పని తీరే ప్రామాణికం.. గెలుపు గుర్రాలకే టికెట్టు.. చంద్రబాబు స్పష్టీకరణ
posted on Aug 20, 2022 @ 10:54AM
పార్టీ అధినేతతో నాలుగు మాటలు మాటాడినంత మాత్రాన ఆయన దృష్టిలో గొప్ప నాయకుడు అయిపోరు, నాలుగు ఫోటోలు తీసుకున్నంత మాత్రాన జనాల్లో పరపతి పెరిగిపోతుందనుకోవడమూ పొరపాటే. రాజకీయాల్లో పైకి రావాలంటే పార్టీ కోసం పాటుపడాలి. పార్టీ విజయం కోసం కృషి చేయాలి. ఎన్నికలు ఏవయినా సరే పార్టీకి తన వం తు కృషి చేయడమే పార్టీ అధినేతను గౌరవించడంతో సమానం. ఏపీలో మారుతున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా తెలుగు దేశం పార్టీకి అధికారంలోకి రావడానికే అవకాశాలు మెండుగా ఉన్నాయన్న పరిశీలకుల విశ్లేషణల నేపథ్యంలో ఇంత కాలం పార్టీని పట్టించుకోకుండా మొహం చాటేసిన నేతలంతా మేమే తోపులం అంటూ ముందుకు వస్తున్నారు. చంద్రబాబు నిర్వహించిన సమీక్షలో పాల్గొని తమకే టికెట్ ఖరారైపోయిందంటూ లీకులిచ్చుకుంటూ ప్రచారం చేసుకుంటున్నారు.
దీంతో చంద్రబాబు ఈ విషయంలో పార్టీ నాయకులకు, క్యాడర్ కు క్లారిటీ ఇచ్చారు. తాను ఎవరికీ టికెట్ కన్ ఫర్మ్ చేయలేదని విస్పష్టంగా చెప్పారు. నియోజకవర్గ సమీక్షకు హాజరైనంత మాత్రాన టికెట్ కన్ ఫర్మ్ అయినట్లు కాదని, పార్టీ టికెట్ దక్కాలంటే పనితీరే ప్రామాణికమని తేల్చేశారు. జగన్ ప్రభుత్వ తీరు పట్ల ప్రజ లు విసుగెత్తారు. జగన్ పథకాలు, ప్రకటనలు ఒట్టి డొల్ల అన్న గ్రహింపునకు జనం వచ్చేశారు. రాష్ట్రంలో వైసీపీకి ఎదురుగాలి వీస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం దూకుడు పెంచింది. ప్రతీ ప్రాంతంలోనూ చిన్న, పెద్ద నాయకులను సమర స్పూర్తితో ముందడుగు వేయా లని ఆ పార్టీ అధినే చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు, క్యాడర్ కు దిశా నిర్దేశం చేశారు.
నియోజకవర్గాల వారీగా పార్టీ ఇన్ చార్జీలతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇదిగో ఈ సమీక్షలను ఆసరాగా చేసుకునే కొందరు తమకు పార్టీ టికెట్ అధినేత ఖరారు చేసుకున్నారంటూ ప్రచారం చేసుకుంటున్నారు. వదంతులు వ్యాపింప చేస్తున్నారు. వీటికి పార్టీ అధినేత చంద్రబాబు గట్టిగా చెక్ పెట్టారు. వదంతులు నమ్మొద్దనీ, ఎవరికీ తాను పార్టీ టికెట్ కన్ఫర్మ్ చేయలేదనీ విస్పష్టంగా చెప్పారు. ఈ సారి గెలుపు గుర్రాలకే పార్టీ టికెట్ ఇస్తానని ప్రకటించారు. పార్టీలో సీనియారిటీ, సమీకరణాల పేర్లతో టిక్కెట్లు వస్తాయనుకోవడం భ్రమేనని తేల్చేశారు. అవనిగడ్డ, పెనమలూరు, మార్కాపురం, సంతనూతల పాడు, గుంటూరు ఈస్ట్, పార్టీ ఇన్చార్జులతో భేటీ అయ్యారు. గత మూడు రోజుల్లో 14 అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్లతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించి.. వారి పనితీరును సమీక్షించారు.
ఎన్నికలకు ఎక్కువ సమయం లేదని..పార్టీ నేతలు, నియోజకవర్గ ఇంచార్జ్ లు మరింత దూకుడు పెంచాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ లతో..సమీక్షలు నిర్వహిస్తున్న ఆయన.. మొదటి రోజు అవనిగడ్డ, పెనమలూరు, మార్కాపురం,సంతనూతలపాడు నియోజకవర్గాల ఇంచార్జ్ లతో భేటీ అయ్యారు. ఆయా ఇంఛార్జ్ లతో ప్రత్యేకంగా జరిగిన ముఖాముఖిలో...పార్టీ సభ్యత్వ నమోదు, కమిటీల ఏర్పాటు, బాదుడే బాదుడు కార్యక్రమం, ఓటర్ల జాబితా పరిశీలన, పార్టీ కార్యక్రమాల నిర్వహణ...నేతల పనితీరుపై చర్చించారు. నియోజవకర్గ స్థాయిలో పార్టీ బలోపేతంపై తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్థేశం చేశారు. ఆయా నియోజకవర్గాలపై తన వద్ద ఉన్న నివేదికల ఆధారంగా ఇంచార్జ్ లతో మాట్లాడి...సూచనలు చేశారు. రానున్న ఏడాది కాలమే అత్యంత కీలక మని అలస త్వం వీడి ప్రణాళికతో పని చేయాలన్నారు. పార్టీ పిలుపునిచ్చే పలు కార్యక్రమాల్లో నేతలు, కార్యకర్తలు పాల్గొన డంతో పాటు స్థానిక సమస్యలపైనా పోరాటం చేయాలని సూచించారు. ప్రజా సమస్యలతో పాటు ఎమ్మెల్యేలు, మంత్రుల అవినీతి పైనా స్థాని కంగా కార్యక్రమాలు రూపొందించుకుని ప్రజల్లోకి వెళ్లాలని దిశానిర్దేశం చేశారు.
నేతల పనితీరును దృష్టిలో పెట్టుకునే వచ్చే ఎన్నికల్లో సీట్ల కేటాయింపు జరుగుతుందని పార్టీ నేతలకు అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు తేల్చిచెప్పారు.ఫలానా వారికి పార్టీ టికెట్ ఖరారైంది అంటూ వస్తున్న వదంతులను నమ్మొద్దని స్పష్టం చేశారు. నియోజకవర్గ సమీక్షలకు వచ్చిన వారందరికీ టికెట్ ఖాయమంటూ జరుగుతున్న ప్రచారాన్ని విశ్వసించొద్దని విస్పష్టంగా తేల్చేశారు. ఈ సారి తాను గెలుపు గుర్రాలకు మాత్రమే టికెట్లిస్తానని స్పష్టం చేశారు. నేతల పని తీరుపై ప్రతి మూడు నెలలకు ఒక సారి సమీక్ష నిర్వహిస్తానని చంద్రబాబు పేర్కొన్నారు. పార్టీ టికెట్ విషయంలో పని తీరే ప్రామాణికమని, గెలిచే వారికే టికెట్లని చంద్రబాబు విస్పష్టంగా చెప్పారు. రానున్న రోజులలో నియోజవకర్గాల ఇన్ చార్జిలతో ఇదే తరహా సమీక్షలు చేపట్టనున్నట్లు చెప్పారు.