చావును దగ్గర నుంచి చూసిన ఆశారాం బాపు
posted on Aug 30, 2012 @ 11:36AM
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపు, ఆయనతో పాటు మరో నలుగురు శిష్యులు హెలికాప్టర్ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయట పడ్డారు. గుజరాత్‌లోని గోధ్రాలో రెండు రోజుల పాటు సత్సంగ్‌లో ప్రవచనాలు వినిపించేందుకు ఆశారాం బాపు, ఆయన శిష్యులు బయలు దేరి వెళ్లారు. గోధ్రాలోని సైన్స్ కళాశాలలో హెలికాప్టర్ ల్యాండింగ్ కావాల్సి వుండగా, కొద్దిసేపు ముందు అందులో సాంకేతిక లోపం రావటంతో హెలికాప్టర్ పైన నుంచి కిందపడి౦ది. కింద పడిన హెలికాప్టర్ ఒక పక్కకు ఒరిగి మూడు ముక్కలైంది. ఆయితే హెలికాప్టర్ కొద్ది ఎత్తులో నుంచి పడిపోవడంతో ఆసారం బాపు ప్రాణాలతో బయటపడ్డారు. హెలికాప్టర్ అద్దాలు పగులగొట్టి పైలట్, బాపులను బయటకు తీసి వెంటనే వారిని సమీపంలో ఉన్న ఆశ్రమ్ ఆస్పత్రికి తరలించారు.