పదవీ విరమణకు ముందు భంగపడిన చీఫ్ జస్టిస్ కబీర్
posted on Jul 19, 2013 @ 11:10AM
పలు సంచలనాత్మకమయిన తీర్పులు వెలువరించి భారత న్యాయ వ్యవస్థకే వన్నెతెచ్చిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి అల్తమాస్ కబీర్ ఈరోజు పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో జస్టిస్ పీ.సదాశివం ఈరోజు పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కొద్ది వారల క్రిందటే ఆయన నియామకాన్ని ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు.
ఆయన రెండు వారల క్రితం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అల్తమాస్ కబీర్ తనతో సహా హెచ్.యల్.దత్తు, ఆర్.యం.లోదా, పీ.సదాశివం, జీ.యస్.సంగ్వీలతో ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు కలేజియంను హాజరుపరచి, ప్రస్తుతం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చేస్తున్న ఒకరిని సుప్రీంకోర్టు జడ్జీగా నియమించాలని కోరారు.అయితే అప్పటికీ, రాష్ట్రపతి పీ.సదాశివంను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేయడంతో, వారు అల్తమాస్ కబీర్ కోరికను సున్నితంగా తిరస్కరించారు. అయినప్పటికీ ఆయన నలుగురు సభ్యులని తన ప్రతిపాదనపై విడివిడిగా అభిప్రాయలు తెలుపవలసినదిగా కోరడంతో వారు నిర్ద్వందంగా అయన ప్రతిపాదన తిరస్కరించారు. త్వరలో పదవీ విరమణ చేయబోతున్న ఆయన అటువంటి కోరిక కోరడం అనుచితమని, చట్టవిరుద్దమని వారు తేల్చి చెప్పడంతో వారిపట్ల అల్తమాస్ కబీర్ ఆగ్రహంతో ఉన్నారు.
ఏదిఎమయినప్పటికీ, అత్యంత హుందాగా, సమర్ధంగా తన పదవీ బాధ్యతలను నిర్వర్తించిన ఆయనకి కొద్ది రోజులలో పదవీ విరమణ చేయనున్న తరుణంలో ఇటువంటి కోరిక కోరడం వలన భంగపాటు తప్పలేదు. కానీ, అది చంద్రునికి మచ్చవంటిదే.