సీఐ మూతి పగలగొట్టిన మందుబాబులు! చర్యలకు ఖాకీలు వెనకడుగు?
posted on Aug 9, 2021 @ 11:17AM
ఖాకీ డ్రెస్ వేసుకుంటే అదో పవర్. వెయ్యి ఏనుగులంత బలం. తమకు ఎదురు లేదనే ధైర్యం. ఎదుటివారిని లెక్కచేయని టెంపర్. అంత పవర్‌ఫుల్ పోలీస్‌నే మూతి పగిలేలా కొట్టారంటే మాటలా? కొట్టడమే తప్ప.. కొట్టించుకునే అలవాటు లేని కాప్స్.. ఇంత పెద్ద విషయాన్ని ఊరికే వదిలేస్తారా? అంటే, వదిలేశారు మరి. మామూలుగా అయితే ఇలాంటి సీన్లలో పోలీసులను కొట్టినోళ్ల తాట తీస్తారు. కేసులు పెట్టి.. స్టేషన్లో వేసి.. సీసీకెమెరాలు ఆఫ్ చేసి.. లాఠీలతో కుమ్మేస్తారు. రోకలిబండ ఎక్కిస్తారు. అని అంటుంటారు. కానీ, ఈ కేసులో మాత్రం అలా జరగలేదు. ఏకంగా సర్కిల్ ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారి పెదవులు పగిలేలా ముఖంపై కొట్టిన వారిపై ఎలాంటి కేసులు నమోదు చేయలేదని అంటున్నారు. వారిని అదుపులోకి తీసుకోవడం కానీ, వారిపై రకరకాల కేసులు పెట్టడం కానీ చేయలేదు. చివరాఖరికి అసలు ఆ విషయమే జరగనట్టు.. తమ సీఐని ఎవరూ కొట్టలేదన్నట్టు.. మేటర్‌ను చాలా సీక్రెట్‌గా మెయిన్‌టెన్ చేస్తున్నారు. మీడియా ఉందికదా.. అందుకే విషయం ఆఫ్‌ది రికార్డ్ చక్కర్లు కొడుతోంది. ఇంతకీ సీఐని కొట్టినోళ్లపై చర్యలెందుకు తీసుకోవడం లేదంటే.....
శుక్రవారం. అర్థరాత్రి. మాదాపూర్‌లోని ఓ ప్రాంతం. వీకెండ్ కదా.. అందుకే పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్నారు. అంతలోనే ఓ రేంజ్ రోవర్ కారు అటువైపుగా వేగంగా దూసుకొచ్చింది. పోలీసులు ఆ కారును ఆపే ప్రయత్నం చేశారు. అందులో వారు సడెన్ బ్రేక్ వేసి.. కారును రివర్స్‌లో వెనక్కి తీసుకెళ్లేందుకు ట్రై చేశారు. అసలే సైబరాబాద్ పోలీసులు కదా.. డ్రంకెన్ డ్రైవ్‌లో ఫుల్ ఎక్స్‌పర్ట్స్. అందుకే ఆ రేంజ్ రోవర్ కారు పప్పులేమీ ఉడకలేదు. రివర్స్‌లో వెళ్తున్న కారుకు పోలీస్ వెహికిల్స్ అడ్డుపెట్టి మరీ ఆపేశారు. కారులో ఉన్న ఇద్దరికి బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయబోయారు. అందుకు వారు నిరాకరించారు. ఒక్కసారిగా పోలీసులపై రెచ్చిపోయారు. మమ్మల్నే ఆపుతారా? మేము ఎవరమో తెలుసా? మీరెంత మీ చదువులెంత? ఒక్క ఫోన్ చేస్తే మీ బతుకులు బజారున పడతాయంటూ ఓవరాక్షన్ చేశారు. అక్కడితో ఆగలేదు ఆ మందుబాబులు. మరింత రెచ్చిపోయారు. పోలీసులపైనే అటాక్ చేశారు. డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్‌ను కొట్టారు. ముఖంపై పిడిగుద్దులు గుద్దటంతో సీఐకి గాయాలయ్యాయట. పెదాలు పగిలాయని అంటున్నారు.
విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా తనపై దాడికి పాల్పడిన ఇద్దరిపై బాధిత ఇన్‌స్పెక్టర్.. మాదాపూర్ ఠాణాలో ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. అయితే.. ఈ కేసుపై పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకోవడం లేదు. సీఐని కొట్టినా నిందితులపై వదిలేశారని తెలుస్తోంది. ఓ సీఐపై దాడి జరిగితే ఎందుకు స్పందించడం లేదు? పెదవులు పగిలేలా కొట్టినా ఎందుకు సీక్రెట్‌గా ఉంచుతున్నారు?
సీఐని కొట్టిన వారిలో ఒకరు సివిల్ కాంట్రాక్టర్ కాగా మరొకరు వైద్యుడు. ఈ ఇద్దరిలో ఒకరు పోలీస్ శాఖలో పనిచేసే సీనియర్ అధికారికి బంధువని అంటున్నారు. ఆ బాస్ ఫోన్ చేయడం వల్లే.. ఆ ఇద్దరు ఓవరాక్షన్ గాళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని తెలుస్తోంది. పైనుంచి ఆదేశాల మేరకే.. విషయాన్ని సీక్రెట్‌గా ఉంచారు. అసలు కేసు నమోదయిందా లేదా? నిందితులను అరెస్ట్ చేశారా, లేదా? అనే వివరాలు కూడా చెప్పడం లేదు పోలీసులు. సీఐనే మూతిపగిలేలా కొట్టిన మందుబాబుల తాట తీయాల్సింది పోయి.. ఇలా ఉన్నతాధికారులకు చుట్టమనే కారణంతో వదిలేయడం దారుణం అంటున్నారు.