గుర్రపు స్వారీ చేసిన బాలయ్య.. అభిమానుల కేరింతలు


సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గుంటూరు జిల్లా తెనాలిలో జరగుతున్న ఎడ్ల పందాలను ప్రారంభించారు. ఈ ఏడాది త్వరలో రానున్న ఉగాది పండుగ సందర్భంగా..  గుంటూరు జిల్లాలో ఎడ్ల పందాలను ప్రారంభించడానికి గాను బాలకృష్ణ వచ్చారు. అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలుకగా.. కాగడా చేతబట్టి జ్యోతి ప్రజ్వలన చేసి ఎడ్ల పందాలను ప్రారంభించారు. అనంతరం ఆయన  అక్కడే గుర్రపు స్వారీ చేసి తన అభిమానులను అలరించారు. బాలయ్య గుర్రంపై స్వారీ చేస్తుండగా, ఆయన అభిమానులు గుర్రం వెంట పరుగులు పెడుతూ కేరింతలు కొట్టారు.

Teluguone gnews banner