ప్రాణ్ కు అమితాబ్ శుభాకాంక్షలు

 

బాలీవుడ్ నటుడు ప్రాణ్ కు 2012 సంవత్సరానికి గాను భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే ఎన్నిక చేసింది. ఎన్నో బాలీవుడ్ చిత్రాలలో కలిసి నటించిన బిగ్ బి అమితాబ్ ప్రాణ్ కు శుభాభినందనలు తెలిపాడు. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ లో అమితాబ్, ప్రాణ్ గురించి ఈ విధంగా పేర్కొన్నాడు. "ప్రాణ్ మంచి నటుడు, భారతీయ సినిమా ప్రపంచానికి అతను ఒక మూలస్తంభం వంటి వాడు, అతనికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు రావడం నాకు చాలా సంతోషంగా వుంది''. మరొక సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ లోనూ ఈ విధంగా పోస్టింగ్ చేశాడు. "ప్రాణ్ ఈ అవార్డుకు అర్హుడు. తనకు ఆప్తమిత్రుడు, వ్యక్తిత్వంగల వ్యక్తి అని, అతను ఆరోగ్యంగా ఉండాలని మనఃస్ఫూర్తిగా కోరుకుంటున్నానని, అతనిఇకి తన శుభాకాంక్షలు'' అని రాశాడు. అమితాబ్, ప్రాణ్ కలిసి నటించిన చిత్రాలలో జంజీర్, డాన్ మరపురాని చిత్రాలు

Teluguone gnews banner

DGP Shivdhar Reddy

ఏఎస్ఐ పై దాడికి పాల్పడ్డ గంజాయి బ్యాచ్

  నగరంలో రోజు రోజుకీ గంజాయి బ్యాచ్ లు రెచ్చిపో తున్నాయి. యువ కులు గంజాయి సేవించి ఆ మత్తులో తూగుతూ ఇతరు లపై దాడి చేస్తూ రోడ్డు మీద నానా హంగామా చేస్తున్నారు... ఈ గంజాయి బ్యాచ్ రోడ్డు మీద చేసే గొడవ వల్ల వాహ నదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు తాజాగా బండ్లగూడ పరిధిలో గంజాయి బ్యాచ్ నడిరోడ్డు మీద చేసిన హంగామా వల్ల అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇద్దరు యువకులు గంజాయి సేవించి ఆ మత్తులో తూలుతూ బండ్ల గూడ పరిధిలోని చాంద్రాయణ గుట్ట వద్ద ఉన్న ఏఎస్ఐ తో గొడవపడ్డారు. అంతటితో ఆగ కుండా ఏ ఎస్ ఐ చొక్కా పట్టుకొని నన్ను మీరు ఏమీ చెయ్యలేరు రా అంటూ రెచ్చిపోతూ అతనిపై దాడి చేశారు... దీంతో ఆగ్రహం చెందిన ఏఎస్ఐ గంజాయి మత్తులో ఉన్న ఇద్దరిని కొట్టాడు.  మమ్మల్ని కొడతావా అంటూ ఏ ఎస్ ఐ పై దాడి చేశారు. దీంతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకు న్నారు. ఈ దాడుల్లో గంజాయి మత్తులో ఉన్న యువకులకు గాయాలయ్యాయి. ఈ ఘటన స్థానికం గా హంగామా రేగ డం తో స్థానికులు పోలీసులకు సమా చారాన్ని అందిం చారు. హుటా హుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాయా లైన యువకులకు నచ్చజెప్పి పోలీస్ వాహనం ఎక్కించేం దుకు విశ్వ ప్రయ త్నం చేశారు.. అదే సమయంలో యువ కులు పోలీసుల ట్యాబ్ ధ్వంసం చేశారు. గంజాయి మత్తులో ఉన్న ఆ యువ కులు పోలీస్ వాహనం ఎక్కేం దుకు ససేమిరా అంటూ పోలీసు లకు చుక్కలు చూపించారు..  పోలీసు వాహనం ఎక్కకుండా దాదాపు అరగంట పాటు ఆ యువ కులు  పోలీసులను నానా తిప్పలు పెట్టారు. అయినా కూడా పోలీసులు ఓపిగ్గా ఆ ఇద్దరు యువకులకు పోలీస్ వాహనంలో తీసుకువెళ్లి చికిత్స చేపించి అనంతరం పోలీస్ స్టేషన్ కి తరలించారు.

