ప్రతిష్టాత్మక స్పెషల్ విజిట్స్ ప్రోగ్రాంకు మంత్రి లోకేష్ కు ఆహ్వానం
posted on Aug 31, 2025 @ 3:46PM
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ కు అత్యంత అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం నుంచి మంత్రిలోకేష్ కు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్ లో పాల్గొనాలంటై ఆహ్వానం అందింది. ఈ మేరకు ఆస్ట్రేలియా హైకమిషనర్ ఆహ్వానాన్ని పంపారు.
ఆంధ్రప్రదేశ్ లో విద్యారంగంలో సంస్కరణల ద్వారా ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కు శ్రీకారం చుట్టిన మంత్రి లోకేష్ కు సర్వత్రా ప్రశంసలు లభిస్తున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే మానవ వనరులు, సాంకేతిక, ఆర్థికాభివృద్ధి రంగాల్లో లోకేష్ చేస్తున్న కృషిని ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రశంసిస్తూ.. స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్ లో భాగస్వామ్యం కావాలని మంత్రి నారా లోకేశ్ ను కోరింది.
ఈ ప్రతిష్ఠాత్మక స్పెషల్ విజిట్స్ లో ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 2001లో పాల్గొన్నారు. లోకేష్ కు స్పెషల్ విజిట్స్ ప్రోగ్రాంలో భాగస్వామి కావడం ద్వారా ఆస్ట్రేలియాలోని కీలక రాజకీయ నేతలు, విద్యారంగ నిపుణులు, వ్యాపారవేత్తలు, ప్రవాస భారతీయులతో సమావేశమై ఏపీ అభివృద్ధి ప్రాధాన్యతలైనా, విద్యా, స్కిల్ డెవలప్ మెంట్, ఇన్వెస్ట్ మెంట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంశాలపై చర్చించేందుకు దోహదపడుతుంది.