రేవంత్ కోసం చంద్రబాబుకి అమిత్ షా ఫోన్?
posted on Dec 2, 2023 @ 10:20AM
టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి దూకుడుతో భవిష్యత్ లో తమకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయని.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తోపాటు బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలు ముందే ఊహించారా? ఆ క్రమంలో రేవంత్‌రెడ్డికి బీజేపీ కండువా కప్పే ప్రయత్నాలు జరిగాయా? అందులో భాగంగా.. రేవంత్‌రెడ్డిని ఒప్పించాలంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు కేంద్ర మంత్రి అమిత్ షా పోన్ చేసి మరీ కోరారా? అయితే చంద్రబాబు అందుకు నో చెప్పారా? అంటే ఔననే సమాధానమే వస్తోంది. అయితే ఇదంతా గతంలో జరిగిందని అంటున్నారు. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న వేళ.. ఈ చర్చ తెలంగాణ సమాజంలో విస్తృతంగా జరుగుతోంది.
2014లో ఓ వైపు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయితే.. మరోవైపు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో 15 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ నుంచి విజయం సాదించగా.. ఆ తర్వాత బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్) అధినేత సీఎం కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ అంటూ ఎర్రబెల్లి, తలసాని, కడియం వగైరా వగైరా నేతలను కారెక్కించేశారు. కానీ అతికొద్ది మంది మాత్రమే తెలుగుదేశం పార్టీని అంటి పెట్టుకొని ఉన్నారని... వారిలో రేవంత్ రెడ్డి ఒకరు. అయితే ఆ తర్వాత చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. కానీ ఇక్కడే కీలక పరిణామాలు తెరచాటుగా చోటు చేసుకొన్నాయనే ఓ చర్చ పొలిటికల్ సర్కిల్ లో జరుగుతోంది.
అదేమంటే.. 2017, అక్టోబర్ 31న.. రేవంత్ రెడ్డి హస్తం పార్టీకి స్నేహ హస్తం అందించిన రోజు... అయితే అంతకు కొద్దిరోజుల ముందు బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్) అధినేత, సీఎం కేసీఆర్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి.. ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి.. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని... అదే జరిగితే.. భవిష్యత్ లో రేవంత్ వల్ల తమ పార్టీకే కాదు, బీజేపీకి సైతం ముప్పు ఏర్పడే అవకాశాలున్నాయనీ చెప్పారనీ, దానిని నివారించేందుకు రేవంత్ ను బీజేపీలోకి తీసుకోవాలనీ కోరినట్లు చెబుతున్నారు. రేవంత్ బీజేపీలో చేరితే.. తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకునే అవకాశాలు లేశమాత్రంగా కూడా ఉండవని చెప్పారని అంటున్నారు. రేవంత్ రెడ్డి.. చంద్రబాబు మాట తప్ప.. మరోకరి మాట వినే రకం కాదంటూ అమిత్ షాకు కేసీఆర్ గట్టిగా చెప్పినట్లు పోలిటికల్ సర్కిల్స్ లో అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కేసీఆర్ సూచన మేరకు అమిత్ షా చంద్రబాబుకు ఫోన్ చేసి రేవంత్ బీజేపీలో చేరేలా ఒప్పించాలని కోరారని, అయితే అందుకు చంద్రబాబు నిరాకరించారని చెబుతున్నారు.
అయితే అమిత్ షా అంత చొరవగా చంద్రబాబును ఎన్డీయే బాగస్వామిగా ఉండటమేనని కూడా అంటున్నారు. ఆ చొరవతోనే చంద్రబాబుకు ఫోన్ చేసిన అమిత్ షా రేవంత్ ను బీజేపీలో చేరేలా ఒప్పించాల్సింగా కోరారు. అందుకు చంద్రబాబు రేవంత్ తమ పార్టీకి రాజీనామా చేశారనీ, ఆయనతో తాను ఎలా మాట్లాడి ఒప్పించగలననీ చెప్పినా, అమిత్ షా అందుకు అమిత్ షాకు టీడీపీ జాతీయ అధినేత బదులిస్తూ.. కొద్ది రోజుల క్రితమే ఆయన తమ పార్టీకి రాజీనామా చేశారని... అలాంటి వేళ రేవంత్ రెడ్డితో మాట్లాడి నేనెలా ఒప్పించగలనంటూ.. చెప్పినా అమిత్ షా మాత్రం రేవంత్ రెడ్డికి మీరంటే ఆరాధన, మీకు చెప్పే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. అలాంటిది మీరు చెబితే తప్పకుండా వింటారంటూ ఒత్తిడి చేసినట్లు అప్పట్లో గట్టిగా వినిపించింది. అంతే కాకుండా ప్రధాని మోదీ సైతం రేవంత్‌రెడ్డి బీజేపీ గూటికి రావాలని కోరుకుంటున్నారనీ, అందుకు మీరు సాయం చేస్తే ఆయన సంతోషిస్తారనీ కూడా అమిత్ బాబుపై ఒత్తిడి తెచ్చినట్లు చెబుతారు. అయితే చంద్రబాబు మాత్రం సున్నితంగానే అయినా చాలా స్పష్టంగా రేవంత్ మా పార్టీ వీడారు... అదీకాక రేవంత్ రెడ్డి రాజకీయ భవిష్యత్ ఆయనే నిర్ణయించుకుంటారనీ తాను ఒత్తిడి చేయలేనని చెప్పినట్లు అప్పట్లో చర్చ జరిగింది. ఆ విషయాలన్నీ ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేల మరో సారి సామాజిక మాధ్యమంలో హల్ చల్ చేస్తున్నాయి.
ఆదివారం (డిసెంబర్ 3) ఫలితాలు వెలువడనున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఈ సారి కాంగ్రెస్ విజయం తథ్యమని చెబుతున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సారథ్యం వల్లే ఇది సాధ్యమైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ తరుణంలో దాదాపు ఆరేళ్ల కిందట గులాబీ బాస్ కేసీఆర్, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. రేవంత్ విషయంలో వేసిన ఆంచనాలు ఏ మాత్రం తూ చా తప్పకుండా జరిగుతున్నదనే విషయం సుస్పష్టమవుతోందని రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
అదీకాక.. అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత, అలాగే బీజేపీ ఎంపీ దర్మపూరి అర్వింద్‌లు వేర్వేరు సభల్లో తమ ప్రధాన ప్రత్యర్థి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాత్రమే అని ప్రకటించడమే ఇందుకు నిదర్శమని పరిశీలకులు చెబుతున్నారు. ఇక కల్వకుంట్ల కవిత, దర్మపూరి అర్వింద్ ఇద్దరు నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేయగా.. ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అర్వింద్ చేతిలో కల్వకుంట్ల కవిత ఓటమి పాలయ్యారని... కానీ వీరిద్దరూ ఇప్పుడు ఒకే గూటి పక్షుల్లాగా ఒకే మాట పలుకుతుండడం కోసమెరుపు.