అజహరుద్దీన్‌కు బంపర్ ఆఫర్...కేబినెట్‌లోకి మాజీ కెప్టెన్
posted on Oct 29, 2025 @ 3:58PM
ఎల్లుండి తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరగనుంది. కేబినెట్‌లోకి అజహరుద్దీన్ తీసుకోనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. నిన్న అజహరుద్దీన్ కుమారుడు అసదుద్దీన్ సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసేందుకు అజహరుద్దీన్ సిద్దంగా ఉండాలని ముఖ్యమంత్రి చెప్పినట్లు ఆయన అనుచరులు తెలిపారు.
కేబినెట్‌లో ఇంతవరకూ లేని మైనార్టీ మంత్రి లేకపోవడంతో ఆయనకు అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. ముందుగా అజారుద్దీన్‌కు ఎమ్మెల్సీ ఇచ్చి అనంతరం కేబినెట్‌లోకి తీసుకుంటారని వార్తాలు వచ్చాయి. జూబ్లీలో భారీగా ఉన్న మైనార్టీల ఓట్లు కాంగ్రెస్ పార్టీ వైపు తిప్పుకోవడానికి హస్తం పార్టీ ఫ్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ న్యూస్ కూడా చదవండి: రేవంత్ హస్తిన బాట.. డీసీసీ చీఫ్ ల ఎంపికతో పాటు.. కేబినెట్ రీషఫుల్ కూడా?
ఎల్లుండి శుక్రవారం ఉదయం 11 గంటలకు కేబినెట్‌ని విస్తరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అజారుద్దీన్‌కు హోం, మైనారిటీ శాఖ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏఐసీసీ ఆదేశాల మేరకు తెలంగాణ కేబినెట్‌ని విస్తరించడానికి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని టాక్.