గాంధీ అనే పదం భారత దేశానికి పర్యాయ పదం : సీఎం రేవంత్

  మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దేశ సమగ్రత కోసం సద్భావన యాత్ర చేపట్టారని, ఆ స్ఫూర్తితోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. చార్మినార్ వద్ద జరిగిన రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర సంస్మరణ కార్యక్రమంలో ఆయన తెలిపారు. “మూడు తరాలుగా గాంధీ కుటుంబం దేశ సేవలో అంకితమై ఉంది. దేశం కోసం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలు ప్రాణత్యాగం చేశారు. భారతదేశానికి గాంధీ అనే పేరు పర్యాయ పదం” అని సీఎం రేవంత్ అన్నారు. సద్భావన అవార్డును సల్మాన్ ఖుర్షీద్‌కు అందజేసిన నిర్వాహకులను ఆయన అభినందించారు. “సల్మాన్ ఖుర్షీద్ కుటుంబానికి గాంధీ కుటుంబంతో మూడు తరాల అనుబంధం ఉంది. ఈ అవార్డు ఆయనకు దక్కడం మనందరికీ గర్వకారణం” అని పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ స్ఫూర్తితో యువతకు అధిక హక్కులు కల్పించిన విషయాన్ని గుర్తు చేస్తూ రేవంత్ రెడ్డి అన్నారు: “18 ఏళ్ల వయసులో ఓటు హక్కు కల్పించిన మహనీయుడు రాజీవ్ గాంధీ. ఇప్పుడు 21 ఏళ్లకే శాసనసభ్యుడిగా పోటీ చేసే అవకాశం కల్పించే రాజ్యాంగ సవరణ అవసరం ఉంది. అదే రాజీవ్ గాంధీ కల.” ఇక రాజకీయ అంశాలపై స్పందిస్తూ రేవంత్ రెడ్డి బీఆర్‌ఎస్‌పై విమర్శలు గుప్పించారు. “బీఆర్‌ఎస్ బీజేపీకి బీ టీమ్‌గా మారింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో రహస్య ఒప్పందంతో బీజేపీకి మద్దతిచ్చింది. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉపఎన్నికలోనూ అదే కుట్ర జరుగుతోంది.  వచ్చే ఎన్నికల్లో ఓట్లు చీల్చే ప్రయత్నాన్ని తెలంగాణ ప్రజలు తిప్పికొడతారు” అని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ సందర్బంగా సల్మాన్ ఖుర్షీద్‌ మాట్లాడుతు తనకు ఎంతో ప్రత్యేకమని తన జీవితంలో దీనికి మించిన అవార్డు మరొక్కటి లేదన్నారు. రాజీవ్ గాంధీ దేశాన్ని ఒక్కటిగా చేయడానికి ఈ యాత్ర చేశారని ఇప్పుడు రాహుల్ గాంధీ ఇదే బాటలో నడుస్తున్నారని ఖుర్షీద్‌ తెలిపారు.

పిఠాపురం వర్మ.. మంత్రి నారాయణ వివాదానికి ఎండ్ కార్డ్

మంత్రి నారాయణ, పిఠాపురం తెలుగుదేశం ఇన్ చార్జ్ వర్మ మధ్య వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. ఇటీవల ఒక కార్యక్రమంలో మంత్రి నారాయణ పిఠాపురంలో వర్మను జీరో చేసేశామని వ్యాఖ్యానించారంటూ, అందుకు సంబంధించిన ఆడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఆ ఆడియోపై స్పందించిన వర్మ కూడా ఒకింత ఘాటుగానే వ్యాఖ్యానించారు. ఎవరో ఏదో అన్నంత మాత్రాన తాను జీరో కానని అన్నారు. అయితే ఈ వివాదం టీకప్పులో తుపాను మాదిరిగా తేలిపోయింది. మంత్రి నారాయణ తాను టెలీకాన్ఫరెన్స్ లో మాట్లాడిన మాటలను ఎవరో ఎడిట్ చేసి, కట్ చేసి , పేస్ట్ చేసి తాను వర్మ విషయంలో ఏమో మాట్లాడినట్లుగా తప్పుడు ప్రచారానికి పాల్పడ్డారని   క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే  విశాఖ పర్యటనకు వచ్చిన మంత్రి నారాయణను వర్మ కలిశారు. ఈ సందర్భంగా ఆ వీడియోపై ఇరువురి మధ్యా చర్చ జరిగింది.  మంత్రి నారాయణ క్లారిటీ ఇవ్వడంతో వర్మ సంతృప్తి చెందారు. దీంతో వివాదం సమసింది. కాగా మంత్రి నారాయణ తాను ఆ టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడినదంతా బహిర్గతం చేసి ఉంటే వక్రీకరణ ఎలా జరిగిందో, తాను అనని మాటలను అన్నట్లుగా ఎలా సృష్టించారో అర్ధమయ్యేదని వివరించారు.   అనని మాటలను అన్నట్లుగా వక్రీకరించి మా మధ్య విభేదాలు సృష్టించడం ఎవరి వల్లా సాధ్యం కాదని నారాయణ చెప్పారు. ఇక వర్మ వివాదమేం లేదని ప్రకటించడమే కాకుండా, పిఠాపురంలో తెలుగుదేశం, జనసేన మధ్య విభేదాలు లేవనీ, రెండు పార్టీలూ సమన్వయంతో పని చేస్తున్నాయనీ అన్నారు.  ఈ సందర్భంగా వర్మ చంద్రబాబు ఆగమంటే ఆగుతాను.. దూకమంటే దూకుతానని చెప్పారు. మంత్రి నారాయణ తన గురించి ఏవో వ్యాఖ్యలు చేశారంటూ అభూత కల్పనలు ప్రచారం చేశారనీ,  అటువంటి అసత్య ప్రచారాలను తాను పట్టించుకోననీ అన్నారు.   కూటమి పార్టీల మధ్య విబేధాలు సృష్టించడం ఎవరి తరం కాదని వర్మ పేర్కొన్నారు.  

