ఎన్నారై హాస్పిటల్ కు అచ్చెన్నాయుడు తరలింపు..
posted on Aug 18, 2020 9:25AM
ఈఎస్ఐ స్కామ్ కేసులో అరెస్టయిన మాజీ మంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడిని మంగళగిరిలోని ఎన్నారై ఆస్పత్రికి తరలించనున్నారు. ప్రస్తుతం అయన గుంటూరులోని రమేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. కొద్దీ రోజుల క్రితం అచ్చెన్నాయుడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో పోలీసులు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో అచ్చెన్నాయుడు తరఫు న్యాయవాదుల సూచన మేరకు ఎన్నారై ఆస్పత్రికి తరలించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తూ అచ్చెన్నాయుడికి ప్రత్యేకమైన గదిలో ఉంచి చికిత్స అందించాలని సూచించింది.
ఈఎస్ఐ కుంభకోణం కేసులో అచ్చెన్నాయుడిని ఎసిబీ అధికారులు జూన్ 12వ తేదీన అరెస్టు చేశారు. ఆయనను అరెస్టు చేసిన తర్వాత ఆయనకు గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో పైల్స్ కు సంబధించిన సమస్యకు చికిత్స అందించారు. ఆ తర్వాత అచ్చెన్నాయుడి వేసిన పిటిషన్ పై విచారించిన హైకోర్టు ఆయనను రమేష్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం పంపించాలని ఆదేశించింది. అప్పటి నుంచి ఆయన రమేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.