జగన్‌తో తేల్చుకుంటాం.. పీఆర్సీపై ఉద్యోగుల ఫైట్..
posted on Dec 16, 2021 @ 1:50PM
పీఆర్సీ పూర్తి నివేదిక ఉద్యోగులకు ఇవ్వాలని అమరావతి జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. 11వ పీఆర్సీ కమిషన్ నివేదికను ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. అధికారులతో కమిటీ వేసి.. సర్కారుకు నచ్చినట్టు నివేదిక ఇచ్చారని మండిపడ్డారు. 14.39 పిట్‌మెంట్‌కు ఉద్యోగులు వ్యతిరేకమన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు హెచ్‌ఆర్ఏ, డీఏ ఇవ్వాలని.. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. పిట్‌మెంట్‌పై సీఎం జగన్ దగ్గర తేల్చుకుంటామని బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు.
50 శాతం పిట్‌మెంట్ అడుగుతున్నామని.. ఉద్యోగుల కనీస వేతనం రూ. 23 వేలు ఉండాలని ఏపీ జేఏసీ అధ్యక్షుడు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. గ్రాట్యుటీ 23 లక్షలకు పెంచాలన్నారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల మూల వేతనం పెంచాలన్నారు. డిమాండ్లపై సరైన స్పందన ఉంటేనే ప్రభుత్వంతో చర్చిస్తామని శ్రీనివాసరావు తెలిపారు. విజయవాడ ధర్నా చౌక్‌లో ఉద్యోగ సంఘాల జేఏసీ ధర్నా చేపట్టింది.