సీమాంధ్ర ఎంపీటీసీ ఫలితాలు: టిడిపి ప్రభంజనం
posted on May 14, 2014 @ 10:52AM
స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాలను బట్టి సీమాంధ్రలో టీడీపీ పార్టీ ముందంజలో ఉంది. సైకిల్ జోరుకు హస్తం పార్టీ, వైకాపా విలవిల లాడాయి. సీమాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, చిత్తూరు, అనంతపురం జిల్లా పరిషత్తులను తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. తెలుగుదేశం పార్టీ కౌంటింగ్ ప్రారంభమైంది మొదలు తొలి రౌండ్ నుండే దూసుకు పోయింది. సీమాంధ్ర జిల్లాల వారీగా బుదవారం ఉదయం 10:30నిమిషాలకి వివిధ పార్టీలు గెలుచుకున్న ఎంపీటీసీ స్థానాలు ఇలా వున్నాయి.
1. శ్రీకాకుళం: కాంగ్రెస్ (7), తెలుగుదేశం (362), వైసీపీ (270), ఇతరులు (36)
2. విజయనగరం: కాంగ్రెస్ (40), తెలుగుదేశం (245), వైకాపా (155), ఇతరులు (20)
3. విశాఖపట్నం: కాంగ్రెస్ (11), తెలుగుదేశం (324), వైకాపా (241), ఇతరులు (49)
4. తూర్పు గోదావరి: కాంగ్రెస్ (2), తెలుగుదేశం (516), వైకాపా (3030, ఇతరులు (52)
5. పశ్చిమ గోదావరి: కాంగ్రెస్ (2), తెలుగుదేశం (587), వైకాపా (237), ఇతరులు (65)
6. కృష్ణ: కాంగ్రెస్ (2), తెలుగుదేశం (458), వైకాపా (324), ఇతరులు (31)
7. గుంటూరు: కాంగ్రెస్ (4), తెలుగుదేశం (469), వైకాపా (409), ఇతరులు (39)
8. ప్రకాశం: కాంగ్రెస్ (0), తెలుగుదేశం (358), వైకాపా (386), ఇతరులు (39)
9. నెల్లూరు: కాంగ్రెస్ (15), తెలుగుదేశం (228), వైకాపా (306), ఇతరులు (34)
10. చిత్తూరు: కాంగ్రెస్ (3), తెలుగుదేశం (431), వైకాపా (333), ఇతరులు (36)
11. కడప: కాంగ్రెస్ (9), తెలుగుదేశం (194), వైకాపా (348), ఇతరులు (8)
12. కర్నూలు: కాంగ్రెస్ (41), తెలుగుదేశం (339), వైకాపా (390), ఇతరులు (45)
13. అనంతపురం: కాంగ్రెస్ (3), తెలుగుదేశం (506), వైకాపా (275), ఇతరులు (13)
మొత్తం స్థానాలు: కాంగ్రెస్: 139, తెలుగుదేశం: 5017, వైకాపా: 3977, ఇతరులు: 459