5వేల కోట్లివ్వండి...అప్పులు తీర్చుకుంటాం..
posted on Jul 16, 2015 @ 12:31PM
రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్ధికంగా చాలా నష్టం చాలా నష్టం జరిగిందన్నది తెలిసిందే. ఉన్నకష్టాల్లోనే ఎలాగొలా అప్పులుతెచ్చి ప్రభుత్వాన్ని నడిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ఆర్జీ పెట్టుకుంది. రాష్ట్ర విభజన వల్ల ఏపీ అప్పులపాలైపోయింది.. అప్పులు తీరాలంటే ఇప్పటికి ఇప్పుడు 5 వేల కోట్లు అవసరం.. తక్షణమే ఆ మొత్తాన్ని విడుదల చేసి ఆదుకోండి అంటూ కేంద్రానికి ఆర్జీ పెట్టింది. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తాం.. స్పెషల్ ప్యాకేజీలు ఇస్తాం.. రాష్ట అభివృద్ధికి చేయూతనిస్తాం అని తెలిపిన కేంద్ర ప్రభత్వం ఇప్పుడు చూసి చూడనట్టు వ్యవహరిస్తుంది. ఏపీకీ ఉన్న ఆర్ధిక లోటు గురించి ప్రభుత్వం పలుమార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయింది. అయితే ఏపీ ప్రభుత్వం గతేడాదే రెవెన్యూ లోటు, కేంద్ర ప్రాయోజిత పథకాలు, ప్రత్యేక ప్యాకేజీ, సీఎస్టీ బకాయిలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 24,500 కోట్లు ఇవ్వాల్సిందిగా కేంద్రాన్ని కోరింది కానీ కేంద్రం మాత్రం .. కేవలం రూ.350 కోట్లు మాత్రమే ఇచ్చి కేంద్రం చేతులు దులుపుకొంది. అప్పటి నుండి 350 కోట్లు మినహా ఒక్క పైసా కూడా కేంద్రం ఇవ్వలేదు. మరోవైపు కాగ్ నివేదిక వచ్చిన తరువాత ఆంధ్రప్రదేశ్ కు ఉన్న రెవెన్యూలోటు ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని కేంద్రం చెప్పింది. అయితే ఏపీకి ఉన్న ఆర్ధికలోటు 17 వేల కోట్లు అని కాగ్ రెండు నెలలు క్రితమే నివేదికను ఇచ్చింది. కానీ కేంద్రం మాత్రం ఆవిషయంపై నోరు విప్పడంలేదు. దీంతో ఏపీ ప్రభుత్వం ఎలాగోలా అప్పులు తెచ్చి నెట్టుకొస్తుంది. అలా తెచ్చిన అప్పులే ఇప్పటికి 5వేల కోట్లు అయిపోయింది. దీంతో ఏపీ సర్కారు కేంద్రానికి రెవెన్యూ లోటు కింద 5 వేల కోట్లు ఇవ్వాలని.. అప్పులు తీర్చుకుంటామని కోరింది. కనీసం కేంద్రం కనుకు 5వేల కోట్లు మంజూరు చేసినట్టయితే కనీసం అప్పులు తీర్చి కాస్తంత ఒడ్డున పడొచ్చు అని భావిస్తున్నట్టు తెలుస్తోంది.