతో ఉన్నారు. ఆ క్రమంలో గతంలో తమ ప్రభుత్వ హయాంలో ప్రజలకు అందించిన అన్ని పథకాలు మళ్లీ అమలు చేస్తామని ఆయన క్లియర్ కట్‌గా ప్రజలకు స్పష్టం చేస్తున్నారు. ఇంకోవైపు.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సైతం మంగళగిరిలో అన్న క్యాంటీను ఏర్పాటు చేయడమే కాకుండా.. మొబైల్ వైద్యశాలను సైతం ప్రారంభించారు. అలాగే జగన్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానలను సైతం ఆయన బలంగా ప్రజల్లోకి తీసుకు వెళ్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అన్న క్యాంటీన్ల అంశం టీడీపీ ప్రధాన ప్రచారాస్త్రంగా మారనుందనడంలో ఏటువంటి అతిశయోక్తి లేదనే ఓ చర్చ రాష్ట్రంలో జోరుగా సాగుతోంది.