చంద్రబాబుకు ప్రధాని అపాయింట్‌మెంట్
posted on Aug 17, 2015 @ 5:47PM
భారత ప్రధాని నరేంద్రమోడీతో ప్రత్యేక సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి అపాయింట్‌మెంట్ ఖరారైంది. ఈనెల 20వ తేదీన సాయంత్రం 4 గంటలకు ప్రధానితో చంద్రబాబు భేటీ కానున్నారు. విభజన చట్టంలోని హామీల అమలుపై ప్రధానితో చంద్రబాబు చర్చించనున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో చంద్రబాబు నాయుడు పట్టుదలతో వున్నారు. ఈ విషయం మీద అన్ని వైపుల నుంచి వస్తున్న ఒత్తిడిని ఆయన ప్రధాని దృష్టికి తీసుకువెళ్ళే అవకాశం వుంది. ఈ భేటీ తర్వాత చంద్రబాబు నాయుడు ప్రధాని నుంచి ఏపీకి అవసరమైన వాటిని సాధించగలరన్న అభిప్రాయం రాజకీయ వర్గాలలో వ్యక్తమవుతోంది.