బాలికపై దొంగ బాబా అత్యాచారం..
posted on Jun 23, 2021 8:58AM
భారత దేశంలోప్రాణాలు పొసే డాక్టర్స్
కంటే.. ప్రజా సంక్షేమం కోసం ఏదైనా కనుకునే సైన్ టిస్ట్ కంటే బాబాలను నమ్ముతారు. వీరి దగ్గర ఉన్నది వారికి సమర్పించుకోవడంలో ఏ మాత్రం వెనకాడరు చాలా మంది ప్రజలు. అలాగే ప్రజల అమాయకత్వాన్ని, మరికొందరి బలహీనతలను ఆధారంగా చేసుకుని బాబాలు కూడా భక్తి ముసుగులో, దేవుడి పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారు. అక్కడితో ఆగక కాషాయం కట్టి, సన్యాసి అవతారం ఎత్తి చివరికి ఆడవాళ్లపై కూడా దారుణాలకు పాలుపడుతున్నారు దొంగ బాబాలు. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. బాబా ముసుగులో ఓ దుర్మార్గుడు .. మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. నేరడిగొండ మండలం రాజూరలో జరిగిన ఈ ఘటన సంచలనం రేపింది.
జిల్లాలోని నేరడిగొండ మండలం రాజూర సమీపంలో కొండపై శివాలయం ఉంది. అక్కడే కొండపై ఏడేళ్ల నుంచి ఆత్మారాం మహరాజ్ పేరు చెప్పుకుంటూ ఓ దొంగ బాబా నివాసముంటున్నాడు. అప్పటికే భక్తి బోరు కొట్టిన బాబా.. ఇదే క్రమంలో అదే గ్రామంలో ఉంటున్న ఓ మైనర్ బాలికపై కన్నేసిన ఆ దుర్మార్గుడు.. పదును చూసి కరెంట్ షాక్ కొట్టినట్లు, దొంగ బాబా అదును చూసి, ఆ అమ్మాయిని కాటు వాయలనుకున్నడు. చివరికి ఆ అమ్మాయి పై కోరిక తీర్చుకున్నాడు. ఆ తరువాత బండారం బయటి పడింది. పోలీసులు రంగంలోకి దిగి బాబా భరతం పట్టే పనిలో పడ్డారు. అలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనపై దర్యాప్తు వేగవంతం చేశారు.
బాబాను దేవుడిగా భావించింది ఆ అమాయకపు బాలిక. ఈ క్రమంలోనే బాబాకు పూజలు చేసి పండ్లు ఇచ్చేందుకు రాజురా సమీప గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలిక వెళ్లింది. ఈనెల 16న రాత్రి 8 గంటలకు ఆత్మారాం మహరాజ్ వద్దకు వెళ్లి తిరిగిరాకపోవడంతో బాలిక తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. రాత్రంతా ఎదురుచూసి ఉదయం వెళ్లి చూడటంతో ఆత్మారాం ఆలయంలో స్పహ కోల్పోయి కనిపించింది. ఆమెను చూసిన తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడంతో బాబా అసలు బండారం బయటపడింది.
కాగా, జరిగిన వ్యవహారానికి సంబంధించి బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మరాం మహరాజ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.