కాంగ్రెస్ అభ్యర్థికే మా మద్దతు.. అసదుద్దీన్ ఒవైసీ

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగనున్న ఉప ఎన్నికలో మస్లిస్ పార్టీ మద్దతు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కే అని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. బీజేపీని నిలువరించేందుకే తాము జూబ్లీలో పోటీ చేయకుండా, కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నట్లు ఒవైసీ తెలిపారు.  జూబ్లీహిల్స్ బైపోల్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ శుక్రవారం (అక్టోబర్ 17) నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. నామినేషన్ దాఖలుకు ముందు ఆయన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీనీ కలిసి మద్దతు కోరారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నేత అజారుద్దీన్ కూడా నవీన్ యాదవ్ వెంట ఉన్నారు.  ఆ సందర్భంగా ఒవైసీ నవీన్ యాదవ్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. బీఆర్ఎస్ రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉందనీ, ఆ పదేళ్లూ కూడా జూబ్లీ నియోజకవర్గానికి ఆ పార్టీ అభ్యర్థే ఎమ్మెల్యేగా ఉన్నారన్నారు. అయితే నియోజకవర్గం మాత్రం ఇసుమంతైనా అభివృద్ధి చెందలేదని విమర్శించారు.  నియోజకవర్గ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారన్న అసదుద్దీన్ ఒవైసీ.. ఈ ఉప ఎన్నిక నియోజకవర్గ అభివృద్ధికి ఒక అవకాశమన్నారు.   నియోజకవర్గంలోని అన్ని వర్గాలను కలుపుకుని ముందుకు సాగాలని నవీన్ యాదవ్‌కు సూచించారు. . నవీన్ యాదవ్ గతంలో మజ్లిస్ పార్టీ నుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోటీచేసిన సంగతి తెలిసిందే.  గత ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి బదిలీ అయ్యాయన్న ఒవైసీ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌లో 37 శాతం ఓట్లు సాధించిన బీఆర్ఎస్ ఆ తర్వాత 5 నెలలకు జరిగిన లోక్ సభ ఎన్నికల్లో 15 శాతానికి పడిపోయిందని అసదుద్దీన్ గుర్తు చేశారు. నవీన్ యూదవ్ 2014 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి మజ్లిస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి, మాగంటి గోపీనాథ్ చేతిలో ఓడిపోయారు. 2018లో నవీన్ యాదవ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మూడో స్థానానికి పరిమితమయ్యారు.  

వైసీపీ ఫేకు ప్రచారంపై కేంద్రం సీరియస్!

