Read more!

ఏపీ సర్కార్ కునిధుల కొరత.. ఉద్యోగులకు వేతనాలు జాప్యం?

ఏపీలో డిసెంబర్  మొదటి తేదీకి ఉద్యోగులకు వేతనాలు అందడం దాదాపు అసాధ్యం అన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది.ఇందుకు ప్రభుత్వం సాంకేతిక కారణాలను చూపుతున్నా.. ఉద్యోగులు మాత్రం నిధుల కొరత కారణంగానే ప్రభుత్వం డిసెంబర్ మొదటి తేదీ నాటికి జీతాలు చెల్లించడం లేదని అంటున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం సీఎఫ్ఎంఎస్ సర్వర్ డౌన్ అయ్యిందని.. స్లోగా ఉందని అంటున్నారు.

ఈ  సమస్య సోమవారం నుంచీ ఉందని చెబుతున్నా ఇప్పటి వరకూ రెట్టిఫై చేయకపోవడమేమిటని ఉద్యోగులు అంటున్నారు. ప్రభుత్వం ఉద్దేశ  పూర్వకంగానే సాంకేతిక కారణాలు చూపుతోందని ఉద్యోగ  సంఘాలు అంటున్నాయి. డ్రాయింగ్ అండ్ డిస్పర మెంట్ అధికారులు జీతాల  బిల్లులు అప్ లోడ్ చేయడంలో కావాలనే జాప్యం చేస్తూ సాంకేతిక కారణాలను చూపుతున్నారని అంటున్నారు.

సబ్ ట్రెజరీ కార్యాలయాల నుంచి వేతనాల బిల్లులు ఈ నెల 30లోగా అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. దీంతో బుధవారం(నవంబర్ 30)నాటికి బిల్లులు  అప్ లోడ్ అవ్వడం అన్నది అనుమానంగా ఉంది.జీతాలూ పెన్షన్ల కోసం ప్రభుత్వానికి ప్రతి నెలా 5,500 కోట్ల రూపాయలు అవసరం అవుతుంది.