అమరావతి శంఖుస్థాపనశిలాఫలకంపై ఉండే పేర్లు ఇవే
posted on Oct 21, 2015 @ 11:48PM
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంఖుస్థాపన శిలాఫలకం మీద మొత్తం 16మంది పేర్లు చెక్కబడ్డాయి. వాటిలో అన్నిటి కంటే పైవరుసలో ప్రధాని నరేంద్రమోడి, గవర్నర్ నరసింహన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్లు, ఆ క్రిందన ఎడమవైపున వరుసగా కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, అమరావతి నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ అందించిన సింగపూర్ మంత్రి ఈశ్వరన్,నాగాలాండ్ గవర్నర్ పద్మనాభ బాలకృష్ణ ఆచార్య,తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్,బండారు దత్తాత్రేయ,అమరావతి నిర్మాణంలో పాలుపంచుకుంటున్న జపాన్ మంత్రి ఇసుకే టకాచీ పేర్లు ఈ శిలాఫలకంపై ఉంటాయి.
కుడివైపున వరుసగా అశోక్ గజపతిరాజు,తమిళనాడు గవర్నర్ రోశయ్య, పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ ,సుప్రీంకోర్టు జడ్జి ఎన్.వి. రమణ, నిర్మలా సీతారామన్, సుజనా చౌదరిలపేర్లు ఉంటాయి.