ప్రధాని నరేంద్రమోడీ కర్నూలు పర్యటన సూపర్ సక్సెస్ అయ్యింది. ఆయన చేసిన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు నవ్యాంధ్రప్రదేశ్ లో నవశకానికి నాంది పలికిందన్న అభిప్రాయాన్ని పరిశీలకులు సైతం వ్యక్తం చేస్తున్నారు. భారీ ఎత్తున అభివృద్ధి పథకాలు జోరందుకోవడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం నెలకొంది. ఈ తరుణంలో వైసీపీ మళ్లీ తన ఫేక్ ప్రచారానికి తెరలేపింది. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి విధానాలపై ప్రధాని నరేంద్రమోడీకి తాము ఒక మెమోరాండం ఇచ్చామంటూ వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు. ఆ మెమోరాండం కూడా ప్రధాని కర్నూలు పర్యటనలోనే ఇచ్చామని చెప్పుకున్నారు. అయితే తెలుగుదేశం ఈ ప్రచారాన్ని వెంటనే ఖండించింది.  అసలింతకీ విషయమేంటంటే..   ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ క‌ర్నూలు పర్యటన నేపథ్యంలో ఆయనకు స్వాగతం పలికేందుకు అధికార పార్టీ సహా స్థానిక ప్రజా ప్రతినిథులకు ప్రొటోకాల్ ప్రకారం ఆహ్వానాలు అందాయి. అందులో భాగంగానే  స్థానిక ఎమ్మెల్యే వైసీపీ నేత‌ విరూపాక్షి,   ఎమ్మెల్సీ మ‌ధుసూద‌న్‌, క‌ర్నూలు జడ్పీ చైర్మన్ కు కూడా ఆహ్వానాలు అందాయి. ఆ ఆహ్వానం మేరకు ప్రధాని మోడీకి స్వాగతం పలికేందుకు వారు వచ్చారు. ప్రధాని పుష్పగుచ్ఛం ఇచ్చారు.    కానీ వారు ఆ తరువాత మీడియా ముందుకు వచ్చి తాను ప్రధాని మోడీకి   రాష్ట్రంలో  మెడిక‌ల్ కాలేజీల‌ ప్రైవేటీక‌ర‌ణ, ప్రభుత్వ విధానాలపై ప్రధానికి వినతిపత్రంలో ఫిర్యాదు చేశామని చెప్పుకున్నారు.  అయితే తెలుగుదేశం నాయకులు వెంటనే దీనిని ఖండించారు. వారు కేవలం ప్రొటోకాల్ ప్రకారం వచ్చి ప్రధానికి పుష్పగుచ్ఛం మాత్రమే ఇచ్చారని స్పష్టం చేశారు.  ఇదిలా ఉండగా.. వైసీపీ నేతలు ప్రధానికి వినతిపత్రం ఇచ్చామని చెప్పుకున్న వ్యవహారంపై కేంద్రం సీరియస్ అయ్యింది. ఈ వ్యహారంపై ఇంటెలిజెన్స్ ను అలర్ట్ చేసింది. అసలు ఏం జరిగింది? ప్రధానికి వారు నిజంగానే వినతిపత్రం ఇచ్చారా? ఇస్తే ఆ వినతి పత్రాన్ని స్వీకరించిందెవరు? తదితర విషయాలపై నివేదిక ఇవ్వాలని ఇంటెలిజెన్స్ రాష్ట్ర డీజీపీని కోరింది. ఒక వేళ వైసీపీ నేతలది వినతి పత్రం విషయంలో ఫేక్ ప్రచారమే అని తేలిసే సీరియస్ గా చర్యలు తప్పవని కేంద్రం వర్గాలు హెచ్చరిస్తున్నాయి.  

ఆంధ్రా పచ్చళ్లే కాదు.. పెట్టుబడులూ స్పైసీయే!

ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారడం.. పరిశ్రమల స్థాపనకు ఏపీని మించిన రాష్ట్రం లేదని పారిశ్రామిక వేత్తలు భావిస్తుండటం పొరుగున ఉన్న కర్నాటక రాష్ట్రానికి కంటగింపుగా మారింది. దీంతో ఉన్నవీలేనివీ కల్పించి ఏపీపై దుష్ప్రచారానికి తెగబడుతున్నది ఆ రాష్ట్రం. ఈ విషయంలో కర్నాటక మంత్రులే ముందువరుసలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు.  హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలను కాదని మరీ ఇన్వెస్టర్లు, ఇండస్ట్రియలిస్టులు ఏపీకి క్యూ కడుతున్నారు. సహజంగానే ఈ పరిస్థితి ఆయా రాష్ట్రాలకు కడుపుమంటగా ఉంటుంది. అయితే కర్నాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ కడుపుమంట మరీ ఎక్కువగా ఉంది.  ఆ రాష్ట్ర ఐటీ మంత్రి ఏపీలోని విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు రావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుచిత రాయితీలు ఇచ్చిందంటూ వ్యాఖ్యానించారు.  సామాజిక మాధ్యమ వేదికగా కర్నాటక ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే.. గూగుల్ వైజాగ్ నే ఎంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం 22 వేల కోట్ల రూపాయల రాయతీలు ఇవ్వడమేననీ, అలాగే రాష్ట్ర జీఎస్టీలో వంద శాతం రీయింబర్స్ మెంట్, భూమి ధరపై పాతిక శాతం డిస్కౌంట్, ఉచిత విద్యుత్ ట్రాన్స్ మిషన్, వాటర్ టారిఫ్ పై పాతిక శాతం రాయతీలు ఇచ్చిందనీ..ఈ స్థాయిలో రాయితీలు ఇచ్చిన రాష్ట్రం ఆర్థికంగా దివాళీ తీయడం ఖాయమని ఖర్గే వ్యాఖ్యానించారు. నిస్సందేహంగా ఆయన వ్యాఖ్యలు ఏపీకి గూగుల్ వచ్చిందన్న కడుపుమంటతోనే అన్నది ఎవరికైనా సులువుగా అర్ధమైపోతుంది.  కర్నాటక మంత్రి ఖర్గే వ్యాఖ్యలపై ఏపీ ఐటీ మంత్రి దీటైన బదులిచ్చారు. ఎక్కడా కర్నాటక పేరు కానీ, ఆ రాష్ట్ర మంత్రి  ప్రియాంక ఖర్గే పేరుకానీ ప్రస్తావించకుండానే లోకేష్ ఘాటుగా రిటార్డ్ ఇచ్చారు. ఈ మేరకు లోకేష్ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో  ‘ఏపీలో పచ్చళ్లు మాత్రమే కాదు.. పెట్టుబడులూ స్పైసీయే’ అని పేర్కొన్నారు. ఆ ఘాటును, వేడిని పొరుగురాష్ట్రాల ప్రజలు ఇప్పటికే అనుభవిస్తున్నారని పేర్కొన్నారు.

కాంగ్రెస్ లో కొండా కుటుంబ ప్రస్థానం ముగిసినట్లేనా?

కాంగ్రెస్ లో కొండా కుటుంబ ప్రస్థానం ముగిసిందా? అన్న ప్రశ్నకు పరిశీలకులు ఔననే సమాధానమే ఇస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగా ఉన్న కొండా సురేఖ కు మరో మంత్రి పొంగులేటి సుధాకరరెడ్డితో మేడారం జాతర పనుల వ్యవహారంలో తలెత్తిన విభేదాలు చినికిచినికి గాలివానగా మారిన చందంగా ముదిరిపాకాన పడ్డాయి. ఈ విషయంలో కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి ఒకింత దూకుడుగా వ్యవహరించడం సమస్యను మరింత పెద్దది చేసింది. ఇక కొండా సురేఖ ఓఎస్డీ తీరు కూడా వివాదాస్పదంగా మారింది. పలు ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ప్రభుత్వం ఆయనను విధుల నుంచి తొలగించింది. ఆయన వసూళ్ల వ్యవహారం రచ్చకెక్కింది. తుపాకి గురి పెట్టి మరీ మామూళ్ల కోసం బెదరించేవారన్న ఆరోపణలు, ఫిర్యాదులపై ఆయనపై కేసు నమోదైంది. అయితే ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకోకుండా కొండా సురేఖ అడ్డుకోవడమే కాకుండా తన నివాసంలో ఆశ్రయం ఇవ్వడం, ఆమె నివాసానికి వచ్చిన పోలీసులతో కొండా సురేఖ కుమార్తె వాగ్వాదానికి దిగడమే కాకుండా, మీడియా ఎదుట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్, పొంగులేటిలపై తీవ్ర ఆరోపణలు చేయడం పరిస్థితి చేయిదాటిపోవడానికి కారణమైంది. ఇక ఆమె కేబినట్ పదవికి సీఎం ఉద్వాసన పలకడమో, లేక ఆమే రాజీనామా చేయడమో వినా మరో మార్గం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సీఎంపై అపారమైన విశ్వాసం ఉందంటూ కొండా సురేఖ భర్త కొండా మురళి ఓ ప్రకటనలో పేర్కొని పరిస్థితిని చక్కదిద్దడానికి చేసిన ప్రయత్నం ఫలించే అవకాశాలు కనిపించడం లేదంటున్నారు. సీఎంపైన కొండా దంపతుల కుమార్తె చేసిన విమర్శలు అన్ని హద్దులనూ దాటేశాయని చెబుతున్నారు.  ఈ నేపథ్యంలోనే ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్ నుంచి కొండా సురేఖకు పిలుపు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎమ్మెల్యే క్వార్టర్స్ లో తనను కలవాల్సిందిగా మీనాక్షి నటరాజన్ కొండా సురేఖకు ఫోన్ చేసి ఆదేశించినట్లు సమాచారం. ఈ భేటీ తరువాత కొండా సురేఖ విషయంలో పార్టీ అధిష్టానం నిర్ణయమేంటనేది తెలిసే అవకాశం ఉందని అంటున్నారు.  

