అయోధ్య ప్రారంభోత్సవానికి చంద్రబాబుకు ఆహ్వానం
posted on Jan 17, 2024 @ 3:43PM
ఈ నెల 22న జరగనున్న అయోధ్య ప్రారంభోత్సవానికి సంబంధించిన కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. దాదాపు ఆరువేల మంది అతిథుల నడుమ ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరగనుంది. తెలుగు రాష్ట్రాల నుంచి మెగాస్టార్ చిరంజీవి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సహా పలువురు ప్రముఖులకు ఇప్పటికే ఆహ్వానాలు అందాయి. తాజాగా చంద్రబాబుకు కూడా ఆహ్వానపత్రిక అందింది.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరవుతున్నారు. 22న జరగనున్న రామయ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి రావాలంటూ శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నుంచి ఆయనకు ఆహ్వానం అందింది.
22న జరిగే ప్రాణ ప్రతిష్ట పూజా కార్యక్రమం నిర్వహణ మొత్తం లక్ష్మీకాంత్ దీక్షితులు నిర్వహించనున్నారు. ఇక సౌత్ నుంచి చిరంజీవి, రామ్ చరణ్, రజినీకాంత్, మోహన్లాల్, ధనుష్, కాంతారా స్టార్ రిషబ్ శెట్టి, ప్రొడ్యూసర్ మహావీర్ జైన్ లకు అయోధ్య ఆహ్వానం అందించారు.
అయోధ్య శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట వేడుకకు ఇండియన్ స్టార్ బ్యాట్‌మెన్స్ విరాట్ కోహ్లీకి ఆహ్వానం అందింది. ఈనెల 22న అయోధ్యలో జరిగే శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు పలువురు దిగ్గజాలకు ఆహ్వానాలు అందిస్తున్న విషయం తెలిసిందే. అయోధ్యకు ఆహ్వానం అందుకున్న వారిలో రాజకీయ నాయకుల నుంచి మొదలుపెట్టి సినిమా తారలు క్రికెటర్లు స్పోర్ట్స్ పర్సనాలిటీలు వరకు ఈ ఆహ్వానాన్ని అందజేస్తున్నారు. రామ మందిర ప్రతిష్టాపన వేడుకలకు ఆహ్వానం అందుకున్న క్రికెటర్లలో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి , ఎంఎస్ ధోని ఉన్నారు. ఆర్ఎస్ఎస్ లీడర్ ధనుంజయ సింగ్ చేతుల మీదుగా స్పోర్ట్స్ స్టార్ లకు అయోధ్య ఆహ్వానాన్ని అందించారు. రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తరపున ఈ ఆహ్వానాలను ప్రముఖులకు అందిస్తున్నారు.అయోధ్యలో ఈ నెల 22న జరిగే రామమందిర ప్రారంభోత్సవం, విగ్రహాల ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి దేశవ్యాప్తంగా దాదాపు 7 వేల మంది వరకూ ఆహ్వానాలు వెళ్లాయి. వీరిలో ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులతో పాటు పలువురు సెలబ్రిటీలు, ఇతరులు ఉన్నారు. ఇదే క్రమంలో ఆలయ ట్రస్టు నుంచి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు మల్లిఖార్జున ఖర్గే, సోనియాగాంధీ, అధిర్ రంజన్ చౌదరికి కూడా ఆహ్వానాలు వెళ్లాయి. అయితే కాంగ్రెస్ పార్టీ వీటిపై కీలక నిర్ణయం తీసుకుంది. అయోధ్యలో జరిగే రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కాకూడదని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు ఆలయ ట్రస్టు పంపిన ఆహ్వానాన్ని తిరస్కరిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది.