నవంబర్ 26న పార్టీ పేరు ప్రకటిస్తా: కేజ్రీవాల్
posted on Oct 2, 2012 @ 3:23PM
కొత్తగా పెట్టబోయే పార్టీ పేరును నవంబర్ 26న ప్రకటిస్తామని అవినీతి ఉద్యమ కారుడు అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జన్లోక్పాల్ ఉద్యమంలో మరో పోరాటమే రాజకీయ పార్టీ స్థాపన అని అన్నారు. రాజకీయ విప్లవంతోనే జన్లోక్పాల్ సాధ్యమవుతుందని కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. స్వరాజ్యం కోసం సంకల్పం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. 13 అంశాలతో పార్టీ ఎందుకు పెడుతున్నామో ప్రచారం చేస్తామని, 'స్వరాజ్ పార్టీనా', లేక 'లోక్పాల్ పార్టీ' పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.