లంక‌ల దీప‌క్ రెడ్డి.. ల‌క్కెంత‌.. కిక్కెంత‌?

ప్ర‌స్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ అభ్య‌ర్ధిగా బ‌రిలోకి దిగుతున్న‌ లంక‌ల దీప‌క్ రెడ్డి 2023 ఎన్నిక‌ల్లోనూ జూబ్లీహిల్స్ లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక న‌వీన్ సైతం ఇంచుమించు ఇలాంటి ట్రాక్ రికార్డే క‌లిగి  ఉన్నారు. కానీ, ఆయ‌న‌కీ ఈయ‌న‌కీ ఉన్న తేడా ఒక్కటే..  అధికార‌పార్టీ.  దీప‌క్ రెడ్డి ప్రాతినిథ్యం వ‌హించే పార్టీ సైతం కేంద్రంలో అధికారంలో ఉంది. కానీ ఇక్క‌డ అదేమంత ప‌ని చేసేలా లేదు. గ‌తంలో దుబ్బాక ఉప ఎన్నిక‌ల్లో ర‌ఘునంద‌న్ స్థాయి గెలుపు దీపక్ రెడ్డి నుంచి ఆశించ‌డం అయ్యే ప‌ని కాదు. కార‌ణం అప్ప‌ట్లో ఉన్న సిట్యువేష‌న్ వేరు- ఇప్పుడున్న ప‌రిస్థితి వేరు.  ఉన్న స‌మ‌స్య‌లు చాల‌వ‌న్న‌ట్టు.. దీప‌క్ రెడ్డి పోటీ చేస్తున్న జూబ్లీహిల్స్.. బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం కావ‌డం ఒక ఆటంక‌మైతే.. రెండోది ఇక్క‌డ అత్య‌ధికంగా మైనార్టీ ఓట్లుండ‌టం. దీప‌క్ ఇక్క‌డి మైనార్టీల‌ను ఆక‌ర్షించ‌డంలోనూ త‌ప్ప‌ట‌డుగులు వేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఒక ఇంట‌ర్వ్యూలో చెబుతూ మైనార్టీలు ఎంఐఎం పార్టీ అధినేత చెప్పింద‌ల్లా చేసే గొర్రెలు కారంటూ ప‌రుష ప‌ద‌జాలం వాడారు.  ఆమాట‌కొస్తే తాము బీసీల‌కు ఎంతో మేలు చేస్తోన్న పార్టీకి చెందిన వార‌మ‌నీ. ఇంకా మాట్లాడితే త‌మ ప్ర‌ధానే ఒక బీసీ బిడ్డ అంటూ చెప్పుకొచ్చారు దీప‌క్ రెడ్డి. కానీ, ఇక్క‌డ కాంగ్రెస్ ఇచ్చిన‌ట్టు ఒక బీసీ బిడ్డ‌కు టికెట్ ఇచ్చి ఉంటే ఆ మాట‌కు ఒక అర్ధ‌ముండేది. అంతే కాకుండా ఎంద‌రో మ‌హిళ‌లు పోటీ ప‌డ‌గా.. వారంద‌రినీ తోసి రాజ‌ని.. త‌నకున్న కిష‌న్ రెడ్డి స‌పోర్ట్ మొత్తాన్ని వాడారు దీప‌క్ రెడ్డి. దీంతో ఇది కూడా పార్టీకి మైన‌స్ గా మారి దీప‌క్ రెడ్డి విజ‌యావ‌కాశాల‌ను గండి కొట్టేలా కనిపిస్తోంది. ఇటు బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం నుంచి అది కూడా క‌న్నీటిప‌ర్యంత‌మై ప్ర‌చారం చేస్తున్న సునీత ముందు, అధికార పార్టీకి చెందిన  లోక‌ల్ బాయ్ న‌వీన్ ముందు.. దీప‌క్ రెడ్డి జూబ్లీహిల్స్ అనే ఈ లంక‌ను జ‌యించ‌డం అంత సులభసాధ్యం కాదంటున్నారు పరిశీలకులు.  కాకుంటే ఈ ప్రాంతం ఇప్పుడు జ‌న‌ర‌ల్ అయ్యిందిగానీ గ‌తంలో ఇది ఎస్సీ స్థానం. ముస్లిం మైనార్టీలు ఎక్కువున్న ప్రాంతం  కూడా  కావ‌డంతో.. ఇక్క‌డ దీప‌క్ రెడ్డిది పేరుకు పోటీ కానీ.. అస‌లు యుద్ధం మొత్తం సునీత‌, న‌వీన్ మ‌ధ్య ఉండ‌నుంద‌ని అంటున్నారు విశ్లేషకులు.

