అమరావతి శంకుస్థాపన షెడ్యూల్ ఇదే
posted on Oct 21, 2015 @ 5:43PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమరావతి శంకుస్థాపన కార్యక్రమ షెడ్యూల్ ను విడుదల చేసింది, ప్రధాని నరేంద్రమోడీతోపాటు దేశ విదేశీ ప్రముఖులు హాజరయ్యే అమరావతి ఫౌండేషన్ మెయిన్ ప్రోగ్రాం మధ్యాహ్నం 12గంటల తర్వాతే మొదలుకానుంది, మధ్యాహ్నం పన్నెండున్నరకి ప్రధాన వేదిక దగ్గరకు చేరుకోనున్న మోడీ... 12.35కి అమరావతి గ్యాలరీని సందర్శిస్తారు, అనంతరం 12.43 గంటల్లోపే రాజధానికి శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత 12.45కి ప్రధాన వేదిక దగ్గరకు చేరుకుంటారు, 12.48 నుంచి 12.50 వరకు ‘మా తెలుగుతల్లి‘ గీతాలాపన, మధ్యాహ్నం 12.50 నుంచి 12.53 వరకు జపాన్ మంత్రి తకాగి స్పీచ్, 12.53 నుంచి 12.56 వరకు సింగపూర్ మంత్రి ఈశ్వరన్, 12.56 నుంచి ఒంటి గంట వరకూ కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రసంగిస్తారు, మధ్యాహ్నం ఒంటిగంట నుంచి ఒంటి గంటా 11 నిమిషాల వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడనున్నారు, చివరిగా ఒంటి గంటా 11 నిమిషాల నుంచి 143 వరకు ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగించనున్నారు