బద్రీనాథ్ హైవేపై మంచు చెరియలు విరిగిపడి 47 మంది గల్లంతు
posted on Feb 28, 2025 @ 2:50PM
ఉత్తరాఖండ్ లో ఘోరం సంభవించింది. బదరీనాథ్, చమోలీ హైవేపై మంచు చెరియలు విరిగిపడ్డారు. ఈ ఘటనలో అక్కడ రోడ్డు నిర్మాణ పనిలో నిమగ్నమై ఉన్న 47 మంది సజీవ సమాధి అయ్యారు. ఆ ప్రదేశంలో మొత్తం 57 మంది పని చేస్తుండగా వారిల పది మంది సురక్షితంగా బయటపడ్డారు. మిగిలిన 47 మంది జాడ తెలియరాలేదు. ఎస్ఆర్డీఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో భారీగా మంచుకురుస్తోంది. దీంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది.
చమోలి-బద్రినాథ్ హైవేపై గ్లేసియర్ (హిమానీనదం) బరస్ట్ అయింది. దీంతో 57 మంది రోడ్డు నిర్మాణ కార్మికులు మంచులో కూరుకుపోయారు. వారిలో 10 మందిని రక్షించగా, 47 మంది ఆచూకీ దొరకలేదు. సహాయక చర్యల కోసం SDRF, NDRF బృందాలు రంగంలోకి దిగాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కొన్ని రోజులుగా అక్కడ భారీగా మంచు కురుస్తోంది.