తెనాలిలో అన్నా క్యాంటిన్ కు నిప్పు
posted on Dec 19, 2022 5:37AM
మాచర్లలో వైసీపీ -టీడీపీ మధ్య చెలరేగిన ఘర్షణల విధ్వంస సెగలు చల్లారలేదు. మాచర్ల పట్టణం నివురుగప్పిన నిప్పులా ఉంది. శుక్రవారం (డిసెంబర్ 17).. నాటి ఘటనలు మాచర్లను అట్టుడికించిన సంగతి తెలిసిందే. ఆ ఘటన బాధితులు ఇంకా భయాందోళనల నుంచి తేరుకోనే లేదు. సాధారణ ప్రజలు సైతం ఎప్పుడేం జరుగుతుందో అని భయంతో వణికి పోతూనే ఉన్నారు. అయితే పోలీసులు మాచర్లలో భారీ బలగాలను మోహరించామని చెబుతూనే ఈ ఘటనలపై ఇప్పటి వరకు తమకు ఎవరూ ఫిర్యాదు చేయలేదంటున్నారు.
పల్నాడు ఘటనలో తెలుగుదేశం కార్యాలయంతో పాటు పార్టీ నేతల వాహనాలు ధ్వంసమయ్యాయి. వైసీపీ నేతలు నిప్పు పెట్టడంతో టీడీపీ కార్యాలయం కాలిపోయింది. టీడీపీ నేతలకు చెందిన 10కి పైగా వాహనాలు ధ్వంసం కాగా, 2 వాహనాలను దగ్ధం చేశారు. తెనాలి పరిస్థితి సద్దుమణగక ముందే గుంటూరు జిల్లా తెనాలిలో అన్న క్యాంటీన్ కు దుండగులు నిప్పు పెట్టారు. మార్కెట్ సెంటర్లో తెలుగుదేశం హయాంలో ఏర్పా టు చేసిన క్యాంటీన్ ను.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మూసివేసిన విషయం తెలిసిందే. ఈ క్యాంటీన్ కు అర్ధరాత్రి సమయంలో దుండగులు నిప్పు పెట్టారు.
క్యాంటీన్ తలుపు వద్దే ఈ నిప్పు పెట్టగా.. మంటలు చెలరేగటం గమనించి స్థానికులు మంటలను అర్పి వేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. అదే సమయంలో సంఘటన స్థలానికి వచ్చి న టీడీపీ శ్రేణులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు దురుసుగా ప్రవర్తించారని టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్య క్తం చేశారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో అన్న క్యాంటీన్ కు నిప్పు పెట్టటం వెనుక ఉన్నది వైసీపీ హస్తమేనని తెలుగుదేశం శ్రేణులు ఆరోపిస్తున్నాయి. విధ్వంసం, దహనకాండలతో వైసీపీ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోందని ఆరోపిస్తున్నారు.