ఈ బుడతడు ఆనంద్ మహీంద్రా కు ఇన్స్పిరేషన్ అట..
posted on Aug 14, 2020 @ 5:12PM
నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా తనకు నచ్చిన లేదా తనను ఇన్స్పైర్ చేసిన అంశాల పై తరచుగా స్పందిస్తూ ఉంటారు. ఆ అంశాలను తనను ఫాలో అవుతున్న లక్షలాది మండి ఫాలోవర్స్ తో పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఆయన ఓ బాలుడు భారత జాతీయగీతం పాడుతున్న వీడియోను తన ట్విట్టర్ లో షేర్ చేసారు.
ఈ వీడియోను తాను కొన్ని సంవత్సరాల క్రితం చూశానని అప్పటినుంచి ప్రతి సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవం ముందు ఆ వీడియో చూస్తుంటానని అయన వెల్లడించారు. ఆ బాలుడు ఎంతో అమాయకంగా, ఎంతో ఏకాగ్రతతో జనగణమన పాడిన తీరు తనను విపరీతంగా ఆకట్టుకుందని అయన ఈ సందర్బంగా వివరించారు.ఈ వీడియో ఎప్పుడు చూసినా తనకు ఎంతో స్ఫూర్తి కలిగిస్తుందని ఆనంద్ మహీంద్రా ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. అంతేకాకుండా అపుడు ఆ పిల్లవాడు కొంచెం పెద్దవాడై ఉంటాడని, ఒకవేళ అతడు ఇప్పుడు పాడితే మరింత విభిన్నంగా పాడతాడేమో అని పేర్కొన్నారు.