కాంగ్రెస్‌లో పేలనున్న కొండా దంపతుల టైంబాంబ్ !

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఓ పెద్ద సంక్షోభం ముంగిట నిలిచింది. పార్టీలో మంత్రి కొండా సురేఖ వ్యవహారం ముదిరి పాకాన పడింది. సుమంత్ అనే వ్యక్తి  ఓఎస్డీ గా చేసిన నిర్వాకాల కారణంగా ఆయనను ప్రభుత్వం పదవి నుంచి తప్పించింది. అదే సమయంలో ఓ సిమెంట్ ఫ్యాక్టరీ యజమానిని తుపాకీ పెట్టి పాయింట్ బ్లాంక్ లో బెదిరించారంటూ ఫిర్యాదు రావడంతో ఆయనను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. కానీ ఆ సుమంత్ ను స్వయంగా రక్షించి తనతో పాటు తీసుకెళ్లారు కొండా సురేఖ. ఆమె కుమార్తె సీఎంతో పాటు పలువురు తన తల్లిపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించేశారు. ఇంత దాకా వచ్చిన తర్వాత ఇక ఈ వివాదం ఇంతటితో ఆగే అవకాశం కనిపించడంలేదు.  కొండా సురేఖ వ్యవహారం కొన్నాళ్లుగా వివాదాస్పదమవుతోంది. ఆమె వద్ద ప్రైవేటు ఓఎస్డీగా పని చేస్తున్న సుమంత్ కొండా సురేఖ నిర్వహిస్తున్న దేవాదాయ, అటవీ శాఖలతో సంబంధం ఉన్న వ్యాపార, పారిశ్రామిక వర్గాల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వసూళ్ల కోసం   స్వయంగా సుమంత్ బెదిరింపులకు దిగుతున్నారు.   డెక్కన్ సిమెంట్స్ అనే సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని తుపాకీతో బెదిరించినట్లుగా చెబుతున్నారు. చివరికి మేడారం పనుల కాంట్రాక్టర్ ను కూడా బెదిరించినట్లుగా ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ప్రభుత్వ పెద్దల్లో ఒక్క సారిగా ఆగ్రహం వచ్చింది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కల్పించుకుని సురేఖ ఓఎస్డీ సుమంత్ ను తీసేయమని ఆదేశించారు. ఆయనను అదుపులోకి తీసుకోవాలని ఆదేశాలు రావడంతో పోలీసులు ప్రయత్నించారు.  సుమంత్ ను అదుపులోకి తీసుకునేందుకు వచ్చిన పోలీసులకు మంత్రి కొండా సురేఖ షాక్ ఇచ్చారు. ఆయనకు తన ఇంట్లోనే షెల్టర్ ఇచ్చారు. పోలీసులు ఆచూకీ తెలుసుకుని అక్కడికి వచ్చినప్పుడు సురేఖ కుమార్తె పోలీసులతో వాగ్వాదానికి దిగారు. విపక్ష పార్టీ నేతల్లా.. తన తల్లి, తండ్రిపై సీఎంతో పాటు ముఖ్యనేతలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. బీసీలం అయిన తమను వేధిస్తున్నారని చెప్పుకొచ్చారు. అదే సమయంలో ఓఎస్డీని తీసుకుని కొండా సురేఖ వేరే కారులో వెళ్లిపోయారు. దీంతో పోలీసులు సుమంత్ ను అదుపులోకి తీసుకోలేకపోయారు. దీంతో ఓఎస్డీ తో అన్ని పనులు చేయించింది కొండా దంపతులేనని అనుమానాలు బలపడుతున్నాయి.  స్వయంగా ముఖ్యమంత్రి తమపై కుట్ర చేస్తున్నారని ఓ మంత్రి ఆరోపించడం చిన్న విషయం కాదు. ఓ మంత్రిపై సీఎం విశ్వాసం కోల్పోయినా.. ఆ మంత్రి సీఎంపై నమ్మకం కోల్పోయినా మంత్రి వర్గంలో ఉండలేరు . ఇప్పుడు అదే జరిగే అవకాశం ఉందంటున్నారు పరిశీలకులు. కొండా సురేఖను మంత్రి వర్గం నుంచి తప్పించడం లేదా ఆమే రాజీనామా చేయడం జరగడం ఖాయంగా కనిపిస్తోంది. తమను అరెస్టు చేస్తారని కొండా సురేఖ, కొండా మురళీ కూడా ఆందోళన చెందుతున్నారు. ఇదే విషయాన్ని ఆయన కుమార్తె చెబుతున్నారు. అలాంటి పరిస్థితే వస్తే బయటకు తెలియనిది ఏదో పెద్ద ఘటనే జరిగిందని అనుకోవాలి.

