5 నిమిషాల టైం ఇవ్వండి మోడీ.. కాంగ్రెస్ ఎంపీలు
posted on Oct 14, 2015 @ 11:26AM
ఏపీ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ విచ్చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు చిరంజీవి, కేవీపీ రామచంద్రరావు, సుబ్బిరామిరెడ్డి, జైరామ్ రమేశ్, జేడీ శీలం ఆయనకు ఘన స్వాగతం పలుకుతామని చెప్పారు. అంతే కాదు కాంగ్రెస్ నేతలందరూ కలిసి ప్రధానికి ఓ లేఖ రాశారు. ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన కార్యక్రమానికి వస్తున్న సందర్భంగా తమకు ప్రత్యేక హోదా గురించి.. ప్రత్యేక ప్యాకేజీల మాట్లాడేందుకు ఓ ఐదు నిమిషాల టైం ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో ఉన్న హామీలను నెరవేర్చాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని గత ఎన్నికల ప్రచారంలో మోడీ హామీ ఇచ్చారని.. ఇప్పుడు ఆ హామీని నేరవేర్చాలని అన్నారు. అలాగే హామీలను ఎవరు అమలు చేశారన్నది ముఖ్యం కాదని అమలయ్యాయా లేదా? అన్నదే ప్రధానమని శీలం విలేకరులతో చెప్పారు. మరి మోడీ వాళ్లకి టైం కేటాయిస్తారో లేదో చూడాలి.