అయోధ్య మసీదు డిజైన్ ఎలా ఉందంటే..?
posted on Dec 14, 2022 @ 10:34AM
వివాదాస్పద అయోధ్యరామజన్మ భూమి అంశం కోర్టులో పరిష్కారం అయిన తరువాత రామమందిర నిర్మాణం జోరందుకుంది. అలాగే కోర్టు సూచనల మేరకు అయోధ్యలోనే మసీదు నిర్మాణానికి వీలుగా ఐదు ఎకరాల స్థలాన్ని అయోధ్య సమీపంలోని లక్నో-ఫైజాబాద్ హైవే పక్కన, దన్నిపూర్ గ్రామంలో సున్నీ వక్ఫ్ బోర్డుకు కేటాయింపు కూడా జరిగింది. ఆ ప్రదేశంలో మసీదు నిర్మాణం కానుంది. ఇందుకు సంబంధించిన డిజైన్ కూడా రెడీ అయ్యింది.
అయోధ్య డెవలప్ మెంట్ అథారిటీ నుంచి మసీదు నిర్మాణానికి అనుమతి వచ్చింది. ఇక మసీదు నిర్మాణం కూడా జోరందుకుంటుంది. అయితే ఆ స్థలంలో కేవలం మసీదే కాకుండా 200 పడకల హాస్పిటల్ కూడా నిర్మిస్తామని ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ సెక్రటరీ ఆథర్ హుస్సేన్ తెలిపారు. ఇందు కోసం మొదటి దశలో రూ.100 కోట్లు, రెండో దశలో రూ.100 కోట్లు మొత్తం 200 కోట్ల రూపాయలు వెచ్చిస్తామని వివరించారు.
తాజాగా అయోధ్యలో నిర్మించనున్న మసీదు డిజైన్ ను విడుదల చేశారు. మసీదు ఎలా డబోతోందో ఊహా చిత్రాన్ని కూడా విడుదల చేశారు. దీనిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చేసేందుకే మసీదు డిజైన్ అద్భుతంగా ఉందనీ, నిర్మాణం పూర్తయితే మరింత బ్రహ్మాండంగా ఉంటుందని అంటున్నారు.