నారా లోకేష్ అచ్చం నాన్నలాగే.. ఈ మాట ఎవరన్నారో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రికి సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా  నారా లోకేష్ ఇంతింతై వటుడింతై అన్నట్లుగా రాజకీయంగా ఎదుగుతున్న తీరు ప్రత్యర్థి పార్టీలకు వణుకు పుట్టిస్తుంటే..  పార్టీ సీనియర్ నాయకులు,  మంత్రులు,  ఎమ్మెల్యేలు పార్టీ శ్రేణులూ లోకేష్ నాయకత్వంపై పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అలాగే లోకేష్ మాట తీరు, ప్రజలలో మమేకమౌతున్న విధానంతో ప్రజానేతగా ప్రజలు కూడా సంపూర్ణ ఆమోదం పలుకుతున్నారు. ఇటు పార్టీలో, ప్రజలలో అభిమానం పెంచుకోవడమే కాదు, అటు హస్తినలో కూడా రాష్ట్ర ప్రయోజనాల సాధన కోసం చేస్తున్న పర్యటనలతో లోకేష్ జాతీయ స్థాయిలో సైతం గుర్తింపు పొందారు.   అయితే లోకేష్ కు ఈ గుర్తింపు అంత తేలికగా ఏమీ రాలేదు. నారా లోకేష్ రాజకీయాలలో తొలి అడుగులు పడకముందే ఆయన నడకను ఆపేయాలని చూశారు. రాజకీయాలలో ఓనమాలు దిద్దడానికి ముందే ఆయన ఎదుగుదలను అణచివేయాలన్న ప్రయత్నాలు జరిగాయి. పొలిటికల్ గా నారా లోకేష్ తొలి పలుకులు కూడా బయటకు రాకూడదన్న ప్రయత్నాలు జరిగాయి.   బాడీ షేమింగ్ చేశారు. హేళన చేశారు. టార్గెట్ చేసి మరీ క్యారెక్టర్ అసాసినేషన్ కు ప్రయత్నించారు. అయితే వాటన్నిటినీ తట్టుకుని, ఎదుర్కొని, తనను తాను మలచుకున్న లోకేష్ కు తాజాగా ప్రధాని నరేంద్రమోడీ నుంచి అద్భుతమైన ప్రశంస లభించింది.  ప్రధాని ఆంధ్రప్రదేశ్ పర్యటన సందర్భంగా కర్నూలు విమానాశ్రయం వద్ద ఆయనకు స్వాగతం పలకడానికి తండ్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో పాటు మంత్రి లోకేష్ కూడా వెళ్లారు. ఈ సందర్భంగా లోకేష్ తో  కొద్ది సేపు ముచ్చటించారు. ఆ సందర్భంగా లోకేష్ ను మోడీ ప్రశసంలతో ముంచెత్తారు. ముఖ్యంగా ఫిట్ నెస్ విషయంలో లోకేష్ ను ఆయన పొగిడారు. ఇంతకు ముందు కంటే బరువు తగ్గారంటూ వ్యాఖ్యానించిన ప్రధాని మోడీ.. త్వరలోనే నాన్నలా తయారౌతారంటూ కితాబిచ్చారు. ఏడున్నర పదుల వయస్సులో చంద్రబాబు ఎంత చలాకీగా ఉంటారో అందరికీ తెలిసిందే. ఇప్పటికే  పొలిటికల్ గా, అడ్మినిస్ట్రేటర్ గా నారా లోకేష్ తండ్రికి తగ్గతనయుడిగా కితాబులందుకున్నారు. ఇప్పుడు ప్రధాని నరేంద్ర లోకేష్ ఫిట్ నెస్ ను కూడా తండ్రితో పోల్చి ప్రశంసించడం గమనార్హం.