ఏపీ కేబినెట్ భేటీ వాయిదా.. కారణమేంటంటే?
posted on Feb 19, 2025 @ 2:32PM
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ వాయిదా పడింది. ముందుగా ప్రకటించిన మేరకు గురువారం (ఫిబ్రవరి 20)న ఏపీ కేబినెట్ భేటీ జరగాల్సి ఉంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ముందు జరగాల్సిన ఈ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. అయితే అనూహ్యంగా కేబినెట్ భేటీ వాయిదా పడటంతో ఇందుకు కారణమేంటా అన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది.
అయితే ఈ భేటీకి అధ్యక్షత వహించాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన కారణంగా కేబినెట్ భేటీ వాయిదా పడింది. గురువారం (ఫిబ్రవరి 20) న ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమానికి చంద్రబాబు హాజరు కానున్నారు. దీంతో అనివార్యంగా ఏపీ కేబినెట్ భేటీ వాయిదా పడింది.