ఎట్టకేలకు ముంబైకి ఒక గెలుపు!
posted on Apr 8, 2024 @ 10:15AM
ఐదు సార్లు ఐపీఎల్ విజేత ముంబై ఇండియన్స్ కు 2024 ఐపీఎల్ సీజన్ లో ఏవీ కలిసి రాలేదు. జట్టు కెప్టెన్సీ మార్పును ఆ జట్లు సభ్యులే కాదు, అభిమానులు సైతం హర్షించలేదు. దానికి తోడు కొత్త కెప్టెట్ ఆటిట్యూడ్ జట్లులోని సీనియర్ సభ్యులను చికాకు పెడుతూ వచ్చింది. దీంతో కొత్త కెప్టెన్ హార్ధిక్ పాండ్యాకు సర్వత్రా విమర్శలు తప్పలేదు. అయితే నెమ్మదిగా ఆ ఇబ్బందుల నుంచి కెప్టెన్, జట్టు బయటపడుతున్నాయి.
ఢిల్లీ కెపిటల్స్ తో ఆదివారం జరిగిన మ్యాచ్ లో ముంబై ఈ సీజన్ లో తొలి విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి 234 పరుగులు సాధించి ప్రత్యర్థి ఢిల్లీ కెపిటల్స్ కు భారీ లక్ష్యిన్ని నిర్దేశించింది. ముఖ్యంగా 20వ ఓవర్ లో ముంబై బ్యాటర్ రొమారియో షెఫర్డ్ ఏకంగా 32 పరుగులు రాబట్టడం మ్యాచ్ కే హైలైట్ గా నిలిచింది. 235 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 205 పరుగులు మాత్రమే సాధించి పరాజయం పాలైంది.
తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ కు ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ శుభారంభం ఇచ్చారు. దీంతో పవర్‌ప్లే ముగిసే ముంబై వికెట్ నష్టపోకుండా 75 పరుగులు చేసింది. అ27 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 49 పరుగులు చేసిన రోహిత్ శర్మను అక్షర్ పటేల్ ఔట్ చేయడంతో ముంబై 80 పరుగుల వద్ద ముంబై తొలి వికెట్ కోల్పోయింది. ఆ తరువాత బ్యాటింగ్ కు వచ్చిన సూర్యకుమార్ యాదవ్ యాదవ్ రెండో బంతికే డక్ అవుటై నిరాశ పరిచాడు. ఆ తరువాత ఇచ్చి 42 పరుగులు చేసిన ఇషాన్ ఔటయ్యాడు. ఆ వెంటనే తిలక్ వర్మ కూడా ఔటవ్వడంతో ముంబై కష్టాల్లో పడింది. కేప్టెన్ హార్ధిక్ పాండ్యా 39 పరుగులు చేసి అవుటయ్యాడు. టిమ్ డేవిడ్ 21 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సులతో 45, షెపర్డ్ కేవలం 10 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సులతో 39 పరుగులు చేయడంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది.
235 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ పృథ్వీ షా, అభిషేక్ పోరెల్.. స్టబ్స్ పోరాడినా ఢిల్లీకి ఓటమి తప్పలేదు. ఫామ్‌లోకి వచ్చిన పృథ్వీ షా 40 బంతుల్లో 8 ఫోర్లు, మూడు సిక్సర్లతో 66 పరుగులు చేసి లక్ష్య ఛేదనలో మంచి ఆరంభాన్ని ఇచ్చాడు.